వాట్సాప్ యూజర్ల కోసం సూపర్ అప్‌డేట్.. స్టేటస్ వీడియో సమయం పెరిగింది.. పూర్తి వివరాలు..!
మెటా నేతృత్వంలోని వాట్సాప్ ఇటీవల అనేక అప్‌డేట్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారుల సౌకర్యం, భద్రత కోసం అనేక ఫీచర్లను విడుదల చేస్తోంది. తాజాగా వాట్సాప్ iOS యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను స్టేటస్‌లుగా (Whatsapp Status Update) పోస్టు చేయవచ్చు. ప్రస్తుతం ఈ టెస్టంగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ఆధారంగా WABetainfo ఈ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ iOS 24.10.10.74 బీటా వెర్షన్‌లో ఉంది. దీని ద్వారా గరిష్ఠంగా ఒక నిమిషం పాటు వాట్సాప్ స్టేటస్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్‌లోనూ టెస్టింగ్ చేశారు.

ప్రస్తుతం iOS బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకసారి 30 సెకన్లపాటు మాత్రమే స్టేటస్ వీడియో పోస్టు చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒక నిమిషం పాటు స్టేటస్ వీడియోలను పోస్ట్ చేయవచ్చు.
** వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ Wabetainfo నుంచి ఇటీవల వచ్చిన నివేదిక ఆధారంగా కెమెరాల కోసం జూమ్ కంట్రోల్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది iOS బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నివేదిక ఆధారంగా కెమెరా పనితీరు మెరుగుపడుతుందని భావిస్తుంది. దీంతోపాటు అదనపు ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతోంది. బీటా టెస్టర్ లకు ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్‌తో వారంతా జూమ్ లెవల్‌ను మార్చుకొనేందుకు అవకాశం ఉంది.
** ఆండ్రాయిడ్‌లో ముఖ్యమైన చాట్‌ల భద్రత కోసం Locked Chat ఫీచర్ సహా అనేక ఫీచర్లను లాంచ్ చేసింది. ఇదే ఫీచర్‌ను లింక్ చేసిన డివైజ్ లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది.గత నెలలోనే ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo అందించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.24.11.9 వెర్షన్‌లో అందుబాటులో ఉందని తెలిపింది.
వాట్సాప్‌ను ప్రస్తుతం గరిష్ఠంగా 4 డివైజ్‌లో లింక్ చేయవచ్చు. గతంలో ఈ Locked Chat ఫీచర్ కేవలం ప్రైమరీ డివైజ్‌లో మాత్రమే పనిచేసేది. ఇతర లింక్ చేసిన డివైజ్‌లలో పనిచేయలేదు. తాజాగా వచ్చిన అప్‌డేట్ ద్వారా లింక్ చేసిన డివైజ్‌లో కూడా ఈ ఫీచర్ సక్రమంగా పనిచేస్తుంది. ప్రస్తుతం కొంతమందికి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ విడుదల కానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులోకి ఉందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo తెలిపింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. Locked Chat ఫీచర్ కలిగి ఉన్న సీక్రెట్ కోడ్ మాత్రం ప్రైమరీ డివైజ్‌లోనే ఉండనుంది.
చాట్‌ను లాక్ చేసుకొనేందుకు అవసరం అయిన సీక్రెట్ కోడ్‌ను క్రియేట్ చేసుకొనేందుకు తొలుత ప్రైమరీ ఫోన్‌లో... చాట్ లాక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ సెటప్ సీక్రెట్ కోడ్ అనే ఆప్షన్ ద్వారా క్రియేట్ చేసుకోవాలి. అనంతరం Locked Chat వద్ద మాత్రమే సీక్రెట్ కోడ్ వినియోగించగలుగుతారు.
వాట్సాప్‌ను లింక్ చేసిన ఇతర పరికరాల్లోనూ వినియోగదారుల భద్రతకు ఎటువంటి ఆటంకం రాకుండా ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. అందరికీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








