Home
Apps

Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. సులభంగా ఫైల్స్‌ షేర్‌ చేసుకోవచ్చు..!

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ గత కొన్ని నెలలుగా వరుసగా కీలక ఫీచర్లను విడుదల చేస్తోంది. వినియోగదారుల సౌకర్యం, భద్రత కోసం మెరుగైన ఫీచర్లను విడుదల చేస్తోంది. తాజాగా వాట్సాప్ ఫైల్‌ షేరింగ్‌ ఫీచర్‌ (Whatsapp File Sharing) పైన పనిచేస్తోందని తెలుస్తోంది. ఫలితంగా సౌకర్యంగా ఫోటోలు, వీడియోలను షేర్‌ చేసుకొనే అవకాశం ఉండనుంది.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ప్రకారం ఫైల్‌ షేరింగ్‌ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. సమీపంలోని వ్యక్తులకు సులభంగా ఫైల్‌ షేరింగ్‌ చేసే అవకాశం ఉండనుంది. యాప్‌ సెట్టింగ్స్‌లోనే దీన్ని గుర్తించవచ్చని తెలుస్తోంది. ఫైల్‌ షేరింగ్‌ కోసం రెండు డివైస్‌లు వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి పరస్పరం కనెక్ట్‌ కావాల్సి ఉంటుంది.

Whatsapp is working on File Sharing Feature

ఈ ఫీచర్ ద్వారా భద్రత, గోప్యతకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. సమీపంలోని డివైజ్‌లకు కనిపించాలా వద్ద అనేదానిపై పూర్తి నియంత్రణ ఉంటుందని సమాచారం. దీంతోపాటు ఫైల్‌ షేరింగ్‌ కూడా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ను కలిగి ఉంటుంది. అయితే ఫోన్‌ నంబర్‌ వెల్లడించే అవకాశం లేదని ఫీచర్ ట్రాకర్‌ వెల్లడించింది.

ఈ ఫీచర్‌ను వినియోగించుకొనేందుకు ఫోన్‌ లోని ఫోటోలు, వీడియోలను యాక్సెస్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు లోకేషన్‌ అనుమతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా పెద్ద ఫైల్స్‌ను కూడా సులభంగా సమీపంలోని డివైజ్‌ లకు షేర్‌ చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఈ ఫీచర్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరియు పెద్ద ఫైల్స్‌ను కూడా నేరుగా షేర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

వాట్సాప్‌లో తాజాగా ఫీల్టర్స్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆండ్రాయిడ్‌, iOS రెండింటిలోనూ అందుబాటులోకి లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొద్దిమందికి మాత్రమే అందుబాటులో వచ్చింది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ చాట్‌ను రీడ్‌, అన్‌రీడ్‌, గ్రూప్‌ వంటి కేటగిరీలుగా ఫిల్టర్‌ చేస్తుంది. ఈ ఫీచర్ హోం స్క్రీన్‌లోనే కనిపిస్తుంది. ఫలితంగా వేగంగా అవసరమైన మెసేజ్‌లకు స్పందించగలుగుతాం.

ఈ ఫీచర్‌ బీటా టెస్టింగ్‌ దశలో ఉంది. ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు వాట్సాప్ అనేక కీలక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ఆధారంగా వాట్సాప్‌ ఆసక్తికర ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఏదైనా అత్యవసర సమయంలో వాట్సాప్‌లో ఉన్న తమ ఫ్రెండ్‌ లేదా సన్నిహితులు యాక్టివ్‌గా ఉన్నారా లేదా అని తనిఖీ చేసేందుకు యూజర్‌ చాట్‌లోకి వెళ్లి Last seen ను పరిశీలిస్తాం. లేదా ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అని తనిఖీ చేస్తాం.

అయితే ఎక్కువ మంది యూజర్ల వివరాల కోసం ప్రతి ఒక్కరి చాట్‌లోకి వెళ్లి ఇలాంటి తనిఖీలు చేయాలి. ఈ ప్రక్రియను మరింత సులభంగా చేసేందుకు వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వాట్సాప్‌ వినియోగదారులు వాట్సాప్‌లో తాజాగా యాక్టివ్‌గా ఉన్న యూజర్లను జాబితా రూపంలో చూడవచ్చు.

ఈ ఫీచర్‌ 'Recently online' పేరుతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ ఎంపిక చేసుకున్న కొన్ని కాంటాక్ట్‌లను మాత్రమే ఈ జాబితాలో చూపిస్తుందని తెలుస్తోంది. అయితే వినియోగదారుల భద్రతను దృష్టిలోపెట్టుకొని Last seen మరియు Online Status వివరాలను ఈ జాబితాలో చూపించదని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ Recently Online Feature కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. అయితే త్వరనే మిగిలిన వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫీచర్‌ పనితీరు పై పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Whatsapp is working on File Sharing Feature near by users can share with each other
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X