వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం కీలక ఫీచర్.. మీ సీక్రెట్ చాట్ మరింత భద్రం..!!
మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ( Whatsapp ).. తన వినియోగదారుల భద్రత కోసం అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యమైన చాట్‌ల భద్రత కోసం లాకడ్ చాట్ (Locked Chat) ఫీచర్ సహా అనేక ఫీచర్లను లాంచ్ చేసింది. ఇదే ఫీచర్‌ను లింక్ చేసిన డివైజ్ లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది.
గత నెలలోనే ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo అందించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.24.11.9 వెర్షన్‌లో అందుబాటులో ఉందని తెలిపింది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అంటే.. వాట్సాప్‌ను ప్రస్తుతం గరిష్ఠంగా 4 డివైజ్‌లో లింక్ చేయవచ్చు.

గతంలో ఈ Locked Chat ఫీచర్ కేవలం ప్రైమరీ డివైజ్‌లో మాత్రమే పనిచేసేది. ఇతర లింక్ చేసిన డివైజ్‌లలో పనిచేయలేదు. తాజాగా వచ్చిన అప్‌డేట్ ద్వారా లింక్ చేసిన డివైజ్‌లో కూడా ఈ ఫీచర్ సక్రమంగా పనిచేస్తుంది. ప్రస్తుతం కొంతమందికి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ విడుదల కానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ లకు మాత్రమే అందుబాటులోకి ఉందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo తెలిపింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. Locked Chat ఫీచర్ కలిగి ఉన్న సీక్రెట్ కోడ్ మాత్రం ప్రైమరీ డివైజ్‌లోనే ఉండనుంది.
చాట్‌ను లాక్ చేసుకొనేందుకు అవసరం అయిన సీక్రెట్ కోడ్‌ను క్రియేట్ చేసుకొనేందుకు తొలుత ప్రైమరీ ఫోన్‌లో... చాట్ లాక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ సెటప్ సీక్రెట్ కోడ్ అనే ఆప్షన్ ద్వారా క్రియేట్ చేసుకోవాలి. అనంతరం Locked Chat వద్ద మాత్రమే సీక్రెట్ కోడ్ వినియోగించగలుగుతారు.
వాట్సాప్‌ను లింక్ చేసిన ఇతర పరికరాల్లోనూ వినియోగదారుల భద్రతకు ఎటువంటి ఆటంకం రాకుండా ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. అందరికీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ వెల్లడించలేదు.
** వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ Wabetainfo నుంచి ఇటీవల వచ్చిన నివేదిక ఆధారంగా కెమెరాల కోసం జూమ్ కంట్రోల్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది iOS బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నివేదిక ఆధారంగా కెమెరా పనితీరు మెరుగుపడుతుందని భావిస్తుంది. దీంతోపాటు అదనపు ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతోంది. బీటా టెస్టర్ లకు ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్‌తో వారంతా జూమ్ లెవల్‌ను మార్చుకొనేందుకు అవకాశం ఉంది.
ఈ ఫీచర్ కారణంగా వాట్సాప్ వినియోగదారులకు కెమెరాపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా ఉత్తమ ఫోటోలు మరియు మెరుగైన వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ గురించి వివరాలు వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








