వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ తరహా ఫీచర్.. యూజర్లకు ఏంటి ఉపయోగం.?
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (Whatsapp) ఇటీవల కాలంలో అనేక ప్రత్యేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవలే వాయిస్ నుంచి టెక్స్ట్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు యూజర్ నేమ్ ఫీచర్ పైనా పనిచేస్తోందని ఫీచర్ ట్రాకర్ Wabetainfo వెల్లడించింది.
దీంతోపాటు ఇటీవలే ఫేస్‌బుక్ కవర్ ఫోటో తరహాలో.. వాట్సాప్ లోనూ కవర్ ఫోటో ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని తెలుస్తోంది. మరియు కొత్త నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నియంత్రించే ఫీచర్ కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెలుస్తోంది. యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని తెలుస్తోంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి మెసేజ్ లు వచ్చినప్పుడు, ఈ ఫీచర్ మీకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
* కొత్త నంబర్ల నుంచి మెసేజ్‌లు వచ్చినప్పుడు (Whatsapp Message Requests Folder) యూజర్లు, ఇతర మెసేజ్‌ల నుంచి వేరు చేసి ఫిల్టర్ మాదిరిగా పనిచేస్తుంది. ఫలితంగా యూజర్లకు మరింత సౌకర్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ భవిష్యత్‌లో వచ్చే అప్‌డేట్ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
అయితే ఇందులో రెండు ఆప్షన్‌లు ఉంటాయని తెలుస్తోంది. 'Who Can Message Me' అనే పేరుతో ఉంటాయి. ఇందులో Everyone అనే తొలి ఆప్షన్ ఉంటుంది. ఇందులో అన్ని మెసేజ్‌లు ఒకే ఫోల్డర్ లో కనిపిస్తాయి. అంటే కొత్త నంబర్ల నుంచి మెసేజ్ వచ్చినా, మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నంబర్ల నుంచి మెసేజ్ వచ్చినా ఇప్పుడున్నట్లు ఒకటే ఫోల్డర్ లో కనిపిస్తాయి. ఈ ఫీచర్ డిఫాల్ట్ గా ఉంటుందని తెలుస్తోంది.
ఇందులో మరో ఆప్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. My Contacts పేరుతో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఆప్షన్ ను యాక్టివేట్ చేసుకుంటే.. కొత్త నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు అన్నీ Requests పేరుతో ఉన్న ఫోల్డర్ లో కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే తరహా సిస్టమ్ ఉంది.
ఇన్‌స్టాలో ప్రస్తుతం కొత్త వ్యక్తులతో మెసేజ్‌లు వస్తే.. అవన్నీ Requests పేరుతో ఉన్న ఫోల్డర్‌లో కనిపిస్తాయి. ఫలితంగా యూజర్లకు అవసరం అయిన మెసేజ్‌లు ముందుగా చూసేందుకు అవకాశం ఉంటుంది. మరియు చాట్ ట్యాబ్ ను సౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది.
ఈ ఫీచర్ యూజర్లకు మెరుగైన అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇటీవలే వాట్సాప్ నుంచి మేడ్ ఇన్ ఇండియా యాప్ అరట్టైకు నేరుగా మెసేజ్ చేసే ఫీచర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








