Home
Apps

వాట్సాప్‌ వాయిస్‌, వీడియో కాల్స్‌ ఎక్కువగా మాట్లాడుతుంటారా.. అయితే ఈ ఫీచర్‌లు మీ కోసమే..!

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ (Whatsapp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను విడుదల చేస్తోంది. భారత్‌లో వాట్సాప్‌ ఖాతాలను సుమారు 50 కోట్ల మందికి పైగా కలిగి ఉన్నారు. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల సౌకర్యం, ప్రైవసీ కోసం అనేక ఫీచర్లను విడుదల చేస్తుంటుంది. అయితే తాజాగా వాట్సాప్ ఫీచర్‌ ట్రాకర్ WABetainfo కీలక వివరాలను వెల్లడించింది.

వాట్సాప్‌ నుంచి మనం అనేక మందికి ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటాం. అలా మనం షేర్‌ చేసిన ఫైల్స్‌ను కొంత మంది సేవ్‌ చేసుకుంటారు. భవిష్యత్‌లో అలాంటి ఫోటోలు, వీడియోల కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కొంత మంది వ్యక్తులు భావిస్తుంటారు. అలా ఆందోళన వ్యక్తం చేసే యూజర్ల కోసం వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

whatsapp is developing new video call and audio call feature said feature tracker

ఈ ఫీచర్‌ తొలుత వాట్సాప్ ఆండ్రాయిడ్‌ యూజర్‌లకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే మీరు ఇతరులకు పంపిన ఫోటోలు, వీడియోలను సేవ్‌ చేయకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. సెట్టింగ్స్‌లో ఇందుకు సంబంధించిన ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయని వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ అభివృద్ధి దశలో ఉందని తెలిపింది.

ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేశాక.. మీరు పంపిన ఫోటోలు, వీడియోలను అవతలి వ్యక్తులు సేవ్ చేయలేరు. వారు సేవ్ చేసేందుకు ప్రయత్నం చేస్తే.. "సేవ్‌ చేసేందుకు అవకాశం లేదు" అనే విధంగా ఓ మెసేజ్‌ డిస్‌ప్లే పైన కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

అయితే తాజాగా వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ కీలక వివరాలను వెల్లడించింది. మనం తరచూ వాట్సాప్ కాల్స్‌, వీడియో కాల్స్ ఫీచర్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే ఇందులో తాజాగా కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లకు తొలుత ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం వాట్సాప్ కాల్‌ సమయంలో.. కాల్‌ ఆన్సర్‌ చేశాక మాత్రమే మ్యూట్ చేసేందుకు అవకాశం ఉంది. త్వరలో లాంచ్ కానున్న కొత్త ఫీచర్‌ ద్వారా కాల్‌ ఆన్సర్ చేయడానికి ముందే మ్యూట్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు వీడియో కాల్స్‌లోనూ కొత్త ఆప్షన్ రానుందని తెలుస్తోంది.

వాట్సాప్ వీడియో కాల్స్ సమయంలో కెమెరాను ఆఫ్‌ చేయాలంటే.. కచ్చితంగా వీడియో కాల్‌లో జాయిన్‌ కావాల్సి ఉంటుంది. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న ఫీచర్‌తో వీడియో కాల్‌లో జాయిన్ అయ్యేకంటే ముందుగానే కెమెరాను ఆఫ్‌ చేయవచ్చు. ప్రైవసీ కోసం చూసేవారికి ఈ ఫీచర్‌ అనుకూలంగా ఉంటుంది.

అయితే కాల్‌లో జాయిన్ అయ్యాక కెమెరాను ఆన్‌ చేయాలనుకున్నా.. అందుకు కూడా ప్రత్యేక ఆప్షన్‌ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.25.10.16 లో అందుబాటులో ఉంది. గత నెలలోనే ఈ ఫీచర్‌ కోసం వార్తలు వచ్చాయి. అయితే ఇంకా ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది.

దీంతోపాటు వాట్సాప్ కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో సంభాషణకు అనుగుణంగా ఎమోజీలను పంపే ఫీచర్‌ కూడా త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం. దీని ద్వారా వాట్సాప్ సంభాషణ మరింత ఫన్నీగా ఉంటుందని భావిస్తున్నారు. లాఫింగ్ ఎమోజీ, హార్ట్‌ సింబల్‌, Thumpsup సింబల్ వంటి అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

ఈ ఫీచర్‌లు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయనే కచ్చితమైన సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. పైన తెలిపిన ఫీచర్లు తొలుత ఆండ్రాయిడ్‌ యూజర్లకు అనంతరం iOS యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో వీటి గురించి పూర్తి సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp is developing new video call and audio call features said feature tracker
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X