వాట్సాప్ సూపర్ ఫీచర్.. టెలిగ్రామ్ తరహాలో
ప్రపంచంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన మెసెజింగ్ యాప్ ఏంటని ఏవరినైనా అడిగితే వెంటనే వాట్సాప్ అని మనకు సమాధానం వస్తుంది. ప్రపంచంలోని అత్యధిక శాతం స్మార్ట్ ఫోన్ యాజర్లు వాట్సాప్ నే వినియోగిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల మెటా నేతృత్వంలోని వాట్సాప్ కూడా భారీ సంఖ్యలో ఉన్న తమ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందించేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
కొన్ని నెలల నుంచి ప్రతి నెలా ఏదో ఒక అప్ డేట్ కానీ ఫీచర్ కానీ వాట్సాప్ విడుదల చేస్తూనే ఉంది. డిసప్పీయరింగ్ మెసెజ్ లు, వాట్సాప్ గ్రూపు సభ్యుల సంఖ్యను పెంచడం, అడ్మిన్ కు కీలక బాధ్యతలు అప్పగించడం, వాట్సాప్ ఆడియో స్టేటస్ ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతోపాటు ఎడిట్ మెసెజ్ ఫీచర్ కూడా ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 60 సెకన్ల వీడియో మెసెజ్ ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

మరికొద్ది రోజుల్లో మరో సూపర్ ఫీచర్ ను వాట్సాప్ తన యూజర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యానిమేటెడ్ ఎమోజీ ఫీచర్ ను తీసుకురాబోతున్నట్లు వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo తన కథనంలో వివరించింది.
అంటే మనం ఇప్పటివరకు ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఇచ్చిన ఎమోజీలను మాత్రమే వినియోగిస్తుండగా.. వాట్సాప్ యానిమేటెడ్ ఎమోజీ కూడా అందుబాటులోకి వస్తే సున్నితమైన మన భావాలను సైతం ఎంచక్క ఎమోజీ రూపంలో మనం వ్యక్తం చేయగలం. అయితే ఇది ఎప్పటి నుంచి యాజర్లకు అందుబాటులోకి వస్తుందన్న సమాచారం మాత్రం లేదు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న కొత్త అప్ డేట్ తో పాటు వచ్చే అవకాశం ఉంది.
ఈ యానిమేటెడ్ ఎమోజీల కోసం వాట్సాప్.. లొట్టి లైబ్రరీతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్.. వాట్సాప్ పోటీదారైన టెలిగ్రామ్ లో అందుబాటులో ఉంది. కొన్ని కథనాల ప్రకారం యానిమేటెడ్ ఎమోజీ పీచర్ వాట్సాప్ డెస్క్ టాప్ బీటా వెర్షన్.. టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందరికి ఈ ఫీచర్ ఒకేసారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈ యానిమేటెడ్ ఎమోజీలు తక్కువ సైజ్ లోనే ఉండేట్లు వాట్సాప్ రూపొందిస్తోంది. వాటిలో మార్పులు చేస్తేందుకు యాజర్లకు అవకాశం ఇవ్వనుంది. అయినా ఎమోజీ క్వాలిటీ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎమోజీలను పంపేందుకు అందుబాటులో ఉన్న కేటగిరి బార్ ను తొలగించనున్నట్లు సమాచారం. దీని వల్ల తరచూ ఎమోజీలను పంపే యాజర్లపై కొంచెం ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే వివిధ రకాలైన ఎమోజీలను పంపేందుకు యాజర్లు కిందకు స్క్రోల్ చేయాల్సి ఉంటుంది.
అంతే కాకుండా కాంటాక్ట్ వ్యూలో మార్చులు చేసేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోందని, దానిపై పనిచేస్తోందని వాట్సాప్ ట్రాకర్ WABetaInfo తెలిపింది. దాంతోపాటు యాజర్లకు మరింత అనుభవాన్ని ఇచ్చే విధంగా వాట్సాప్ పనిచేస్తోందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications








