WhatsApp లో కొత్త ఫీచర్, ఇక షాపింగ్ కూడా ఇక్కడే చేసేయండి.

By Maheswara
|

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ కలిగిన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులను ప్లాట్‌ఫారమ్‌లో షాపింగ్ కోసం వస్తువులు వెతకడానికి అలాగే వారితో చాట్ చేయడానికి మరియు ఉత్పత్తులను షాపింగ్ చేసే కొత్త ఆప్షన్ ను కల్పిస్తుంది. వాట్సాప్ బిజినెస్ యూజర్‌లు బ్యాంకింగ్, ట్రావెల్ వంటి కేటగిరీ లను బట్టి వ్యాపారాలను బ్రౌజ్ చేయగలరు లేదా ఈ అప్‌డేట్‌ని ఉపయోగించి వారి పేరుతో కూడా వెతకడానికి అవకాశంగాఉంది. అయితే, ఇది ప్రస్తుతం బ్రెజిల్, కొలంబియా, ఇండోనేషియా, మెక్సికో మరియు UKతో సహా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు పరిమితం చేయబడింది.

 

ఆన్‌లైన్ పేజీలో

ఆన్‌లైన్ పేజీలో పోస్ట్ చేసిన ఒక బ్లాగ్ పోస్ట్‌లో, WhatsApp ఈ కొత్త ఫీచర్ వ్యాపార ప్రొఫైల్‌లోని వినియోగదారులకు వారి ఫోన్ నంబర్‌లను కాంటాక్ట్‌లలో సేవ్ చేయడానికి లేదా వ్యాపార వెబ్‌సైట్‌లలో వివరాలను సెర్చ్ చేయడానికి బదులుగా మెసేజింగ్ యాప్‌ని ఉపయోగించి వ్యాపార షాపులను సులభంగా సంప్రదించడానికి సహాయపడుతుందని చెప్తోంది. ప్రస్తుతం, వ్యాపారం కోసం శోధించే సామర్థ్యం బ్రెజిల్, కొలంబియా, ఇండోనేషియా, మెక్సికో మరియు UKకి అందుబాటులోకి వచ్చింది. ఈ దేశాల్లోని వినియోగదారులు ఇతర వ్యాపారాల వివరాలను  కనుగొనడానికి WhatsApp వ్యాపార ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవచ్చు.

JioMart లాగా

JioMart లాగా

అదనంగా, వినియోగదారులు వెబ్‌సైట్‌ను సందర్శించకుండా నేరుగా వాట్సాప్‌ను ఉపయోగించి ఇందులో షాపింగ్ కూడా చేయగలుగుతారు. తక్షణ సందేశ ప్లాట్‌ఫారమ్ వివిధ పేమెంట్ భాగస్వాములతో సహకరించి, వినియోగదారులను యాప్ నుండి నేరుగా ఉత్పత్తులను షాపింగ్ చేయడానికి అనుమతిస్తుంది. కొన్ని నెలల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టిన JioMart షాపింగ్ అనుభవం మాదిరిగానే ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇప్పుడు మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. WhatsApp ద్వారా అందించబడుతున్న కారణంగా, ఈ ఫీచర్ సురక్షితమైనది మరియు వినియోగదారుల ప్రైవసీ ని కాపాడుతుంది.

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి షాపింగ్ చేయవచ్చు
 

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి షాపింగ్ చేయవచ్చు

అదనంగా, వినియోగదారులు వారి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి చాట్ నుండి సురక్షితమైన చెల్లింపును కూడా చేయగలరు. "ఈ కష్టం లేని చెక్‌అవుట్ అనుభవం వెబ్‌సైట్‌కి వెళ్లకుండా నే , మరొక యాప్‌ను తెరవకుండా లేదా వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా WhatsAppలో నే మీకు కావలసిని వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అలాగే , మరియు వాటిని విక్రయించాలని చూస్తున్న వ్యక్తులు మరియు వ్యాపారాలకు కూడా ఈ ఫీచర్   గేమ్-ఛేంజర్‌గా ఉంటుంది" అని ప్రకటనలో పేర్కొంది.

వాట్సాప్ పోల్ ఫీచర్

వాట్సాప్ పోల్ ఫీచర్

అంతే కాక,ఇటీవల వాట్సాప్ పోల్ ఫీచర్ ను కూడా లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. WhatsApp పోల్స్ ఫీచర్ వినియోగదారులు గరిష్టంగా 12 ఆప్షన్ లతో పోల్‌ను రూపొందించడానికి మీకు అవకాశం ఉంది. అదే ఆన్సర్ ఆప్షన్‌ను మళ్లీ టైప్ చేస్తే, ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను హెచ్చరిస్తుంది. ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎంపికలకు కూడా ఓటు వేయవచ్చు. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ డెస్క్ టాప్ లోని WhatsApp వెబ్‌కు అందుబాటులో లేదు.

ఎలా వాడాలి

ఎలా వాడాలి

WhatsApp పోల్‌లు వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తున్నందున, ఇప్పుడు ఈ ఫీచర్ ను ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఎలా వాడాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

స్టెప్ 1: మీ ఫోన్‌లో WhatsApp తెరిచి, ఒక వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: ఆండ్రాయిడ్‌లో అటాచ్‌మెంట్ చిహ్నం లేదా ఐఫోన్‌లో + చిహ్నంపై నొక్కండి.
స్టెప్ 3: ఇప్పుడు, మీరు లొకేషన్, పేమెంట్ మొదలైన ఇతర ఆప్షన్‌లతో పాటు దిగువన ఉన్న పోల్ ఎంపికను కూడా మీరు చూడగలరు. ఇప్పుడు పోల్‌పై నొక్కండి.
స్టెప్ 4: మీరు 'ప్రశ్న అడగండి' విభాగంలో ప్రశ్నను టైప్ చేయమని అడిగే స్క్రీన్‌కి దారి మళ్లించబడతారు. అలాగే, మీరు గరిష్టంగా 12 సమాధానాలను ఆప్షన్లు గా జోడించవచ్చు. స్టెప్ 5: ప్రశ్న మరియు సమాధానాల ఎంపికలను జోడించిన తర్వాత, send పై నొక్కండి.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp New Feature Allows User To Search And Shop Products On App. Know More Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X