వాట్సాప్ యూజర్లకు బంపరాఫర్.. చాట్‌జీపీటీతో ఇక ఫొటోలు, వాయిస్‌లతోనూ మాట్లాడొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..!
WhatsApp ChatGPT: వాట్సాప్ యూజర్లకు చాట్‌జీపీటీ అద్భుతమైన ఫీచర్లను తీసుకొచ్చింది. దీనితో ఫొటోలు, వాయిస్ మెసేజ్‌ల ద్వారా అడ్వాన్స్‌డ్‌గా చాట్ చేయొచ్చు. ఇంతకుముందు, వాట్సాప్‌లో చాట్‌జీపీటీ కేవలం టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రమే రిప్లై ఇచ్చేది. ఫొటోలు గుర్తుపట్టడం, వాయిస్ ద్వారా మాట్లాడటం లాంటి ఫీచర్లు అన్నీ చాట్‌జీపీటీ యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వాట్సాప్ యూజర్లు నేరుగా ఫొటోలు, వాయిస్ మెసేజ్‌లు పంపిస్తే, వాటిని చూసి, విని చాట్‌జీపీటీ రిప్లై ఇస్తుంది.
* కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటంటే
మొదటిది ఫొటోలను అనలైజ్ చేస్తుంది, మీరు ఏదైనా ఫొటో పంపిస్తే, చాట్‌జీపీటీ దాన్ని పూర్తిగా పరిశీలిస్తుంది. ఆ ఫొటోలో ఏముందో అర్థం చేసుకుని, కావాల్సిన సమాచారాన్ని ఇస్తుంది. అంటే మీరు ఏదైనా వస్తువు ఫొటో, మీమ్, లేదా డాక్యుమెంట్ ఫొటో పంపిస్తే చాలు, చాట్‌జీపీటీ దాన్ని చూసి మీకు ఉపయోగపడే విషయాలు చెబుతుంది.

రెండోది వాయిస్ మెసేజ్‌లకు సపోర్ట్. మీరు టైప్ చేయడం కష్టం అనుకుంటే, వాయిస్ మెసేజ్ కూడా పంపొచ్చు. మీరు మాట్లాడేది చాట్‌జీపీటీ టెక్స్ట్‌గా మారుస్తుంది. ఆ తర్వాత మీకు రిప్లై ఇస్తుంది. ఎవరికైతే టైప్ చేయడం ఇష్టం ఉండదో, లేదా డేటా తక్కువగా వాడుకోవాలి అనుకుంటారో, వాళ్లకి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
పెయిడ్ యూజర్లకు కోసం మరో ఫీచర్ ఉంది. అంటే మీరు చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే, మీ అకౌంట్‌ను వాట్సాప్‌లో కూడా లాగిన్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు ప్రీమియం ఫీచర్లను నేరుగా వాట్సాప్‌లోనే వాడుకోవచ్చు. అంటే ఇంకా ఎక్కువ ఫీచర్లు, ఇంకా మంచి రెస్పాన్స్‌లు మీకు అందుబాటులో ఉంటాయి.
ఫ్రీ యూజర్లకు అకౌంట్ అక్కర్లేదు, అంటే చాట్‌జీపీటీని వాట్సాప్‌లో వాడటానికి ఓపెన్ఏఐ అకౌంట్ గానీ, డబ్బులు కట్టాల్సిన సబ్‌స్క్రిప్షన్ గానీ అవసరం లేదు. ఎవరైనా ఫ్రీగా వాడేసుకోవచ్చు. అందరికీ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చేసింది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ చాట్‌బాట్ ద్వారా లెక్కలేనన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.
* ఈ కొత్త ఫీచర్లను ఎలా వాడాలి
స్టెప్ 1: మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో +18002428478 అనే అఫీషియల్ చాట్‌జీపీటీ వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసి, కాంటాక్ట్ లిస్ట్‌ను ఒకసారి రిఫ్రెష్ చేయాలి. చాట్‌జీపీటీ కాంటాక్ట్‌ను ఓపెన్ చేసి, టెక్స్ట్ మెసేజ్, ఫొటో లేదా వాయిస్ మెసేజ్ ఏదో ఒకటి పంపాలి.
స్టెప్ 2: మీరు ఏం పంపారో దాన్ని బట్టి, ఏఐ చాట్‌బాట్ మీకు రిప్లై ఇస్తుంది. ఈ కొత్త అప్‌డేట్స్‌తో వాట్సాప్‌లో చాట్‌జీపీటీ మరింత పవర్‌ఫుల్‌గా మారింది. ఫొటోను అనలైజ్ చేయాలన్నా, వాయిస్‌తో ప్రశ్నలు అడగాలన్నా, లేదా జస్ట్ సరదాగా చాట్ చేయాలన్నా, ఈ కొత్త ఫీచర్లు ఏఐతో మాట్లాడటం చాలా సులువుగా, సరదాగా చేస్తాయి.
ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేయండి. ఇది చాలా ఇంట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి దీంతో చాట్ చేసేటప్పుడు చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. స్టూడెంట్స్ దీంతో రోజు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చు. ఇంకా ఇతర సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు. వైద్య పరమైన విషయాల గురించి కూడా అడిగి చిటికెలో తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








