ఆ ఫోన్ యూజర్లకు వాట్సాప్ మరికొన్ని రోజులు... !

Posted By: Madhavi Lagishetty

బ్లాక్ బెర్రీ OS, బ్లాక్ బెర్రీ 10 OS, విండోస్ 8.0, వంటి పాత ప్లాట్ ఫాంలన్నింటికీ ప్రముఖ మెసేజింగ్ యాప్, వాట్సాప్ పనిచేయద్దన్న విషయం తెలిసిందే. 2017, డిసెంబర్ 31నుంచి ఈ ప్లాట్ ఫాంకు వాట్సాప్ పనిచేయదని కంపెనీ ప్రకటించింది. కానీ బ్లాక్ బెర్రీ 10 OS వినియోగదారులకు మరో రెండు వారాలపాటు ఊరట లభించింది. ఈ ఫోన్ యూజర్ల ఫ్లాట్ ఫాంపై మరో రెండు వారాల పాటు వాట్సాప్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

ఆ ఫోన్ యూజర్లకు వాట్సాప్ మరికొన్ని రోజులు... !

క్రాక్ బెర్రీ రిపోర్ట్ ప్రకారం, బ్లాక్ బెర్రీ 10 యూజర్లు ఈ రెండు వారాల వ్యవధిలో , బ్లాక్ బెర్రీ 10 కొరకు వాట్సాప్ ఒక డీప్రికేషన్ రీతిలో కొనసాగుతుంది. యాప్ పనిచేస్తుంది కానీ స్పందించడంలో కొన్ని మార్పులు ఉంటాయని సంస్థ తెలిపింది. యూజర్లకు ఇక నుంచి వారి వాట్సాప్ అకౌంట్ ను ఈ యాప్ తో తిరి గి రిజిస్ట్రర్ చేసుకోలేరు. యాప్ ను మళ్లీ ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. పాత యాప్ నుంచి వారి ఫోన్ నెంబర్ను ధ్రువీకరించదు.

రెండు వారాల సమయం ముగిసిన తర్వాత, వాట్సాప్ గడువు ఎక్స్ పైరీ మోడ్ కు వెళ్తుంది. దీంతో యాప్ పనిచేయడం ఆగిపోతుందని మాత్రం పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత కూడా బ్లాక్ బెర్రీ 10 యాప్ వినియగదారులు ఇప్పటికే ఉన్న మెసేజ్ లను మరియు కంటెంట్ను ఇతర డివైసులోకి అనుమతిస్తుంది.

ప్రస్తుతం ఇతర ఫ్లాట్ ఫాంలు ఉంటే విండోస్ ఫోన్ మరియు బ్లాక్ బెర్రీ ఓఎస్ కూడా ఇదే విధమైన గడవును పొందుతాయి. వాట్సాప్ ఫ్లాట్ ఫాంలో వారి ప్రయత్నాలపై ద్రుష్టి పెట్టాలని ప్రకటించాయి.

8జీబి ర్యామ్‌తో Xiaomi Mi 7..?

వాట్సాప్ ప్రకారం, ఈ మూడు ఫ్లాట్ ఫాంలకు సపోర్టు చేయడానికి కారణం, యూజర్ బేస్ క్షీణిస్తున్న కారణంగా, ఆండ్రాయిడ్ మరియు ios యూజర్ల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10 మరియు విండోసో ఫోన్ 8.0 ఫ్లాట్ ఫాంల కోసం డిసెంబర్ 31,2017 వరకు పొడిగించిన కాలం ముగిసింది.

నోకియా సింబియన్ s60 కోసం కూడా ఈ ఏడాది చివరి నుంచి సపోర్టు చేయడం ఆగిపోనుంది. 2.3.7ఆండ్రాయిడ్ వెర్షన్లు, పాత వాటికి 2020 డిసెంబర్ 1 వరకే సపోర్టు చేయనున్నాయి. ఒక వేళ తమ మెసేజింగ్ యాప్ ను వాడుకోవాలంటే యూజర్లు కొత్త ఫోన్లలోకి అప్ గ్రేడ్ కావాలని సూచించింది.

English summary
WhatsApp is now dead on select platforms such as BlackBerry OS, BlackBerry 10 OS and Windows Phone 8.0 and older. The BlackBerry 10 users will get a grace period of two weeks past the end of life date. For now, it remains to be known if the other platforms have also received a similar grace period.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot