Home
Apps

వాట్సాప్‌ కొత్త ఫీచర్‌.. చాట్‌లో వచ్చిన డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు..!!

మెటా నేతృత్వంలోని ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (Whatsapp latest features) గత కొంత కాలంగా యూజర్ల సౌకర్యం, భద్రత కోసం అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో యూజర్లను మెరుగైన అనుభూతిని కల్పించేందుకు యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేసింది.

తాజాగా వాట్సాప్‌ కీలక ఫీచర్‌పైన పనిచేస్తుంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo వివరాల ఆధారంగా త్వరలో అందుబాటులోకి రానున్న ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌కు వచ్చిన డాక్యుమెంట్‌లను (Whatsapp Document Preview Feature) సులభంగా చూడవచ్చు మరియు షేర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం టెస్టింగ్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Whatsapp is testing new feature that will add preview to document

ఇప్పటి వరకు వాట్సాప్‌కు వచ్చిన డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్‌ చేసి మాత్రమే చూడేందుకు వీలుండేది. ఈ కొత్త ఫీచర్‌తో డౌన్‌లోడ్‌ అవసరం లేకుండానే వివరాలు తెలుసుకోవచ్చు. అందుకోసం ప్రివ్యూ (Preview) ను జతచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్‌లో ఉండగా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తొలుత ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. iOS వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే సమాచారం అందుబాటులో లేదు.

* దీంతోపాటు వాట్సాప్‌ మరో ఆసక్తికర ఫీచర్‌ను లాంచ్‌ చేయనుంది. చాలా రోజుల నుంచి సంభాషించని వ్యక్తులను గుర్తించేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌ తొలుత ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది అని భావించినా.. తాజా వివరాల ఆధారంగా iOS యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొంత మంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉందని సమాచారం. ఈ ఫీచర్‌ వాట్సాప్ వినియోగదారుల సంభాషణలను మెరుగుపరుస్తుందని వాట్సాప్‌ భావిస్తోంది. అయితే ఈ ఫీచర్‌ను డిసేబుల్‌ చేసుకొనే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

*దీంతోపాటు చాట్‌లాక్‌ ఫీచర్‌ను మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్‌ పనిచేస్తుంది. ఇప్పటి వరకు చాట్‌లాక్ ఫీచర్‌ కేవలం ప్రైమరీ డివైస్‌కు మాత్రమే పరిమితం కాగా.. ఇక నుంచి లింక్‌ చేసిన డివైస్‌లకు కూడా వర్తించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా యూజర్ల భద్రత మరింత మెరుగవనుంది.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ Wabetainfo ఈ విషయాలను వెల్లడించింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక వాట్సాప్‌ ప్రైమరీ డివైస్‌ ప్రైవసీ సెట్టింగ్‌లలో మార్పులు చేసి.. అన్ని లింక్‌ చేసిన పరికరాల్లోనూ వాట్సాప్‌ చాట్‌లాక్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ బీటా 2.24.8.4 అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

*దీంతోపాటు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ తరహాలో వాట్సాప్‌ స్టేటస్‌లోనూ ప్రత్యేకమైన వ్యక్తులను ట్యాగ్‌ చేసే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ విషయాన్ని ఆండ్రాయిడ్‌ అథారిటీ నివేదించింది. iOS వాట్సాప్‌ బీటాలో ప్రస్తుతం ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. టెస్టింగ్‌ అనంతరం యూజర్ల కోసం విడుదల చేయనున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp is testing new feature that will add preview to document
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X