Home
Apps

వాట్సాప్‌లోనూ యాడ్స్‌.. యాప్‌లో ఎక్కడ కనిపిస్తాయి.. ఎలాంటి మార్పులు రానున్నాయి..?

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్నప్పుడు యాడ్స్‌ కనిపిస్తుంటాయి. కొన్ని సమయాల్లో ఈ యాడ్స్‌ విసుగు పుట్టిస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే వాట్సాప్‌లో మాత్రం ఎటువంటి యాడ్స్‌ లేకుండా ఉపయోగించుకుంటున్నాం. అయితే త్వరలో వాట్సాప్‌లోనూ యూడ్స్‌ కనిపించనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం.. వాట్సాప్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది.

వాట్సాప్‌ అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ఈ యాడ్స్‌ (Whatsapp Ads) కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ట్యాబ్‌లో స్టేటస్‌, ఛానల్స్ వివరాలు కనిపిస్తున్నాయి. అప్‌డేట్స్ ట్యాబ్‌ను ప్రతిరోజు 1.5 బిలియన్‌ మంది వాట్సాప్‌ అప్‌డేట్స్‌ ట్యాబ్‌ను చూస్తున్నారని వాట్సాప్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది. యాడ్స్‌ ద్వారా అదనపు ఆదాయం పొందాలని భావిస్తున్నట్లు తెలిపింది.

whatsapp key announcement on ads

వాటిపై ఎటువంటి ప్రభావం ఉండదు :
సోమవారం వాట్సాప్‌ తమ బ్లాగ్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా.. యాడ్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చినా.. వ్యక్తిగత ఛాటింగ్‌, గ్రూప్‌ చాటింగ్‌పై ఎటువంటి ప్రభావం చూపదని వాట్సాప్‌ స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా యూజర్లు వాట్సాప్‌ను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

యాడ్స్‌ ఎక్కడ కనిపిస్తాయి :
అయితే అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో మాత్రమే యాడ్స్‌ చూస్తారని తెలిపింది. ఈ యాడ్స్‌ కోసం వాట్సాప్‌ యూజర్లు దేశం, ప్రాంతం, భాష వంటి వివరాలు సేకరిస్తామని స్పష్టం చేసింది. యాడ్స్‌ ఇచ్చే వ్యక్తులకు ఫోన్‌ నంబర్ల విక్రయం సహా యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోబోమని వాట్సాప్‌ పేర్కొంది.

మూడు ఆప్షన్‌లు :
వాట్సాప్‌ యాడ్స్‌ కోసం ప్రధానంగా మూడు ఆప్షన్‌లను ప్రకటన చేసింది. ఇందులో ఛానల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఒకటి. యూజర్లు తమకు నచ్చిన ఛానల్స్‌ను ఫీజు చెల్లించి ఉపయోగించుకోవచ్చు. మీ కాంటాక్ట్స్‌కు సంబంధించిన స్టేటస్‌లు మాత్రమే కనిపించగా.. ఇక నుంచి యాడ్స్‌ కూడా కనిపిస్తాయి.

దీంతోపాటు వాట్సాప్‌ అప్‌డేట్‌ ట్యాబ్‌లో కొన్ని ట్రెండింగ్ ఛానల్స్‌ కనిపిస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని మార్పులు రానున్నాయి. ఛానల్‌ అడ్మిన్‌లు కొంత నగదు చెల్లించి, తమ ఛానల్స్‌ను కూడా ప్రమోట్‌ చేసుకునేందుకు వాట్సాప్‌ అవకాశం కల్పిస్తుంది.

Take a Poll

వాట్సాప్‌లో యాడ్‌ ప్రారంభించినా.. ప్రైవసీ పరంగా ఎటువంటి మార్పుల ఉండవని వాట్సాప్‌ స్పష్టం చేసింది. వాట్సాప్‌ మెసేజ్‌లు ఎప్పటిలాగానే ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ చేసే ఉంటాయని పేర్కొంది. ఈ యాడ్స్‌ కేవలం అప్‌డేట్‌ ట్యాబ్‌కు మాత్రమే పరిమితం అవుతాయని పేర్కొంది.

మెటా సంస్థ వాట్సాప్‌లో యాడ్స్‌ తీసుకురావాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. 2023 సంవత్సరంలో యాడ్స్‌ పై ఆ సంస్థ అధిపతి స్పందించారు. అప్పటికీ అభివృద్ధి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా వాట్సాప్‌లో యాడ్స్‌ పై ప్రకటన వచ్చింది. ఇప్పటికే మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. వాట్సాప్‌లోనూ యాడ్స్‌ ద్వారా ఆదాయం పొందాలని భావిస్తోంది.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ ఇటీవలే కీలక అప్‌డేట్ ఇచ్చింది. వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక.. కొత్త యూజర్లకు మరియు గ్రూప్‌ చాట్‌లో ఫోన్‌ నంబర్‌కు బదులుగా వాట్సా్ప్‌ యూజర్‌ నేమ్‌ మాత్రమే కనిపిస్తుందని తెలిపింది. అయితే ఈ ఫీచర్‌ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp key announcement on ads on updates tab here are the changes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X