వాట్సాప్‌లో జూమ్ కంట్రోల్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడు తన వినియోగదారుల సౌకర్యం మరియు భద్రత కోసం అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లోనూ కీలక మార్పులు చేసింది. తాజాగా కెమెరా ఫీచర్లను కొన్ని మార్పులు చేయనుంది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ Wabetainfo నివేదిక ఆధారంగా కెమెరాల కోసం జూమ్ కంట్రోల్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది iOS బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నివేదిక ఆధారంగా కెమెరా పనితీరు మెరుగుపడుతుందని భావిస్తుంది. దీంతోపాటు అదనపు ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతోంది. బీటా టెస్టర్ లకు ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్‌ను వారంతా జూమ్ లెవల్‌ను మార్చుకొనేందుకు అవకాశం ఉంది.
ఈ ఫీచర్ కారణంగా వాట్సాప్ వినియోగదారులకు కెమెరాపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా ఉత్తమ ఫోటోలు మరియు మెరుగైన వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. భవిష్యత్‌లో రానున్న అప్‌గ్రేడ్‌లలో మరిన్ని కొత్త ఫీచర్లను పొందవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ గురించి వివరాలు వెల్లడి కాలేదు.
** దీంతోపాటు స్టిక్టర్ రూపొందించేందుకు త్వరలో కొత్త ఫీచర్ ను విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త డిజైన్‌తో స్టిక్కర్‌ను తయారు చేయవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టిక్కర్‌లను రూపొందించుకోవచ్చని తెలుస్తోంది.
** వాట్సాప్‌లో కమ్యూనిటీస్ కోసం కొత్త ఫీచర్లను ఇటీవల ప్రకటించింది. ఇందులోని సభ్యులు ఈవెంట్లను క్రియేట్ చేయడం ఇతరులను ఆహ్వానించడం మరియు గ్రూప్‌లోని సభ్యుల అభిప్రాయాలను సేకరించే విధంగా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్‌పై మెటా సీఈవో జుకర్‌బర్గ్ ప్రకటన చేశారు.
వాట్సాప్ కమ్యూనిటీస్‌లో ఉన్న సభ్యులు ఈవెంట్లను క్రియేట్ చేయవచ్చు. మరియు అడ్మిన్ పోస్టులపై స్పందించవచ్చు. నవంబర్ 2022 లో కమ్యూనిటీ ఫీచర్‌ను వాట్సాప్ లాంచ్ చేసింది. ఒక కమ్యూనిటీలో గరిష్ఠంగా 100 రకాల గ్రూప్‌లను క్రియేట్ చేయవచ్చు.
వాట్సాప్ ఈవెంట్ ఫీచర్ ద్వారా అడ్మిన్‌లు సహా ఇతరులు థర్డ్ పార్టీ యాప్‌ల సాయం లేకుండానే ఈవెంట్‌లను ప్లాన్ చేయవచ్చు. మరియు ఇతర సభ్యులను ఆహ్వానాలు పంపవచ్చు. ఈ ఫీచర్ రానున్న రోజుల్లో వ్యక్తిగత గ్రూప్‌లకు కూడా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. కమ్యూనిటీలో అడ్మిన్‌లు ఏదైనా ప్రకటన చేసినప్పుడు, వినియోగదారులు వాటిపై ప్రతిస్పందించగలరు. అయితే ఇవి డిఫాల్ట్‌గా మ్యూట్ ఆప్షన్‌లో ఉండనున్నాయి.
*వాట్సాప్ ఫైల్ షేరింగ్ ఫీచర్ పైన పనిచేస్తోందని తెలుస్తోంది. ఫలితంగా సౌకర్యంగా ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకొనే అవకాశం ఉండనుంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ప్రకారం ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. సమీపంలోని వ్యక్తులకు సులభంగా ఫైల్ షేరింగ్ చేసే అవకాశం ఉండనుంది. యాప్ సెట్టింగ్స్‌లోనే దీన్ని గుర్తించవచ్చని తెలుస్తోంది. ఫైల్ షేరింగ్ కోసం రెండు డివైస్‌లు వాట్సాప్‌ను ఓపెన్ చేసి పరస్పరం కనెక్ట్ కావాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








