21 భాషల సపోర్టుతో వాట్సాప్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
వాట్సాప్ త్వరలో యూజన్ నేమ్ ఫీచర్ ను తీసుకొస్తుందని ఇటీవలే వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo తెలిపింది. ప్రస్తుతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలో ఫోన్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేకుండానే.. కొత్త యూజర్లతో చాట్, కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. తాజాగా మరో ఫీచర్‌ను వాట్సాప్‌ను విడుదల చేసింది.
మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ :
వాట్సాప్ లో మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ (Whatsapp Message Translations) గురించి ఇటీవల వివరాలు వెల్లడయ్యాయి. దీని ద్వారా ఎటువంటి థర్డ్‌పార్టీ యాప్ ల అవసరం లేకుండా నేరుగా ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చని లీక్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ వాట్సాప్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది :
ప్రస్తుతం వాట్సాప్ iOS యూజర్లలో కొంత మందికి ఈ మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ వెర్షన్ యాప్ కలిగిన యూజర్లకు ఈ ఫీచర్ కనిపిస్తోంది. వాట్సాప్ iOS వెర్షన్ 25.28.74 లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో మరింత మందికి విడుదల కానుంది.
21 భాషల్లో ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చు :
వాట్సాప్ యాప్ ను అప్‌డేట్ చేసుకొని, ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది. వాట్సాప్ iOS యూజర్లు ఈ ఫీచర్ ద్వారా ఏకంగా 21 భాషల్లోకి మెసేజ్ లను ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చు.
వాట్సాప్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్ లో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఎంచుకున్న భాషలోకి సులభంగా అనువాదం జరుగుతుంది. అయితే అక్కడ కనిపించే అనువాదాల్లో మీరు సరైనది ఎంచుకొనే అవకాశం కూడా ఉంటుంది. 21 భాషలకు సపోర్టు చేస్తుంది.
ప్రస్తుతానికి ఈ భాషలను సపోర్టు చేస్తుంది :
ఆఫ్‌లైన్ లో కూడా ఈ ఫీచర్ ను ఉపయోగించుకొనేందుకు వీలుగా వాట్సాప్ యూజర్లు లాంగ్వేజ్ ప్యాక్స్ ను ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అరబిక్, చైనీస్, డచ్, ఇంగ్లీష్ (UK, US), ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియా, ఇటాలియన్, జపానీస్, కొరియన్, పొలిష్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, థాయ్, టర్కీస్, ఉక్రెయిన్, వియత్నమీస్ వంటి భాషలను సపోర్టు చేస్తుంది.
ఈ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి :
వాట్సాప్ చాట్, గ్రూప్, ఛానళ్లలో వచ్చిన మెసేజ్ లను మీకు కావాల్సిన భాషలోకి సులభంగా అనువాదం చేసుకోవచ్చు. ఇందుకోసం మెసేజ్ పైన Long Press చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ కనిపించిన భాషల్లో మీకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి. ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
అయితే మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కారణంగా ప్రైవసీకి ఎటువంటి భంగం కలగదని వాట్సాప్ చెబుతోంది. ట్రాన్స్‌లేషన్ ప్రక్రియ అంతా పూర్తిగా యూజర్ల డివైజ్ లోనే జరుగుతుందని, ఫలితంగా యూజర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది.


Click it and Unblock the Notifications








