వాట్సాప్ లో త్వరలో రెండు కొత్త ఫీచర్‌లు.. యూజర్లకు ఎలా ఉపయోగపడతాయి..?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్‌లను లాంచ్ చేస్తోంది. తాజాగా iOS యూజర్ల కోసం ఆకట్టుకొనే ఫీచర్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఆధారంగా తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఈ కొత్త ఫీచర్ యూజర్లకు ఉపయోగపడే అవకాశం ఉంది.
మల్టీ అకౌంట్ ఫీచర్ :
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ వివరాల ఆధారంగా వాట్సాప్ ప్రస్తుతం మల్టీ అకౌంట్ సపోర్టు ఫీచర్ పైన పనిచేస్తోంది. అంటే ఈ ఫీచర్ ద్వారా ఒకే యాప్ లో ఎక్కువ వాట్సాప్ అకౌంట్‌లను మేనేజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. వాట్సాప్ iOS యాప్‌లో సెట్టింగ్స్ వద్ద ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

ఆండ్రాయిడ్‌లో ఇప్పటికే :
ఇప్పటికే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఫలితంగా రెండు వాట్సాప్ ఖాతాలను ఒకే యాప్ నుంచి మేనేజ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే త్వరలో ఈ ఫీచర్ ఆపిల్ డివైజ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
iOS యూజర్‌లకు త్వరలో :
ఫీచర్ ట్రాకర్ ఆధారంగా ప్రస్తుతం ఈ మల్టీ అకౌంట్ ఫీచర్ వాట్సాప్ iOS 25.19.10.74 బీటా వెర్షన్ లో కనిపించింది. ఈ ఫీచర్ ద్వారా పర్సనల్ లేదా బిజినెస్ అకౌంట్స్ నుంచి పరస్పరం స్విచ్ అయ్యేందుకు అవకాశం ఉంది. అకౌంట్ లిస్ట్ (Account List) ద్వారా మల్టీ అకౌంట్స్‌ను మేనేజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది? :
ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రైమరీ, సెకండరీ అకౌంట్స్ నుంచి సులభంగా స్విచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందో వెల్లడి కాలేదు.
* దీంతోపాటు మరో సూపర్ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ నుంచే డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఫీచర్ వాట్సాప్ iOS యూజర్లకు అందుబాటులో వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎటువంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా డాక్యుమెంట్స్‌ను సులభంగా స్కాన్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం బీటా వెర్షన్‌లో :
ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో ఉంది. త్వరలోనే వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. వాట్సాప్ అటాచ్‌మెంట్ మెనూలోని బ్రౌజ్ డాక్యుమెంట్స్ వద్దనే స్కాన్ డాక్యుమెంట్స్ ఫీచర్ కూడా కనిపిస్తుంది.
ఈ ఫీచర్ వద్ద రెండు అదనపు ఆప్షన్‌లు ఉంటాయి. మాన్యువల్, ఆటోమేటిక్ రూపంలో PDF రూపంలోకి మార్చుకోవచ్చు. మాన్యువల్ ఆప్షన్‌లో డాక్యుమెంట్‌ను స్కాన్ చేశాక.. ఎంచుకున్న భాగాన్ని PDF లోకి మార్చుకోవచ్చు. అదే ఆటోమేటిక్ ఆప్షన్‌లో అయితే స్కానింగ్ అనంతరం ఆటోమేటిక్‌గా డాక్యుమెంట్ బోర్డర్‌ను గుర్తిస్తుంది. అనంతరం PDF లోకి మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








