Home
Apps

Whatsapp New Year Effects న్యూ ఇయర్‌ సందర్భంగా వాట్సాప్‌లో కొత్త థీమ్, స్టిక్కర్‌లు, ఎఫెక్ట్‌లు..!

ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ (Whatsapp) ఇటీవల కాలంలో యూజర్ల సౌకర్యం కోసం అనేక కొత్త ఫీచర్‌లను తీసుకొస్తోంది. ఇటీవల వీడియో కాల్‌కు కొత్త ఫీచర్‌లను యాడ్‌ చేసింది. అయితే తాజాగా న్యూ ఇయర్‌ సందర్భంగా కొత్త ఫన్ ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫలితంగా వీడియో కాల్స్, చాట్‌ను మరింత ఆహ్లాదకరంగా ఉండేలా చేసేందుకు ప్రయత్నం చేస్తోంది.

న్యూ ఇయర్ (Whatsapp New Year 2025 Features) కొత్త థీమ్‌, వీడియో కాల్ ఎఫెక్ట్‌లపై ఇవాళ ప్రకటన చేసింది. న్యూ ఇయర్‌ కొత్త ఫీచర్లు, థీమ్‌ కొన్ని రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. యానిమేటెడ్‌ రియాక్షన్‌లు, ఫెస్టివల్‌ బ్యాక్‌గ్రౌండ్‌, ఫిల్టర్‌, ఎఫెక్ట్‌లను వినియోగించుకోవచ్చని వాట్సాప్‌ తెలిపింది.

Whatsapp New Year 2025 Features

న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలిపేందుకు వీలుగా స్టిక్కర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ స్టిక్కర్‌లు, థీమ్‌ల ద్వారా మెరుగైన అనుభూతిని పొందుతారని భావిస్తున్నట్లు తెలిపింది. గత వారంలో వాట్సాప్ వీడియో కాల్‌ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా 10 ఎఫెక్ట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది.

ఇటీవలే వాట్సాప్‌ అనేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌ యూజర్లకు మరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ అందుబాటులోకి వచ్చింది. OpenAI కు చెందిన ChatGPT ను వినియోగించుకోవచ్చు. 18002428478 నంబర్‌కు సేవ్‌ చేసుకొని, మెసేజ్‌ చేయడం ద్వారా వాట్సాప్‌ యూజర్లు ChatGPT యాక్సెస్‌ను పొందవచ్చని తెలిపింది. ఈ కొత్త నిర్ణయంతో మరింత మందికి చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని OpenAI భావిస్తోంది.

వీటితోపాటు వాట్సాప్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా టైపింగ్ ఇండికేటర్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా గ్రూప్‌ చాట్ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుందని వాట్సా్ప్‌ చెబుతోంది. వాట్సాప్‌లో కొత్తగా ట్రాన్సిలేట్‌ ఫీచర్‌ను తీసుకురానుంది. ఫలితంగా ఇతర భాషల వ్యక్తులతో చాటింగ్‌ సమయంలో ఈ ఫీచర్‌ అనువుగా ఉంటుందని చెబుతోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ టెస్టింగ్‌ దశలో ఉంది. ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగపడనుందంటే.. గ్రూప్‌ లేదా వ్యక్తిగత చాట్‌ల సమయంలో ఇతర భాషల్లో కొన్నిసార్లు మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిలో పెద్దగా వచ్చిన మెసేజ్‌లను అర్థం చేసుకొనేందుకు ఎక్కువగా కష్టపడాల్సి రావచ్చు. అలాంటి యూజర్లకు ఈ ట్రాన్సిలేట్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ప్రైవసీ పరంగా ఎటువంటి సమస్య ఎదురయ్యే అవకాశం లేదని వాట్సాప్‌ చెబుతోంది.

రిమైండర్‌ పేరుతో వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. కొన్ని సందర్భాల్లో వాట్సాప్‌కు భారీగా మెసేజ్‌లు వస్తుంటాయి. అందువల్ల కొన్ని చాట్‌లను మర్చిపోయే అవకాశం ఉంది. అలా మర్చిపోయిన చాట్‌లను గుర్తుచేసే విధంగా రిమైండర్‌ ఫీచర్‌ పనిచేస్తుందని వాట్సాప్‌ చెబుతోంది. అయితే ఈ ఫీచర్‌ యూజర్లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వివరాలు వెల్లడి కాలేదు.

గత నెలలో వాట్సాప్‌ మరో ఆసక్తికర ఫీచర్‌పై పనిచేస్తుంది వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ తెలిపింది. వాట్సాప్ వాయిస్ నోట్‌ను టెక్ట్స్‌గా మార్చే ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపింది. దీని ద్వారా ఏదైనా సందర్భంలో వాట్సాప్‌లో వచ్చిన వాయిస్‌ నోట్‌ను వినిలేని పరిస్థితుల్లో... ఆ వాయిస్‌ నోట్‌ను Text రూపంలో మార్చుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ కేవలం వాయిస్‌ నోట్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తులకు మాత్రమే పనిచేయనుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp introducing new stickers, effects and animations ahead of new year 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X