వాట్సప్‌లోకి మరో కొత్త ఫీచర్, యాక్టివేట్ చేసుకోవడం చాలా సింపుల్
రోజు రోజుకు వాట్సప్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వాట్సప్ గ్రూపు రోజుకో కొత్త ఫీచర్ తో వినియోగదారులను అలరిస్తోంది.
రోజు రోజుకు వాట్సప్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో వాట్సప్ గ్రూపు రోజుకో కొత్త ఫీచర్ తో వినియోగదారులను అలరిస్తోంది. అలాగే వాట్సప్ ప్రవేశపెట్టే ఫీచర్లకు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడం కూడా కొత్త ఫీచర్లకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే వాట్సప్ సరికొత్తగా లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

అటాచ్ బటన్ క్లిక్ చేస్తే ..
ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చింది. మీ వాట్సప్ ఛాటింగ్ చేస్తుంటారు కదా.. అక్కడ అటాచ్ బటన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఈ లైవ్ లోకేషన్ ఆప్సన్ కనిపిస్తుంది.

షేర్ లైవ్ లొకేషన్ ..
అక్కడ కనిపించే లైవ్ లొకేషన్ క్లిక్ చేస్తే మీకు షేర్ లైవ్ లొకేషన్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మీకు నచ్చినవారికి లొకేషన్ షేర్ చేయవచ్చు. అక్కడే టైం సెట్ చేయవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా..
ఈ ఫీచర్ ద్వారా మహిళలు, పిల్లలు ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కనెక్ట్ అయ్యేలా ఉండొచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు ఎక్కడ ఉన్నారో వారి స్నేహితులకు, కుటుంబసభ్యులకు ఈజీగా తెలిసిపోతుంది.

15 నిమిషాలు నాన్‌స్టాప్‌గా లైవ్‌లో..
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో రియల్ టైమ్‌లో లొకేషన్‌ను షేర్ చేయవచ్చు. ఏ సమయంలోనైనా ఈ షేరింగ్ ఆపివేయవచ్చు. అప్పుడు లైవ్ లొకేషన్ టైమర్ కూడా ఆగిపోతుంది. 15 నిమిషాలు నాన్‌స్టాప్‌గా లైవ్‌లో ఉండవచ్చని, ఇలా గరిష్టంగా ఎనిమిది గంటల పాటు లైవ్‌ను ఎంచుకోవచ్చని కంపెనీ తెలిపింది.

గ్రూపులకు సంబంధించి లైవ్‌లొకేషన్‌ను
అలాగే గ్రూపులకు సంబంధించి లైవ్‌లొకేషన్‌ను సెలక్ట్ చేసుకున్న గ్రూపు మెంబర్స్ లొకేషన్స్ ఒకే మ్యాప్‌లో కనిపిస్తాయి. ఎంతసేపు లైవ్‌లో ఉండాలనేది యూజరే నిర్ణయించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








