వాట్సాప్‌లో పొరపాటుగా పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు

ప్రస్తుతం వాట్సాప్‌లో మనం ఎవరికైన పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే దాన్ని వెనక్కితీసుకోవటం కుదరదు. కానీ ఇక పై ఆ టెన్షన్ ఉండదు. 'రీకాల్' మెసెజ్ పేరుతో కొత్త సదుపాయం వాట్సాప్‌లో చేరబోతోంది.

Read More : Apple ఈవెంట్ ముఖ్యాంశాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పంపిన మెసేజ్‌లను వెనక్కితీసకునే అవకాశం...

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లయితే పొరపాటున పంపిన మెసేజ్‌లను వెనక్కితీసకునే వీలుంటుంది. అయితే, మెసేజ్ పంపిన 5 నిమిషాల్లోపు మాత్రమే రీకాల్ చేసే వీలుంటుంది.

WABetaInfo తెలిపిన వివరాల ప్రకారం..

WABetaInfo అనే ఫ్యాన్ వెబ్‌సైట్ వాట్సాప్‌లో వచ్చే కొత్త ఫీచర్లను ముందుగానే పరీక్షిస్తుంటుంది. ఈ సైట్ చెబుతోన్న దాని ప్రకారం త్వరలోనే ఈ రీకాల్ మెసేజ్ ఆప్షన్ వాట్సాప్‌లో యాడ్ కాబోతోంది.

ఒక్క టెక్స్ట్‌ను మాత్రమే కాదు..

'రీకాల్' మెసెజ్ ఫీచర్ ద్వారా ఒక్క టెక్స్ట్‌ను మాత్రమే కాకుండా పొరపాటును పంపించే ఫోటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, మెసేజ్ కొటేషన్స్, స్టేటస్ రిప్లైస్ ఇలా అన్నింటిని 5 నిమిషాల్లోపు వెనక్కితీసుకునే వీలుంటుంది.

ఫీచర్‌ను మరింత అభివృద్ధి చేయవల్సి ఉంది!

సెండ్ చేసిన మెసేజ్‌‌ ఎడిట్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ బేటా వర్షన్ కల్పిస్తోందని, ఈ ఫీచర్‌ను మరింత అభివృద్ధి చేయవల్సి ఉందని WABetaInfo ఒక ట్వీట్‌లో పేర్కొంది.

1.2 బిలియన్ యాక్టివ్ యూజర్లు ..

వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 50 భాషల్లో ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ లభ్యమవుతోంది. భారత‌కు వచ్చేసరికి 10 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్ అందుబాటులో ఉంది. 200 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp may soon let you delete messages that have been sent by mistake. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting