Home
Apps

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. మీకు నచ్చిన సమయానికి షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!

Whatsapp Scheduled Call Feature : ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ను ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్నారు. వాట్సాప్‌ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అనేక ఫీచర్‌లను లాంచ్‌ చేస్తోంది. తాజాగా ఆకట్టుకొనే ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో కాల్స్ ఫీచర్‌ను మరింత సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు.

వాట్సాప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాల్స్‌ ఫీచర్‌లో మరిన్ని కొత్త ఆప్షన్‌లను జోడించింది. ఈ అప్‌డేట్‌ ప్రపంచవ్యాప్తంగా త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు కాల్స్‌ షెడ్యూల్‌ చేసుకోవచ్చు.

Whatsapp Scheduled Call Feature

రెండు ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంది :
కాల్‌ కోసం తేదీ, సమయం ఎంచుకోవచ్చు. ఆ లింక్‌ను గ్రూప్‌ లేదా విడివిడిగా షేర్‌ చేసుకోవచ్చు. కాల్‌ ప్రారంభం అయ్యే సమయం కంటే ముందుగానే యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్‌ను Scheduled Call Feature పేరుతో పిలుస్తోంది. యూజర్లు ఆడియో, వీడియో ఫార్మాట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

వాట్సాప్‌లో కాల్‌ను ఎలా షెడ్యూల్‌ చేయాలి?
> వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి కాల్‌ ట్యాబ్‌ పైన క్లిక్‌ చేయాలి.
> గ్రూప్‌ లేదా కాంటాక్ట్‌లను ఎంపిక చేసుకోవాలి.
> కాల్‌ షె‌డ్యూల్‌ను ఎంపిక చేసుకోవాలి.
> అనంతరం ఆడియో లేదా వీడియో కాల్‌ ఫార్మాట్‌ను ఎంచుకోవాలి.
> తర్వాత తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి.
> గ్రీన్‌ టెక్‌మార్క్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

వాట్సాప్‌లో కాల్‌ షెడ్యూల్ ఫీచర్‌తోపాటు కాల్ మధ్యలో మాట్లాడాలని భావిస్తే.. Raise hand అనేక ఆప్షన్‌ను ద్వారా అందరికీ తెలియజేసి, వారి అనుమతితో మాట్లాడవచ్చు. దీంతోపాటు వివిధ రకాల ఎమోజీల ద్వారా మీ స్పంద స్పందించవచ్చు.

* వాట్సాప్‌ యూజర్లు స్పామ్‌ బారిన పడకుండా ఉండేందుకు వీలుగా ఇటీవలే సేఫ్టీ ఓవర్‌వ్యూ తీసుకొచ్చింది. మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని వివిధ రకాల గ్రూప్‌లలో యాడ్‌ చేస్తుంటారు. ఇలాంటి యూజర్లు మిమ్మల్ని గ్రూప్‌లో జాయిన్‌ చేసేందుకు ప్రయత్నించే, ఈ గ్రూప్‌ వివరాలు సహా మిమ్మల్ని యాడ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి వివరాలను మీకు అందిస్తుంది.

ఫలితంగా ఈ సేఫ్టీ ఓవర్‌వ్యూ ఫీచర్‌.. మీరు ప్రమాదకరమైన గ్రూప్‌లో జాయిన్‌ కాకుండా అప్రమత్తం చేస్తుంది. దీంతోపాటు కొత్త వ్యక్తులు మీకు మెసేజ్‌ చేస్తే.. వారి వివరాలను కూడా అందిస్తుంది. ఆ మెసేజ్‌ ఎక్కడ నుంచి వచ్చిందో కూడా చెబుతుంది.

* దీంతోపాటు వాట్సాప్‌ స్టేటస్‌లు ఎక్కువ అప్‌లోడ్‌ చేసే వారి కోసం మంచి ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఎక్కువ ఫోటోలను స్టేటస్‌లో విడివిడిగా మాత్రమే అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. లేదా థర్డ్‌ పార్టీ యాప్‌ ద్వారా ఎడిట్‌ చేసి స్టేటస్‌ అ‌ప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఉంది.

థర్డ్‌ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా నేరుగా వాట్సాప్‌ నుంచే ఎక్కువ ఫోటోలను కొలేజ్‌ చేసేందుకు అవకాశం ఉంది. మరియు నేరుగా స్టేటస్‌లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకేసారి 6 ఫోటోల వరకు సెలెక్ట్‌ చేసుకోవచ్చు, కొలేజ్‌గా మార్చుకోవచ్చు.

ఈ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతోపాటు స్టేటస్‌లో మ్యూజిక్‌ స్టిక్కర్స్‌, ఫోటో స్టిక్కర్స్‌ యాడ్‌ చేసుకొనే అవకాశం కూడా రానుంది. ఇప్పటికే స్టేటస్‌లో ఫోటోలకు మ్యూజిక్‌ను యాడ్‌ చేసుకొనే ఫీచర్‌ అందుబాటులో ఉంది. నేరుగా లైబ్రరీ నుంచి కావాల్సిన మ్యూజిక్‌ను జతచేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp introduced Scheduled Call Feature, here are the steps to Schedule a Call
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X