Home
Apps

Whatsapp Filters వాట్సాప్‌లో ఫిల్టర్స్‌ పేరుతో కొత్త ఫీచర్‌.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..!!

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఇటీవల యూజర్లకు మరింత మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్‌ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు సహా కీలక అప్‌డేట్‌లను తీసుకొస్తోంది. అయితే తాజాగా వచ్చిన అప్‌డేట్‌లో ఫీల్టర్స్‌ (Whatsapp Filters) పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఫలితంగా యూజర్లను సౌకర్యంగా వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు.

ఈ ఫిల్టర్స్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, iOS రెండింటిలోనూ అందుబాటులోకి లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొద్దిమందికి మాత్రమే అందుబాటులో వచ్చింది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ చాట్‌ను రీడ్‌, అన్‌రీడ్‌, గ్రూప్‌ వంటి కేటగిరీలుగా ఫిల్టర్‌ చేస్తుంది. ఈ ఫీచర్ హోం స్క్రీన్‌లోనే కనిపిస్తుంది. ఫలితంగా వేగంగా అవసరమైన మెసేజ్‌లకు స్పందించగలుగుతాం.

Whatsapp rolling out Filter feature for both android and iOS

ఈ ఫీచర్‌ బీటా టెస్టింగ్‌ దశలో ఉంది. ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు వాట్సాప్ అనేక కీలక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

** వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ఆధారంగా వాట్సాప్‌ ఆసక్తికర ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఏదైనా అత్యవసర సమయంలో వాట్సాప్‌లో ఉన్న తమ ఫ్రెండ్‌ లేదా సన్నిహితులు యాక్టివ్‌గా ఉన్నారా లేదా అని తనిఖీ చేసేందుకు యూజర్‌ చాట్‌లోకి వెళ్లి Last seen ను పరిశీలిస్తాం. లేదా ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అని తనిఖీ చేస్తాం.

అయితే ఎక్కువ మంది యూజర్ల వివరాల కోసం ప్రతి ఒక్కరి చాట్‌లోకి వెళ్లి ఇలాంటి తనిఖీలు చేయాలి. ఈ ప్రక్రియను మరింత సులభంగా చేసేందుకు వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వాట్సాప్‌ వినియోగదారులు వాట్సాప్‌లో తాజాగా యాక్టివ్‌గా ఉన్న యూజర్లను జాబితా రూపంలో చూడవచ్చు.

ఈ ఫీచర్‌ Recently online పేరుతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ఎంపిక చేసుకున్న కొన్ని కాంటాక్ట్‌లను మాత్రమే ఈ జాబితాలో చూపిస్తుందని తెలుస్తోంది. అయితే వినియోగదారుల భద్రతను దృష్టిలోపెట్టుకొని Last seen మరియు Online Status వివరాలను ఈ జాబితాలో చూపించదని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వాట్సాప్‌ Recently Online Feature కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. అయితే త్వరలోనే మిగిలిన వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫీచర్‌ పనితీరుపై పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

** వెబ్‌ వెర్షన్‌లోనూ (Whatsapp Web) ఇదే తరహా మార్పులు చేస్తోందని తెలుస్తోంది. కొత్తగా చేస్తున్న మార్పులతో నావిగేషన్‌ మెరుగుపడుతుందని తెలుస్తోంది. వెబ్‌ వెర్షన్‌లో నావిగేషన్‌ ఎడమ వైపున కనిపించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సాప్‌ వెబ్‌ బీటా 2.3000.1012734542 అప్‌డేట్‌లో ఉంది.

ఈ ఫీచర్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గత సెప్టెంబర్‌ లోనూ ఇదే తరహా ఫీచర్‌ను వాట్సాప్‌ టెస్టింగ్‌ చేసింది. అయితే తాజాగా అందుబాటులోకి రానున్న డిజైన్ వాట్సాప్‌ వెబ్‌ను సులభంగా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను WAbetainfo షేర్‌ చేసింది.

చాట్‌, కమ్యూనిటీ, ఛానల్స్‌, స్టేటస్‌ సహా ఇతర అన్ని ఐకాన్‌ పొజిషన్‌లో వచ్చిన మార్పును ఈ స్క్రీన్‌ షాట్‌లో గుర్తించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉండగా.. త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరియు మెరుగైన అనుభూతిని కలిగిస్తుందని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Whatsapp rolling out Filter feature for both android and iOS
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X