Home
Apps

Whatsapp కీలక ఫీచర్‌.. రెండు అకౌంట్లను ఒకటే యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు..!

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు కలిగిన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌... తన వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. గత కొన్ని నెలలుగా యూజర్ల భద్రత, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కీలక ఫీచర్లను వాట్సాప్‌ విడుదల చేస్తోంది. తాజాగా ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్‌ ఖాతాలను (Dual Whatsapp Accounts Feature) వినియోగించుకొనేందుకు వీలుగా మరో ఫీచర్‌ను ప్రకటించింది.

అయితే ఇప్పటికే చాలా మంది క్లోన్‌ లేదా ఇతర థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్ ఖాతాలను వినియోగిస్తున్నారు. ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక వాటి అవసరం లేకుండా.. ఒకే యాప్‌ నుంచి రెండు వేర్వేరు వాట్సాప్‌ ఖాతాలను వినియోగించుకోవచ్చు.

one app two whatsapp accounts

మెటా సీఈవో కీలక ప్రకటన : మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఈ కొత్త ఫీచర్‌పై గురువారం కీలక ప్రకటన చేశారు. ఒకే యాప్‌ ద్వారా రెండు వాట్సాప్‌ ఖాతాలను నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. త్వరలోనే డ్యూయల్ వాట్సాప్‌ అకౌంట్ ఫీచర్‌ వినియోగదారులు అందరికి అందుబాటులోకి వస్తుందని జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు.

ఒకే యాప్‌తో రెండు అకౌంట్లు : కొంత మంది వ్యక్తిగత లేదా అధికారిక నంబర్లను వినియోగిస్తుంటారు. అయితే వారు రెండో నంబర్‌తో వాట్సాప్‌ను వినియోగించాలంటే మొదటి అకౌంట్‌ను లాగ్‌ అవుట్‌ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్‌ కొత్తగా తీసుకురానున్న ఫీచర్‌తో స్విచ్చింగ్‌ మోడ్‌లో రెండు వాట్సాప్‌ ఖాతాలను ఒకేసారి వినియోగించుకోవచ్చు.

one app two whatsapp accounts

డ్యూయల్‌ వాట్సాప్‌ అకౌంట్‌ను ఉపయోగించేందుకు మీరు ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ రెండు సిమ్‌ కార్డులను (ఫిజికల్‌ కార్డు లేదా ఈ-సిమ్‌) సపోర్టు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఒకే యాప్‌లో రెండు అకౌంట్లను వినియోగించేందుకు వీలు ఉంటుంది. రెండో సిమ్ కార్డు నుంచి కూడా SMS వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.

అయితే ఈ డ్యూయల్‌ వాట్సాప్‌ అకౌంట్ ఫీచర్‌ కొన్ని రోజులు లేదా వారాల్లో వినియోగదారులు అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీనిపై వాట్సాప్‌ అధికారిక ప్రకటన చేసింది. అయితే తేదీపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక ఈ కింది విధంగా యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

ఒకటే యాప్‌.. రెండు వాట్సాప్‌ ఖాతాలు..

- తొలుత వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి.
- అనంతరం యాప్‌ను ఓపెన్‌ చేసి పైన కనిపించిన మూడు చుక్కలపైన క్లిక్‌ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- అక్కడ కనిపించిన అకౌంట్స్‌లోకి వెళ్లాలి. అనంతరం మీ రెండో ఫోన్‌ నంబర్‌ను అక్కడ నమోదుచేయాలి.
- అనంతరం SMS లేదా ఫోన్‌ కాల్‌ ద్వారా వచ్చిన కోడ్‌ను అక్కడ ఎంటర్‌ చేయాలి.
- ధ్రువీకరణ అయిన తర్వాత అక్కడో బాణం గుర్తు కనిపిస్తుంది.
- అనంతరం రెండు అకౌంట్లను సులభంగా వినియోగించుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp new dual whatsapp account feature will be rolled out soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X