వాట్సాప్ లో సూపర్ ఫీచర్.. ఇతర భాషల వారితోనూ సులభంగా చాట్ చేసుకోవచ్చు..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సౌకర్యం కోసం ఇప్పటికే అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర భాషల్లోని ఫ్రెండ్స్ సహా ఇతరులతో చాట్ చేసే వారికి ఉపయోగపడే విధంగా వాట్సాప్ తాజాగా ఓ ఫీచర్ పైన ప్రకటన చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఇతర భాషల వారితోనూ సులభంగా చాట్ చేసేందుకు వీలుంటుంది. ఈ ఫీచర్ పూర్తి వివరాలు.
* వాట్సాప్ లో కొత్త ఫీచర్ :
వాట్సాప్ తాజాగా మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ (Whatsapp Message Translations) ఫీచర్ వివరాలను వెల్లడించింది. తమ బ్లాక్ పోస్ట్ లో ఈ వివరాలను వెల్లడించింది. వాట్సాప్ కొత్త ఫీచర్ వ్యక్తిగత చాట్, గ్రూప్ చాట్, ఛానళ్లలోనూ ఉపయోగపడుతుందని చెబుతోంది.

* గరిష్ఠంగా 19 భాషలను సపోర్టు చేస్తుంది :
ప్రస్తుతానికి ఈ మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల లో ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, రష్యన్, అరబిక్, పోర్చుగీస్ భాషలను సపోర్టు చేస్తుందని వాట్సాప్ తెలిపింది. అదే iOS లో ఏకంగా 19 భాషలను సపోర్టు చేస్తుందని తెలిపింది. ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్, iOS స్మార్ట్‌ఫోన్ లకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
* అయితే ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి :
వాట్సాప్ చాట్, గ్రూప్, ఛానళ్లలో ఏదైనా మెసేజ్ ను మీకు కావాల్సిన భాషలోకి మార్చేందుకు, ఆ మెసేజ్ పైన Long Press చేయాల్సి ఉంటుంది. అనంతరం నచ్చిన భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా సులభంగా ఇతర భాషల వారితో చాట్ చేయవచ్చు.
* మరో మంచి ఆప్షన్ కూడా ఉంది :
ఈ ఫీచర్ లో మరో మంచి ఆప్షన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఆప్షన్ ఎంచుకున్నాక వచ్చే అన్ని మెసేజ్ లు మీరు నచ్చిన భాషలోనే కనిపించనున్నాయి. ఈ ఫీచర్ యూజర్లకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.
* గోప్యతపై వాట్సాప్ ఏం చెబుతోందంటే :
ఈ ఫీచర్ కారణంగా యూజర్ల గోప్యతకు భంగం కలగదని వాట్సాప్ చెబుతోంది. యూజర్ల డివైజ్ లోనే ఈ ట్రాన్స్‌లేషన్ ప్రక్రియ జరుగుతుందని, ఫలితంగా గోప్యత, భద్రత సమస్యలు ఉత్పన్నం కావని చెబుతోంది. ఈ మెసేజ్ లను వాట్సాప్ సైతం చూడలేదని చెబుతోంది.
* వాట్సాప్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి :
> మీరు ట్రాన్స్‌లేషన్ చేయాలని భావిస్తున్న వాట్సాప్ గ్రూప్ ను ఓపెన్ చేయండి.
> అక్కడ కనిపించే 3 డాట్ మెనూ పైన క్లిక్ చేయండి.
> అనంతరం ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను గుర్తించండి.
> అక్కడ కనిపించే ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్స్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ లో 6 భాషలను మాత్రమే సపోర్టు చేస్తుంది. అయితే భవిష్యత్ లో మరిన్ని భాషలకు సపోర్టు చేసేలా అప్ డేట్ తీసుకొస్తామని వాట్సాప్ చెబుతోంది. iOS లో ప్రస్తుతానికి 19 భాషలు సపోర్టు చేస్తున్నాయి. భవిష్యత్ లో ఇందులోనూ మరిన్ని భాషలను చేరుస్తామని తెలిపింది.


Click it and Unblock the Notifications








