అందరికీ వాట్సప్ వీడియో కాలింగ్ వచ్చేసింది, చెక్ చేయడం ఎలా తెలుసుకోండి

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై యూజర్లు అందులో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించి వాట్సప్ గతంలోనే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు లభిస్తున్నది. ఇప్పటిదాకా బీటా వర్షన్ లో ఉన్న ఈ ఫీచర్ ఇకపై వాట్సప్ అప్ డేట్ ద్వారా అందరూ దీన్ని పొందవచ్చు. ఎలా పొందాలో చూద్దాం.

    రూ. 75 చెల్లించండి, 10జిబి డేటా,అన్‌లిమిటెడ్ కాల్స్ పొందండి

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    వాట్సప్ డౌన్లోడ్

    ముందుగా మీ మొబైల్ ఫోన్ లో వాట్సప్ లేకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే వాట్సప్ అప్ డేట్ వచ్చిందేమో గూగుల్ ప్లే స్టోర్ లో చెక్ చేసుకోండి.

    వీడియో కాలింగ్ ఫీచర్

    తరువాత మీరు వీడియో కాలింగ్ ఫీచర్ ఓపెన్ చేసి మీ స్నేహితులకి వీడియో కాల్ చేయండి. వారికి కనెక్ట్ అయిన తరువాత మీకు పైన యాడ్ సింబల్ కనిపిస్తుంది.

    దాన్ని క్లిక్ చేయడం ద్వారా

    దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మరొకరకి కాల్ కనెక్ట్ చేసుకోవచ్చు. వాట్సప్ ప్రవేశపెట్టిన గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ సహాయంతో ఒకేసారి నలుగురు గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.

    ముందుగా ఇద్దరు యూజర్లు

    అయితే ముందుగా ఇద్దరు యూజర్లు వన్ టు వన్ వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి. అనంతరం ఇద్దరు యూజర్లను అందులోకి యాడ్ చేయాలి. దీంతో గ్రూప్ వీడియో కాలింగ్ సాధ్యపడుతుంది.

    ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు

    వాట్సప్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది.

    వాట్సప్ 10 హైలెట్ ఫీచర్లు ఇవే

    1. సింగిల్‌ మెసేజ్‌ ను ఒకేసారి చాలా మందికి పంపడం
    ఒకే సందేశాన్ని ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి సాధ్యమవుతుంది. మెనూపై క్లిక్‌ చేసి న్యూ బ్రాడ్‌ కాస్ట్‌ ని సెలెక్ట్‌ చేసుకొని మీ కాంటాక్ట్‌ లిస్టు లో ఉన్న వారిని సెలెక్ట్‌ చేసి ఒకే మెసేజ్‌ ను మల్టిపుల్‌ సెండింగ్‌ చేయొచ్చు.

    మీ టెక్ట్స్‌ ను ఫార్మాట్‌ చేసుకోవడం:

    మీరు మెసేజెస్‌ ను ఇప్పుడు బోల్డ్, ఇటాలిక్స్‌ లేదా స్ట్రైక్‌ లో కూడా పంపవచ్చు. మీ ఛాయస్‌ కు తగ్గట్టుగా వర్డ్స్‌కు ముందుగాని లేదా తరువాత గాని స్పెషల్‌ క్యారెక్టర్స్‌ ను యూస్‌ చేసి అలాగే మీకు నచ్చిన ఫార్మాట్‌ ను సెలెక్ట్‌ చేసుకోవచ్చు.

    మీరు ఎవరితో ఎక్కువ చాట్‌ చేస్తారో తెలుసుకోండి:

    ఒకవేళ మీరు వాట్సప్‌ లో ఎక్కువగా ఎవరితో చాటింగ్‌ చేసారో తెలుసుకోవాలంటే, మీ చాట్‌ స్క్రీన్‌ లోకి వెళ్లి అక్కడ ఉన్న మెసేజస్‌ స్క్రోలింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు వాటిని ఒకవేళ డిలీట్‌ చేసి ఉంటే సులభంగా తెలుసుకోవడం కష్టమవుతుంది. దీని కోసం, సెట్టింగ్స్‌ లోకి వెళ్లి అకౌంట్‌ లోని స్టోరేజ్‌ యూసేజ్‌ కి వెళ్లి కాంటాక్ట్‌ లిస్టులోని దేనిపైన క్లిక్‌ చేసిన మీరు చాట్‌ చేసిన, కాల్స్‌ చేసిన ఎంత డేటాను మీరు పంపారో అనే దానిని బట్టి మీరు ఎవరితో ఎక్కువ చాట్‌ చేసారో చెప్పొచ్చు. ఈ ఫీచర్‌ ప్రస్తుతం ఐఫోన్లో మాత్రమే అందుబాటులో ఉంది.

    చాట్స్, గ్రూప్స్‌ ను మ్యూట్‌ చేయండి:

    ఎవరైనా అనవసరమైన మెసేజస్‌ ను పంపుతుంటే కాంటాక్ట్‌ లేదా గ్రూప్‌ ని సెలెక్ట్‌ చేసి మెనూ లోని మ్యూట్‌ ఆప్షన్‌ ని సెలెక్ట్‌ చేసుకోండి.

    గ్రూప్ లో మీ మేసేజెస్ ఎవరు చదివారో తెలుసుకోవాలని ఉందా ?

    మీ సన్నిహితులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చెందిన గ్రూప్స్ లో మీరు ఒక్కోసారి పోస్ట్స్ చేస్తుంటారు. ఆ పోస్ట్స్ వారు చదివారో లేదో తెలుసుకోవాలనే కుతూహలం ఉండటం సహజమే. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు పంపిన మెసేజ్, ఫోటో, లేదా వీడియోను ప్రెస్ చేస్తే పై విండోలో ఆప్షన్స్ వస్తాయి

    గ్రూప్ లో పోస్ట్ చేసిన మెసేజెస్ అందరికీ డిలీట్ చేస్తారా ?

    ఒక్కోసారి మనం యాక్సిడెంటల్ గా గ్రూప్స్ లో మెసేజెస్ పెట్టేస్తాం.. తర్వాత అది అందరూ చూడకముందే డిలీట్ చేయాలని అనుకుంటాం. ఎలా డిలీట్ చేయాలో తెలీక సతమతమవుతాం. మీరు పోస్ట్ చేసిన మెసేజ్ ను క్లిక్ చేసిన తర్వాత డిలీట్ ఫర్ ఎవిరీ వన్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే గ్రూప్ లో మరెవరికీ ఈ మెసేజ్ కనబడదు.

    మెసేజెస్ ను అన్ రీడ్ చేయండిలా..

    బ్లూటిక్స్ వల్ల అవతలి వాళ్లు వారి మెసేజెస్ చదివారా లేదనేది తెలుస్తుంది. కానీ అలా తెలియకుండా బోల్తా కొట్టించవచ్చు. మార్క్ యాస్ అన్ రీడ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా సదరు మెసేజ్ ను చదవనట్లు గుర్తించవచ్చు

    చాట్ మొత్తం ఈమెయిల్ చేసే ఆప్షన్..

    మీరు చేసిన చాట్ మొత్తం ఏక మొత్తంలో మీరు ఎంపిక చేసుకున్న మెయిల్ ఐడీకి ఈమెయిల్ చేసుకునే సదుపాయం వాట్సప్ కల్పించింది. తద్వారా చాట్ డిలీట్ అయినప్పటికీ ఈ మెయిల్ లో మొత్తం చాట్ డేటా నోట్ పాడ్ రూపంలో స్టోర్ అవుతుంది.

    కన్వర్జేషన్ ను పిన్ చేసుకోండిలా ..

    మీ వాట్సప్ కాంటాక్ట్స్ లిస్టు చాంతాడంత పొడుగు అయిపోయి, మీ అత్యంత సన్నిహితులను ప్రతి సారి సెర్చ్ లిస్ట్ లో టైప్ చేస్తూ వెతకాల్సి వస్తుందా. అయితే మీరు ఎంపిక చేసుకున్న కాంటాక్ట్స్ ను పిన్ చేసుకోవడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి తప్పించుకునే వీలుంది. ఏవైనా మూడు కాంటాక్ట్స్ ను పిన్ చేసుకుంటే అవి పిన్ అవుతాయి. అప్పుడు సులభంగా గుర్తించవచ్చు.

    ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే

    గ‌రిష్ఠంగా మూడు ఫేవ‌రెట్ చాట్స్‌ను యూజ‌ర్లు ఎంపిక చేసుకోవ‌చ్చు. మీ ఫేవ‌రెట్ చాట్ అనుకున్న దానిని ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే పైన పిన్ ఐకాన్ ఒక‌టి క‌నిపిస్తుంది. దానిని సెల‌క్ట్ చేసుకుంటే.. ఆ చాట్ ఇక ఎప్పుడూ పైనే ఉంటుంది. ఒక‌వేళ దీనిని అన్‌పిన్ చేయాల‌నున్నా మ‌ళ్లీ ఇలాగే చేయాలి.

    గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

    English summary
    WhatsApp launches four-person group video calling more News t Gizbot Telugu
    Opinion Poll
    X

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more