Home
Apps

వాట్సాప్‌ కు కాస్త విరామం ఇవ్వాలనుకుంటున్నారా.. కొత్తగా Logout ఫీచర్‌..?

పాపులర్ మేసేజింగ్‌ యాప్స్‌లో వాట్సా్ప్‌ (Whatsapp) ఒకటి. భారత్‌లో సుమారు 50 కోట్ల మంది యూజర్లు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యం, భద్రత కోసం వాట్సాప్ అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా త్వరలో అదిరిపోయే ఫీచర్‌ విడుదల కానుందని తెలుస్తోంది. వాట్సాప్‌ మెసేంజర్‌కు కొన్ని రోజులు విరామం ఇవ్వాలని భావించే వారికి ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

వాట్సాప్‌ Logout ఆప్షన్ :
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను Logout చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే వాట్సాప్‌ కు కూడా ఇలాంటి అవకాశం ఉంటే బాగుండేది అని చాలా మంది భావిస్తుంటారు. అయితే తాజాగా వచ్చిన వివరాల ఆధారంగా వాట్సాప్‌ను Logout చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

whatsapp is working on logout feature

ప్రైమరీ డివైస్‌ నుంచి లాగ్‌అవుట్‌ :
ప్రస్తుతం వాట్సాప్‌ మెసేంజర్‌కు దూరంగా ఉండాలని భావిస్తే, డిలీట్‌ చేయడం మినహా మరే ఆప్షన్‌ లేదు. అయితే త్వరలో ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లకు ఈ ఆప్షన్‌ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌ తో ప్రైమరీ డివైస్‌ నుంచి కూడా వాట్సాప్‌ను logout చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఆండ్రాయిడ్ ఆథారిటీ మరియు టిప్‌స్టర్‌ AssembleDebug ఈ ఫీచర్‌ వివరాలను వెల్లడించాయి. అయితే ఈ ఫీచర్‌ను ప్రస్తుతం అంతర్గతంగా పరీక్షించడం లేదా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ Logout ఫీచర్‌ సెట్టింగ్స్ ఆప్షన్‌లోని అకౌంట్‌ ట్యాబ్‌లో గుర్తించారు.

Take a Poll

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వాట్సాప్ Logout ఫీచర్‌లో మూడు ఆప్షన్‌లు ఉంటాయి. Erase all Data & Preferences, keep all Data & Preferences మరియు Cancel వంటి మూడు ఆప్షన్లు ఉండనున్నాయని తెలుస్తోంది.

Erase all Data & Preferences ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే వాట్సాప్‌ డేటా మొత్తం డిలీట్‌ కానుంది. అదే keep all Data & Preferences ఆప్షన్‌ను ఎంచుకుంటే డేటా అంతా అలానే ఉంటుంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ నుంచి వాట్సాప్‌ అకౌంట్‌ Logout కానుంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే మరోసారి లాగిన్‌ అయ్యాక.. మీ డేటాను గతంలో మాదిరిగానే యాక్సెస్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్‌ అకౌంట్‌కు విరామం ఇవ్వాలని భావిస్తే Logout ఫీచర్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌పై మెటా గానీ వాట్సాప్‌ గానీ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరియు ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ లాగ్‌అవుట్‌ ఫీచర్‌ యూజర్లు అందరికీ అందుబాటులోకి వచ్చే ముందు బీటా టెస్టర్ల కోసం విడుదల చేయనున్నారు. కొన్ని నివేదికల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

* వాట్సా్ప్‌ తాజాగా ఐప్యాడ్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా యాప్‌ను తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యాప్‌ కోసం ఐప్యాడ్ యూజర్లు ఎదురుచూశారు. ప్రస్తుతం యాప్ స్టోర్‌లో వాట్సాప్‌ ఫర్ ఐప్యాడ్ యాప్‌ అందుబాటులో ఉంది. ఈ కొత్త యాప్‌ ద్వారా ఒకేసారి 32 మందితో వీడియో, ఆడియో కాల్స్ చేసేందుకు అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp is working on logout feature for primary device without erasing data as per latest reports
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X