Home
Apps

100 కోట్ల మంది వాట్సాప్‌ను నిత్యం వాడుతున్నారు!

By Bommu Sivanjaneyulu

ఫేస్‌బుక్ నేతృత్వంలోని వాట్సాప్ సంచలనాల దిశగా దూసుకుపోతుంది. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో అగ్రగామి సంస్థగా అవతరించిన వాట్సాప్‌ను ప్రతినెలా 1.5 బిలియన్ల మంది యూజర్లు యాక్టివ్‌గా ఉపయోగించుకుటున్నట్లు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ తెలిపారు.

రోజుకు 600 కోట్ల మెసేజ్‌లు..

రోజుకు 600 కోట్ల మెసేజ్‌లు..

ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా రోజుకు 60 బిలియన్ల సందేశాలు బట్వాడా కాబుడున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 31తో ముగిసిన 2017 చివరి క్వార్టర్‌గాను నమోదైన ఆర్థిక ఫలితాలను జూకర్‌బర్గ్ కొద్ది గంటల క్రితం వెల్లడించారు. ఈ సందర్భంగా తమ ప్రొడక్ట్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర వివరాలను ఆయన రివీల్ చేసారు.

ఒకటి, రెండూ స్థానాల్లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్

ఒకటి, రెండూ స్థానాల్లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్

2014లో వాట్సాప్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 450 మిలియన్లు గాను, రోజువారి యాక్టివ్ యూజర్ల సంఖ్య 315 మిలియన్లుగాను ఉండేది. ఫేస్‌బుక్ ఈ మెసేజింగ్ యాప్ మరింతగా ఫోకస్ పెట్టడంతో జూలై 2017 నాటికి నెటవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 1.3 బిలియన్లకు, రోజువారి యాక్టివ్ యూజర్ల సంఖ్య 1 బలియన్‌కు చేరుకుంది. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అలానే ఫోటో షేరింగ్ విభాగాల్లో ఇన్‌స్టాగ్రామ్ అలానే వాట్సాప్‌లు ఒకటి, రెండూ స్థానాల్లో కొనసాగుతున్నాయని జూకర్‌బర్గ్ తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు క్రేజ్ పెరుగుతోంది..

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు క్రేజ్ పెరుగుతోంది..

స్నాప్‌చాట్ స్టోరీస్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను ఫేస్‌బుక్ ప్రవేశపెట్టడంతో ఇన్‌స్టాగ్రామ్ యాక్టివ్ యూజర్ల సంఖ్య ఒక్కసారిగా ఊపందుకుంది. తాజాగా రివీల్ అయిన గణాంకాల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, వాట్సాప్ స్టేటస్ వంటి లేటెస్ట్ ఫీచర్లకు రోజువారి యాక్టివ్ యూజర్ల సంఖ్య 300 మిలియన్లుగా ఉంటే, స్నాప్‌చాట్ డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య మాత్రం 178 మిలియన్లుగానే ఉంది.

 కొత్త ఫీచర్లు, ఆధునిక హంగులు..

కొత్త ఫీచర్లు, ఆధునిక హంగులు..

ఇక భారత్ విషయానికి వచ్చేసరికి వాట్సాప్ సేవలను రోజు 20 కోట్ల మంది యూజర్లు యాక్టివ్‌గా ఉపయోగించుకుంటున్నారు. రానున్న నెలల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వాట్సాప్ ఎదుగుదలకు లేటెస్ట్ అప్‌డేట్స్ అనేవి ఎక్కువగా తోడ్పడుతున్నాయి.


Best Mobiles in India

English summary
WhatsApp has hit a milestone of 1.5 billion monthly active users, states the CEO of Facebook Mark Zuckerberg during the Q4 2017 earnings call. It was also revealed that WhatsApp witnessed 60 billion messages sent per day. This is a great growth ever since the platform was acquired by Facebook in 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X