Whatsapp : స్టేటస్ అప్‌డేట్ మరింత ఆకట్టుకొనేలా వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ తరహా ఫీచర్..!
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను (Whatsapp) భారత్‌లో సుమారు 50 కోట్లకు పైగా ప్రజలు వినియోగిస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న తన యూజర్ల కోసం వాట్సాప్ అనేక ఫీచర్లను లాంచ్ చేస్తోంది. తాజాగా వాట్సాప్ మరో సూపర్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఆండ్రాయిడ్, iOS యూజర్లకు కూడా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ తరహా ఫీచర్ మరో ప్రముఖ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ కలిగి ఉంది.
గత వారం వాట్సాప్ కొన్ని ఫీచర్‌లను తీసుకొచ్చింది. డబుల్ ట్యాప్ రియాక్షన్, సెల్ఫీ స్టిక్కర్లను విడుదల చేసింది. అయితే తాజాగా వాట్సాప్ స్టేటస్ కు మ్యూజిక్ ను యాడ్ చేసుకొనేందుకు అవకాశం ఉండనుంది. ఫలితంగా స్టేటస్ మరింత ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ తరహా ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. ఈ వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది.

ప్రస్తుతం బీటా వెర్షన్‌లో :
దీని ఆధారంగా వాట్సాప్ కొత్త ఫీచర్ Music for Status Updates టెస్టింగ్ కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.25.2.5 అప్‌డేట్‌లో ఉంది. టెస్టింగ్ అనంతరం ఆండ్రాయిడ్ యూజర్‌లకు విడుదల చేయనున్నారు.
ఆండ్రాయిడ్ వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ను వినియోగించుకొనేందుకు వీలుగా ప్రత్యేక బటన్‌ను అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. దీంతోపాటు యూజర్లకు నచ్చిన మ్యూజిక్‌ను ఎంచుకొనేందుకు వీలుగా ప్రత్యేక లైబ్రరీని కలిగి ఉంటుందని సమాచారం. ఇందులో ట్రెండింగ్ ట్రాక్‌లు సహా ఇతర మ్యూజిక్ ట్రాక్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఈ మ్యూజిక్ లైబ్రరీ నుంచి యూజర్లు తమకు నచ్చిన ట్రాక్‌ను యాడ్ చేసుకోవచ్చు.
అయితే ఫోటో స్టోరే అప్‌డేట్ చేసే సమయంలో గరిష్ఠంగా 15 సెకన్ల వరకు మ్యూజిక్ ట్రాక్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ తరహా ఇతర ప్రత్యేకతలను కలిగి ఉండనుంది. iOS యూజర్ల కోసం కూడా ఈ ఫీచర్‌ను ఇప్పటికే టెస్టింగ్ చేశారు. ఆండ్రాయిడ్‌తోపాటు ఆపిల్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందో వాట్సాప్ వెల్లడించలేదు.
ఇటీవల వాట్సాప్ లో ఫొటోలు, వీడియోలకు ఫిల్టర్లు, విజువల్ ఎఫెక్ట్‌లు యాడ్ చేసేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం 30 కి పైగా ఆప్షన్‌లను తీసుకొచ్చింది. గత నెలలో వీడియోలకు సరికొత్త ఎఫెక్ట్‌లను విడుదల చేసింది. దీంతోపాటు సెల్ఫీలతో స్టిక్కర్లు తయారు చేసుకోవచ్చు.
ఈ ఫీచర్‌లో క్రియేట్ స్టిక్కర్ ఐకాన్‌ను ప్రెస్ చేసి సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం పర్సనలైజ్డ్ స్టిక్కర్‌గా మారుతుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు తొలుత అందుబాటులోకి తీసుకొచ్చింది. iOS యూజర్లకు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
దీంతోపాటు వాట్సాప్ ద్వారా UPI పేమెంట్లు చేసుకొనేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇటీవల పూర్తి స్థాయిలో అనుమతిచ్చింది. గతంలో ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఫలితంగా 50 కోట్లకు పైగా ఉన్న యూజర్లకు వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. గతంలో కేవలం 10 కోట్ల మంది యూజర్లకే వాట్సాప్ పేమెంట్ ఫీచర్ అందుబాటులో ఉండేది.
Image credit : WABetaInfo


Click it and Unblock the Notifications








