Home
Apps

వాట్సాప్‌లో Context Card పేరుతో అదిరిపోయే ఫీచర్‌.. మోసాలకు గురికాకుండా యూజర్లను అలెర్ట్‌ చేస్తుంది..!

మెటా నేతృత్వంలోని ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా కంటెక్ట్స్‌ కార్డు (Whatsapp Context Card) పేరుతో భద్రత కోసం ఈ ఫీచర్‌లు ఇటీవల విడుదల చేసింది. ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ గ్రూప్‌లో చేరే ముందు.. అవసరమైన వివరాలు యూజర్లకు తెలియనున్నాయి. ఈ ఫీచర్ ఆధారంగా మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులు మిమ్మల్ని ఇతర గ్రూప్‌లలో జాయిన్‌ చేసేందుకు ముందు లేదా జాయిన్‌ చేసిన తర్వాత గ్రూప్‌లో ఉండాలా వద్దా అనే నిర్ణయం తీసుకొనేందుకు కావాల్సిన సమాచారాన్ని ఈ ఫీచర్‌ మీకు అందిస్తుంది.

ఎలా పనిచేస్తుంది? :
మీ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వాట్సాప్‌ యూజర్లు.. మిమ్మల్ని ఇతర వాట్సాప్‌ గ్రూపులో చేర్చినప్పుడు.. సదరు యూజర్ వివరాలను సూచించే Context Card ను ప్రదర్శిస్తుంది. ఆ గ్రూప్‌ ఎప్పుడు క్రియేట్‌ చేశారు మరియు ఎవరు క్రియేట్‌ చేశారు వంటి వివరాలూ కూడా ఉండనున్నాయి. ఈ వివరాల ఆధారంగా ఆ వాట్సాప్‌ గ్రూప్‌లో మీరు ఉండదలచుకున్నారా.. లేదా అని నిర్ణయం తీసుకోవచ్చు.

how whatsapp latest context card feature works

అయితే ఇప్పటికే ఆ తరహా ఫీచర్‌ వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని యూజర్లు మీకు వ్యక్తిగతంగా మెసేజ్‌ చేసిన సమయంలో.. 'మీకు మెసేజ్ చేసిన వ్యక్తి మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేరు' అనే అర్థం వచ్చేలా ఓ సూచన కనిపిస్తుంది. అదే తరహాలో ఈ కొత్త ఫీచర్‌ కూడా పనిచేస్తుంది. అయితే మరికొంత అదనపు భద్రత, సమాచారాన్ని కలిగి ఉంటుంది.

వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా చేస్తున్న స్కామ్‌ ల నుంచి సురక్షితంగా ఉండేందుకు ఈ కంటెక్ట్స్ కార్డు ఉపయోగపడుతుంది. ఇటీవల ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ గ్రూప్‌లలో చేరేలా మోసగాళ్లు ప్రయత్నం చేస్తున్నారు. చివరికి లక్షల రూపాయలను కోల్పోతున్నారు.

సాధారణంగా ఈ తరహా వాట్సాప్‌ గ్రూప్‌లలో అనేక రకాల అప్‌డేట్‌లు ఇస్తుంటారు. షేర్‌ మార్కెట్‌ వివరాలు సహా ఇతర వివరాలు అందించి యూజర్లకు నమ్మకాన్ని కలిగిస్తారు. అనంతరం ఇతర గ్రూప్‌లలో చేరి, తమ వద్ద మెరుగైన ఆఫర్లు ఉన్నాయని తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని నమ్మిస్తారు. అనంతరం పెట్టుబడి పెట్టేలా ఒత్తిడి చేస్తారు.

నేరగాళ్లు ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా నకిలీ లాభాలు చూపిస్తారు. ఈ లాభాలనే నిజమని నమ్ముతున్న బాధితులు.. ఎక్కువ మొత్తాలను పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే మీరు ఎప్పుడైతే మీ ఖాతాలకు ఆ నగదును బదిలీ చేయమని అభ్యర్థిస్తారో.. అక్కడ నుంచి ఆ నేరగాళ్లు మీతో సంబంధాలు తెంచుకొని, ఆ నగదుతో పారిపోతారు. ఫలితంగా భారీగా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఈ తరహా మోసాలకు వాట్సాప్‌ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన కంటెక్ట్స్‌ కార్డు ఫీచర్‌ చెక్ పెట్టనుంది. ఏదైనా గ్రూప్‌లో చేరాలని మీకు సందేశం వచ్చినట్లయితే.. ఆ మెసేజ్‌ పంపిన వ్యక్తి సహా గ్రూప్‌ నకు సంబంధించిన వివరాలు మీరు తెలియనున్నాయి. దాని ద్వారా మీరు నిర్ణయం తీసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp launched context card feature how it works to avoid cyber scams
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X