వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. త్వరలో కాలింగ్ సమయంలో ఈ మార్పులను గమనిస్తారు.. పూర్తి వివరాలు!
మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp New Feature) ఇటీవల కాలంలో అనేక కీలక మార్పులు చేస్తోంది. వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేసిన సంస్థ.. తాజాగా కాలింగ్ ఇంటర్‌ఫేస్‌లో మరోసారి మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంది. గతంలో కాలింగ్ సమయంలో బ్యాక్ బటన్ స్థానంలో మినిమైజ్ బటన్‌ను తీసుకొచ్చారు.
అయితే తాజాగా తీసుకొస్తున్న అప్‌డేట్‌లో కాలింగ్ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేశారు. కిందనున్న కాలింగ్ బార్‌లో మార్పులు చేశారు. ఈ అప్‌డేట్ ప్రస్తుతం కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ బీటా 2.24.12.14 వెర్షన్ ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు.

వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ Wabetainfo ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. దీని ఆధారంగా వాట్సాప్ కాలింగ్ బార్‌లో కింద భాగంలో కొన్ని మార్పులు చేశారు. గతం కంటే ప్రొఫైల్ ఫోటో పెద్దగా కనిపించనుంది. ప్రస్తుతం కొంత మంది బీటా టెస్టర్‌లకే ఈ అప్‌డేట్ అందుబాటులో ఉండగా.. త్వరలో మరింత మందికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
**వాట్సాప్ లో ఇమాజిన్ పేరుతో మరో ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. మెటా LLM మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా టెక్స్ట్ నుంచి ఫోటోలను తయారు చేసేందుకు యూజర్లకు అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ Wabetainfo ప్రకారం ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.12.4 అందుబాటులో ఉంది. AI ద్వారా ఈ ఫోటోలను రూపొందించవచ్చు.
**వాట్సాప్.. ఇటీవల స్టేటస్ అప్‌డేట్‌లో అనేక మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇటీవల స్టేటస్‌లో నిమిషం పాటు వీడియో పోస్టు చేసే విధంగా కొత్త అప్‌డేట్ పైన పనిచేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు వాయిస్ నోట్స్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ వెల్లడించింది.
ఈ కొత్త అప్‌డేట్ ద్వారా వాట్సాప్ స్టేటస్‌లో ఎక్కువ నిడివి ఉన్న (Longer Voice Notes) వాయిస్ నోట్‌ను పోస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆండ్రాయిడ్, iOS యూజర్లు గరిష్ఠంగా 1 నిమిషం పాటు వాయిస్ నోట్‌ను స్టేటస్ అప్‌డేట్‌గా పోస్టు చేయవచ్చని తెలుస్తోంది.
అయితే ఇందుకు వాట్సాప్ యూజర్లు అప్‌డేట్ చేయబడిన వెర్షన్‌ను కలిగి ఉండాలి. ప్రస్తుతం ఈ అప్‌డేట్ కొంత మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్ కోసం ఆండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్ ద్వారా యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. iOS యూజర్లు యాప్ స్టోర్ ద్వారా కొత్త వెర్షన్‌కు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








