ప్రొఫెషనల్ కోసం వెతుకుతున్న వాట్సప్

Posted By: Madhavi Lagishetty

ఫేసు బుక్ అనుబంధ సంస్థ అయిన వాట్సప్...వాట్సప్ మెసేంజర్ కంపెనీ మోనటైజ్ చేయగల ఒక ప్రొఫెషనల్ కోసం వెతుకుతుంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ బ్లాక్ ప్రకారం మోనటైజేషన్ ప్రయత్నాలకు ఉత్పత్తి , అభివ్రుద్ధి చేయగల అనుభవం ప్రొఫెషనల్ కోసం కంపెనీ సెర్చ్ చేస్తుంది.

ప్రొఫెషనల్ కోసం వెతుకుతున్న వాట్సప్

మీకు వస్తువులను ఉత్పత్తి చేయడంలో అనుభవం ఉన్నట్లయితే...వినియోగదారులు, వ్యాపారం చేయగల సామర్థ్యం ఉన్నవారికి మోనటైజ్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వాట్సప్ అనేది స్టార్టప్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఇంజనీర్లు, డిజైనర్లతోపాటు ఇతర ఫంక్షనల్ భాగస్వాములతోకలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడున్న ఆహ్లదకరమైన వాతావరణంలో మొబైల్ యాప్ ఎలా పాసిబుల్ అవుతుందని ఇతరలతో డిస్కస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

కాల్నిఫోర్నియాలోని ఫెస్ బుక్ ప్రధాన కార్యాలయం ఉన్న మోన్లో పార్క్ లో వాట్సప్ టీంతో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగి గ్రోత్ అండ్ మోనటైజేషన్ ను వాట్సప్ డైరెక్టర్ నివేదిస్తాడు.

ఒక సంస్థ ఎల్లప్పుడూ సాంకేతిక అభివ్రుద్ధి, వినూత్నంగా ఆలోచించే వ్యక్తిని కోరుకుంటుంది. అతను కానీ, ఆమె కానీ సంస్ధ అభివ్రద్ధికి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ అభివ్రుద్ధి పదంలో నడపాలి. సరళత, నాణ్యతతో కూడిన ప్రమాణాలను రూపొందించడంతోపాటు నిర్మించడానికి ఇంజనీర్లు, డిజైనర్లు నిరంతరం పనిచేస్తూ ఉండండి అని బ్లాగు ఉద్యోగ బాధ్యతల గురించి వివరించింది.

10సంవత్సరాల అనుభవంతో పాటు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ తో పాటు టెక్నికల్, నిర్మాణాలపై అవగాహన మొబైల్ పరికరాల రూపకల్పనపై అవగాహన కలిగి ఉండాలి. 180 దేశాల్లో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వాట్సప్ ను వినియోగిస్తున్నారు. స్నేహితులు , కుటుంబ సభ్యులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు వాట్సప్ ఉపయోగిస్తున్నారు. వాట్సప్ కేవలం సామాజిక మాధ్యమమే కానీ...ఎలాంటి లాభాన్ని ఆర్జించడం లేదు.

English summary
WhatsApp is looking out for professional help.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot