Android బీటా యూజర్లకు వాట్సాప్‌ మరొక కొత్త ఫీచర్

|

ప్రపంచం మొత్తం మీద మరొకరితో త్వరగా మరియు సులభంగా చాటింగ్ చేయడానికి ఉపయోగించే యాప్ లలో ఒకటి వాట్సాప్. ఈ సోషల్ మీడియా యాప్ తన వినియోగదారులకు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్‌లోని బీటా వినియోగదారుల కోసం ఇప్పుడు 'అడ్వాన్స్‌డ్ సెర్చ్' ఫీచర్‌ను వాట్సాప్ విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఫీచర్ గత కొన్ని నెలలుగా పరీక్షలో ఉంది. మొదట ఈ ఫీచర్ iOS వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్‌లో అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచర్

వాట్సాప్‌లో అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచర్

వాట్సాప్ యొక్క అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచర్‌ దాని యొక్క పేరుకు తగ్గట్టుగా వాట్సాప్‌లోని ఫైల్‌లను సులభంగా శోధించడానికి వీలు కల్పిస్తుంది. ఇది వాట్సాప్‌లో పంచుకున్న అన్ని రకాల మీడియా మరియు ఫైల్‌లను వర్గాల వారిగా సృష్టిస్తుంది. కొత్త అధునాతన సెర్చ్ ఫీచర్ వాట్సాప్ యొక్క స్థిరమైన సంస్కరణలో ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ వాట్సాప్ బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లు దీన్ని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

వాట్సాప్ సెర్చ్ ఫీచర్ పనిచేయు విధానం

వాట్సాప్ సెర్చ్ ఫీచర్ పనిచేయు విధానం

వాట్సాప్‌లోని ఈ అడ్వాన్స్ సెర్చ్ ఫీచర్ వాట్సాప్ యాప్‌లో డిఫాల్ట్‌గా ఆన్ చేయబడి ఉంచాలి. ఇప్పుడు మీరు యాప్ పైన ఉన్న సెర్చ్ టూల్ ని ఎంచుకున్నప్పుడు ఫోటోలు, వీడియోలు, లింకులు, GIF లు, ఆడియో మరియు డాక్యుమెంట్ వంటి వివిధ ఎంపికలతో డ్రాప్ డౌన్ మెను కనిపిస్తుంది. ఏదైనా ఒక నిర్దిష్ట వస్తువు కోసం సెర్చ్ చేయడానికి మీరు ఏవైనా ఎంపికలను నొక్కవచ్చు లేదా మీరు సెర్చ్ పట్టీలో టైప్ చేయవచ్చు కూడా. ఇప్పుడు మీరు సెర్చ్ పట్టీలో టైప్ చేసినప్పుడు సెర్చ్ ఫలితాల్లో చాట్‌లతో పాటు సంబంధిత ఫోటోలు, వీడియోలతో పాటుగా మరిన్ని చూడవచ్చు.

Also Read:సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చే డివైస్‌ను విడుదల చేసిన నోకియా...Also Read:సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చే డివైస్‌ను విడుదల చేసిన నోకియా...

వాట్సాప్‌ సెర్చ్ ఫీచర్ ఎంపిక

వాట్సాప్‌ సెర్చ్ ఫీచర్ ఎంపిక

ఏదైనా ఎంపికలను ఎంచుకోవడం కోసం సెర్చ్ చేసినప్పుడు వాట్సాప్‌లో ఆ నిర్దిష్ట ఫైల్ రకానికి సంబందించిన ప్రతిదాన్ని చూపుతుంది. ఉదాహరణకు మీరు ఫోటోలను ఎంచుకుంటే మీరు పంపిన మరియు స్వీకరించిన అన్ని ఫోటోలను వాట్సాప్‌లో చూస్తారు. మీరు ఈ సెర్చ్  బాక్స్ లో కూడా టైప్ చేయవచ్చు. ఫోటోలు, వీడియోలు లేదా GIF లతో చాట్‌లను చూపించే గ్రిడ్ వీక్షణకు మారడానికి ఒక ఎంపిక కూడా ఉంది.

వాట్సాప్‌ సెర్చ్ ఫీచర్ ఉపయోగం

వాట్సాప్‌ సెర్చ్ ఫీచర్ ఉపయోగం

వాట్సాప్‌లో క్రొత్తగా విడుదల చేసిన సెర్చ్ ఫీచర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకించి వాట్సాప్‌లో అధిక డేటాను స్టోర్ చేసిన వ్యక్తులకు అయితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్‌లోని ఈ ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం విడుదల కాలేదు కానీ ఇది బీటాలో ఉన్నవారికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది.

 

వాట్సాప్ QR కోడ్‌ ఫీచర్

వాట్సాప్ QR కోడ్‌ ఫీచర్

వాట్సాప్ సంస్థ తన వినియోగదారులకు ఇప్పుడు QR కోడ్‌లను అందిస్తున్నది. దీనిని ఉపయోగించి ఎవరైనా క్రొత్త వారిని మరింత సులభంగా జోడించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వారు చేయాల్సిందల్లా ఇతర వ్యక్తి యొక్క QR కోడ్‌ను స్కాన్ చేయడం మాత్రమే. ఇలా చేస్తే కనుక ఆ వ్యక్తిని నేరుగా మీ యొక్క వాట్సాప్‌కు జోడించబడుతుంది.

Also Read:శాశ్వతంగా ధర తగ్గింపును అందుకున్న Samsung Galaxy M01Also Read:శాశ్వతంగా ధర తగ్గింపును అందుకున్న Samsung Galaxy M01

వాట్సాప్ గ్రూప్ కాల్స్ న్యూ ఫీచర్

వాట్సాప్ గ్రూప్ కాల్స్ న్యూ ఫీచర్

వాట్సాప్ సంస్థ తన వాట్సాప్ గ్రూప్ కాల్స్ లలో కూడా మెరుగుదలలను ప్రవేశపెట్టనున్నది. ఇది ఇప్పుడు వీడియో కాల్‌లో పాల్గొనేవారి సంఖ్యను పెంచడం మీద దృష్టి పెట్టింది. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ కాల్ లో 8 లేదా అంతకంటే తక్కువ సమూహ చాట్ కోసం వీడియో చిహ్నం కూడా జోడించబడింది. కాబట్టి మీరు సులభంగా ఒక-ట్యాప్‌తో గ్రూప్ వీడియో కాల్‌ను ప్రారంభించవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp New Advanced Search Feature Now Available on Android Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X