వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్.. మీ ఫోన్ నంబర్ వారికి కనిపించదు.. అయినా చాట్ చేయవచ్చు..!
వాట్సాప్ ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్నారు. భారత్‌లోనే 50 కోట్లకు పైగా యూజర్లున్నారు. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం ఇప్పటికే వాట్సాప్ అనేక సెక్యూరిటీ ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ లాగ్‌అవుట్ చేసేందుకు అవకాశం ఉంటుందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫీచర్ గురించి తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి.
వాట్సాప్‌లో ప్రస్తుతం కాంటాక్ట్ నంబర్ ఆధారంగా ఇతరులతో చాట్, కాల్స్ చేస్తున్నాం. అయితే త్వరలో వాట్సాప్‌లో యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను Hide చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్ :
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్‌లో ఫోన్ నంబర్‌లకు బదులుగా యూజర్ల నేమ్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ వివరాల ఆధారంగా ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది.
ఈ యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ వినియోగదారులు ప్రత్యేకంగా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ నేమ్‌ను వాట్సాప్ ధ్రువీకరించాక.. కొత్త యూజర్లు ఆ యూజర్ నేమ్ ఆధారంగానే కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
📝 WhatsApp beta for iOS 25.17.10.70: what's new?
— WABetaInfo (@WABetaInfo) May 29, 2025
WhatsApp is working on a feature to choose a username for phone number privacy, and it will be available in a future update!https://t.co/IrXIDfCbqe pic.twitter.com/fYO85r6tpr
గ్రూప్ చాట్, కొత్త వ్యక్తులతో చాట్ సమయంలో :
వాట్సాప్ యూజర్ నేమ్ లో అక్షరాలు, సంఖ్యలు, అండర్‌స్కోర్‌లను మాత్రమే అనుమతిస్తుంది. వాట్సాప్ ధ్రువీకరించాక.. యూజర్ నేమ్ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ గ్రూప్ చాట్ సహా కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినప్పుడు ఉపయోగపడుతుంది.
అయితే ఇప్పటికే అనేక మంది యూజర్ల వద్ద మీ ఫోన్ నంబర్ ఉంటుంది. అలాంటి చోట్ల ఈ యూజర్ నేమ్ ఫీచర్ ఉపయోగపడే అవకాశం లేదు. కొత్త వ్యక్తులు మీతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నం చేసినప్పుడు, మీ ఫోన్ వారికి కనపించకుండా ఉంటుంది.
ప్రస్తుతం వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. దీంతోపాటు ఈ ఫీచర్ పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
* ఇటీవలే వాట్సాప్ అకౌంట్‌ను లాగ్‌అవుట్ చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుందని ఇటీవలే వార్తలు వచ్చాయి. వాట్సాప్ వినియోగానికి కొన్నిరోజుల విరామం ఇవ్వాలనే ఆలోచన ఉన్న యూజర్లకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. వాట్సాప్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయకుండా.. సింపుల్‌గా లాగ్‌అవుట్ చేయవచ్చు.
ఇటీవల వచ్చిన లీక్స్ ఆధారంగా ఈ ఫీచర్‌లో మూడు ఆప్షన్‌లు ఉంటాయని తెలుస్తోంది. వాట్సాప్ డేటాను అలానే ఉంచుతూ లాగ్‌అవుట్ చేయడం మరియు వాట్సాప్ డేటాను కూడా డిలీట్ చేయడంతోపాటు మరో ఆప్షన్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో ఎటువంటి అధికారిక సమాచారం విడుదల కాలేదు.


Click it and Unblock the Notifications








