వాట్సాప్ చాట్‌లాక్‌లో కీలక మార్పులతో కొత్త ఫీచర్.. మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి!
మెటా నేతృత్వంలోని వాట్సాప్ (Whastapp).. తన వినియోగదారులు కోసం అనేక ఫీచర్లును విడుదల చేస్తోంది. ఇటీవల కాలంలో తన యూజర్ల భద్రత కోసం కీలక ఫీచర్లను లాంచ్ చేసింది. గత సంవత్సరం నవంబర్‌లో చాట్ లాక్ ఫీచర్ ను లాంచ్ చేసింది. చాట్‌లను భద్రంగా ఉంచేందుకు ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది.
దీంతోపాటు అనంతరం ఈ చాట్‌లాక్ ఫీచర్‌ను (Whatsapp Chat lock New Update) యాక్సెస్ చేసేందుకు సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. అయితే ఈ చాట్‌లాక్ ఫీచర్ కేవలం ప్రైమరీ డివైస్‌లోనే పనిచేస్తుంది. ఇదే వాట్సాప్‌ను ఇతర పరికరాల్లో లింక్ చేసి వినియోగిస్తుంటే వాటిలో చాట్‌లాక్ ఫీచర్ పనిచేయదు. వాట్సాప్ తాజాగా దీనిపై దృష్టిసారించింది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వాట్సాప్‌ను ప్రస్తుతం నాలుగు డివైస్‌లలో ఉపయోగించే వీలుండగా.. అన్నింటిలోనూ చాట్‌లాక్ ఫీచర్ పనిచేయనుంది. ఫలితంగా యూజర్ల భద్రత మరింత మెరుగవనుంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ Wabetainfo ఈ విషయాలను వెల్లడించింది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వాట్సాప్ ప్రైమరీ డివైస్ ప్రైవసీ సెట్టింగ్‌లలో మార్పులు చేసి.. అన్ని లింక్ చేసిన పరికరాల్లోనూ వాట్సాప్ చాట్‌లాక్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఆండ్రాయిడ్ బీటా 2.24.8.4 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
* దీంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో వాట్సాప్ స్టేటస్‌లోనూ ప్రత్యేకమైన వ్యక్తులను ట్యాగ్ చేసే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ విషయాన్ని ఆండ్రాయిడ్ అథారిటీ నివేదించింది. iOS వాట్సాప్ బీటాలో ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. టెస్టింగ్ అనంతరం యూజర్ల కోసం విడుదల చేయనున్నారు.
* మరియు వాట్సాప్ కాలింగ్ ఇంటర్ ఫేస్‌ను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కాలింగ్ ఇంటర్‌ఫేస్ యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WaBetainfo ప్రకారం.. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.24.7.19 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ కాలింగ్ ఇంటర్‌ఫేస్‌లో కొత్తగా మినిమైజ్ బటన్‌ను తీసుకురానున్నట్లు తెలిసింది. ఫలితంగా వాట్సాప్ కాలింగ్ ఇంటర్‌ఫేస్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపింది.
వాట్సాప్ కాలింగ్ సమయంలో ప్రస్తుతం ఉన్న ఆందోళనకు చెక్ పెడుతుందని తెలుస్తోంది. వాట్సాప్ కాల్ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మినిమైజ్ బటన్ ఉపయోగపడనుంది. ఫలితంగా ఇంటర్‌ఫేస్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో కాలింగ్ మరింత సౌకర్యంగా ఉంటుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








