వాట్సాప్‌లో ఈ ముఖ్యమైన ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్ల గురించి తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను (Whatsapp) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్నారు. వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రత కోసం క్రమం తప్పకుండా అనేక ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ యూజర్ల ప్రైవసీ కోసం అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా యూజర్లు తమ డేటాను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రైవసీకి భంగం కలగకుండా కాపాడుకోవచ్చు. ఈ ఫీచర్లు అన్ని ఇప్పటికే యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.
2 స్టెప్ వెరిఫికేషన్ :
ఈ సెక్యూరిటీ ఫీచర్ మీ వాట్సాప్ అకౌంట్ కు అదనపు భద్రతను అందిస్తుంది. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసేందుకు సెట్సింగ్స్ లోని Account పైన క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ కనిపించే 2 స్టెప్ వెరిఫికేషన్ (Two Step Verification) పైన క్లిక్ చేయాలి.

అక్కడ 6 అంకెల పిన్ ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫోన్ నంబర్ ను ఉపయోగించి, ఇతరులు ఎవరైనా వాట్సాప్ క్రియేట్ చేయాలని ప్రయత్నించిన సమయాల్లో, 6 అంకెల పిన్ అవసరం అవుతుంది. ఈ పిన్ లేకుండా మీ వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు క్రియేట్ చేయలేరు.
ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ :
ఈ రెండు ఫీచర్లు వాట్సాప్ అకౌంట్ ను ఇతరులు ఉపయోగించకుండా నియంత్రిస్తాయి. వాట్సాప్ లోని సెట్టింగ్స్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
ప్రొఫైల్ ఫోటో :
ఇటీవల కాలంలో వాట్సాప్ ద్వారా అనేక మోసాలు జరుగుతున్నాయి. మీ వాట్సా్‌ప్ ప్రొఫైల్ ఫోటోలు, లాస్ట్ సీన్ వంటి వివరాలతో మీ సన్నిహితులను మోసం చేస్తున్నారు. మీ కాంటాక్ట్స్ లో ఉన్న యూజర్లకు మాత్రమే ఫోటో, Last Seen వివరాలు కనిపించేలా సెట్సింట్స్ లో మార్పులు చేసుకోండి.
వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ పైన క్లిక్ చేయాలి. అక్కడ Last Seen and Online, Profile Photo ఆప్షన్‌లపై క్లిక్ చేయండి. అక్కడ My Contacts పైన క్లిక్ చేయాలి. ఫలితంగా మీ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్‌కు మాత్రమే వివరాలు తెలియనున్నాయి.
చాట్ బ్యాకప్ :
వాట్సాప్ ప్రస్తుతం చాట్, వాయిస్, వీడియో కాల్స్ కు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2E) ను అందిస్తోంది. అయితే చాట్‌ను బ్యాకప్ చేస్తుంటాం. దీన్ని కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇందుకోసం సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ కనిపించే Chats పైన టాప్ చేయాలి. కిందకు స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ Chat Backup ఆప్షన్ కనిపిస్తుంది. అనంతరం కింద భాగాన ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ ను గుర్తించవచ్చు. ఆ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాలి.
చాట్ లాక్ :
మీ వ్యక్తిగత, ముఖ్యమైన చాట్‌లను లాక్ చేసుకోవచ్చు. మరియు Hide చేసుకోవచ్చు. పిన్ ద్వారా మాత్రమే వీటిని యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మీ వాట్సాప్ అకౌంట్ ను ఇతరులకు వినియోగించవలసి వచ్చిన సమయంలో మీ ప్రైవసీకి భంగం కలగకుండా చాట్‌లాక్ ను ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








