Whatsappలో ఇక రెండ్రోజుల దాకా Delete For Everyone ఆప్ష‌న్‌కు యాక్సెస్‌!

|

Meta సంస్థ‌కు చెందిన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ అప్లికేష‌న్ Whatsapp త‌మ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నిత్యం ఏదో ఒక కొత్త ఫీచ‌ర్ తెచ్చేందుకు ప్ర‌యోగాలు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫాంపై ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న డెలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్ (Delete For Everyone) ఆప్ష‌న్ స‌మ‌య ప‌రిమితి పెంచేందుకు సంస్థ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఇక ఆ ఫీచ‌ర్ త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విష‌యాన్నిWABetaInfo నివేదిక పేర్కొంది. ఈ కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చాక యూజ‌ర్లు రెండు రోజుల కాల ప‌రిమితి వ‌ర‌కు కూడా Delete For Everyone ఆప్ష‌న్‌ను వినియోగించుకోవ‌చ్చు.

Whatsapp Delete For Everyone

Delete For Everyone స‌మ‌య ప‌రిమితి పెంపు!
ప్ర‌స్తుతం ఈ Delete For Everyone ఆప్ష‌న్‌కు 1 గంట‌, 8 నిమిషాల 16 సెకండ్ల వ‌ర‌కు స‌మ‌య ప‌రిమితి ఉంది. తాజాగా WABetaInfo విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం చూస్తే.. ఈ డెలీట్ ఫ‌ర్ ఎవ్రీవ‌న్ ఫీచ‌ర్ స‌మ‌య ప‌రిమితి పెంచిన‌ట్లు తెలుస్తోంది. దీని ప్ర‌కారం దాదాపు రెండు రోజుల 12 గంట‌ల వ‌ర‌కు పొడిగింపు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇది ప్ర‌స్తుతానికి iOS బీటా టెస్టింగ్ యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉంద‌ని.. మ‌రికొన్ని వారాల్లో ఎక్కువ మందికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపింది.

అంతేకాకుండా, Whatsapp గ్రూపుల్లో స‌భ్యులు చేసిన ఏ మెసేజ్‌ను అయినా డెలీట్ చేసే అవ‌కాశం గ్రూప్ అడ్మిన్‌కు క‌ల్పించే ఫీచ‌ర్ కోసం కూడా సంస్థ‌ ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అద‌న‌పు స‌మాచారం కంపెనీ నుంచి వెలువ‌డ‌లేదు. త్వ‌ర‌లోనే వినియోగదారుల కోసం ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసే మరో అప్‌డేట్ రానుందని నివేదిక వెల్ల‌డించింది.

Whatsapp Delete For Everyone

త్వ‌ర‌లోనే Voice నోట్స్ (వాయిస్ స్టేట‌స్‌) ఫీచ‌ర్ కూడా అందుబాటులోకి:
వాట్సాప్ సంస్థ వాయిస్ స్టేట‌స్ అనే ఫీచ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెస్తోంది. దీంతో ఇక Whatsapp యూజ‌ర్లు Voice రూపంలో స్టేట‌స్ అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. ఇక వాయిస్ స్టేట‌స్‌కు సంబంధించిన విష‌యాల‌ను తెలుసుకుందాం.

Whatsapp అప్లికేష‌న్‌లో ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరి 24 గంట‌ల స్టేట‌స్ ఫీచ‌ర్ అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఫొటోలు, 30 సెక‌న్ల వీడియోలు, GIF మాత్ర‌మే స్టేట‌స్‌గా పెట్టుకోవ‌డానికి వీలు ఉండేది. ఈ క్ర‌మంలో తాజాగా Voice స్టేట‌స్‌ల‌ను కూడా పెట్టుకునేలా వెసులుబాటు క‌ల్పించేందుకు వాట్సాప్ సంస్థ ప్ర‌యోగాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ఫీచ‌ర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇందుకు సంబంధించి WABetaInfo నివేదిక Voice స్టేట‌స్‌ల స్క్రీన్‌షాట్‌ల‌ను విడుద‌ల చేసింది. ఇదువ‌ర‌కు ఉన్న స్టేట‌స్ అప్‌లోడ్ ఆప్ష‌న్ల మాదిరే మ‌రో వాయిస్ స్టేట‌స్ ఆప్ష‌న్ కూడా Whatsapp లో యాడ్ అయిన విష‌యాన్ని యూజ‌ర్లు ఆ స్క్రీన్ షాట్ ద్వారా గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఈ Voice స్టేట‌స్‌ను ఎలా ఉప‌యోగించాలి:
ప్రస్తుతం, వాయిస్ నోట్స్ వాట్సాప్ స్టేట‌స్‌ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు Whatsapp లో వాయిస్ ను అప్‌లోడ్ చేయ‌డానికి కింద పేర్కొన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ను అనుస‌రించండి:
* ముందుగా మీరు మీ మొబైల్‌లో Whatsapp బీటా వ‌ర్ష‌న్‌ను క‌లిగి ఉండాలి.
* వాయిస్ స్టేట‌స్ అప్‌లోడ్ చేయ‌డానికి అప్‌డేటెడ్ వాట్సాప్ బీటా వ‌ర్ష‌న‌ను క‌లిగి ఉన్నార‌నేది నిర్దారించుకోవాలి.
* ఇక స్క్రీన్‌షాట్‌లో పేర్కొన్న విధంగా వాయిస్ ఐకాన్ ఉన్న‌ ఆప్ష‌న్ క్లిక్ చేసి.. వాయిస్ రికార్డు చేసి స్టేట‌స్ అప్‌డేట్ చేయ‌వ‌చ్చు. అప్‌లోడ్ చేయ‌డానికి ముందు మీరు ఆ వాయిస్ మ‌ళ్లీ వినే అవ‌కాశం కూడా ఉంటుంది.

Whatsapp Delete For Everyone

ఇప్ప‌టికే మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌కు అద‌న‌పు ఎమోజీలు:

ఇదే కాకుండా, ఇటీవ‌ల మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌కు అద‌నంగా మ‌రిన్ని ఎమోజీల‌ను జ‌త చేస్తున్న‌ట్లు వాట్సాప్ ప్ర‌క‌టించిన‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్లో ఆరు ఎమోజీలు మాత్ర‌మే యూజ‌ర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇక‌నుంచి Message Reactions లో భాగంగా మ‌రిన్ని ఎమోజీల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఈ అద‌న‌పు ఎమోజీలకు సంబంధించి ఇదువ‌ర‌కే మెటా వ్య‌వ‌స్థాప‌కులు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్ల‌డించారు.

యూజ‌ర్లు త‌మ స్నేహితుల‌ నుంచి వ‌చ్చిన మెసేజ్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా రియాక్ష‌న్ ఫీచ‌ర్‌ను క‌నుగొన‌వ‌చ్చు. ఇందులో భాగంగా మునుపటి ఆరు ఎమోజీలతో పాటు "+" గుర్తుతో మెనూ ఓపెన్ అవుతుంది. (+) గుర్తును క్లిక్ చేయ‌డం ద్వారా స్మైలీ, ఎమోష‌న‌ల్ స‌హా ప‌లు కొత్త ఎమోజీలను కలిగి ఉన్న మెనూ ఓపెన్ అవుతుంది. ఇప్ప‌టికే ఇది ప‌లు డివైజ్‌ల‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇది మీ వాట్సాప్‌లో ఇంకా కనిపించకుంటే, రాబోయే కొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి వ‌స్తుంది.

Best Mobiles in India

English summary
WhatsApp Likely Extends 'Delete For Everyone' Time Limit To 2 Days

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X