Home
Apps

Whatsapp థర్డ్‌ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా వాట్సాప్ నుంచే డాక్యుమెంట్‌లు స్కాన్‌ చేసుకోవచ్చు..!

మెటా నేతృత్వంలోని ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ను భారత్‌లో (Whatsapp India) సుమారు 50 కోట్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. కాలింగ్‌, మెసెజ్‌, డాక్యుమెంట్‌ షేరింగ్, ఫోటోలు, వీడియోలను షేర్‌ చేసుకొనేందుకు అనేక మంది వాట్సాప్‌ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ కూడా భారీ సంఖ్యలో ఉన్న తన యూజర్ల కోసం అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. యూజర్ల భద్రత, సౌకర్యం కోసం క్రమం తప్పకుండా కొత్త అప్‌డేట్‌ లను అందిస్తోంది.

అయితే తాజాగా సూపర్‌ ఫీచర్‌ ను వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వివిధ అవసరాల కోసం డ్యాక్యుమెంట్‌లను ఇతరులకు షేర్‌ చేస్తుంటాం. అయితే ఇప్పటి వరకు థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించి డాక్యుమెంట్లను స్కాన్‌ చేస్తున్నాం. వాటిని వాట్సాప్‌ ద్వారా (Whatsapp) ఇతరులకు పంపుతున్నాం.

whatsapp document scanner feature

తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ నుంచే నేరుగా డాక్యుమెంట్‌లను స్కాన్‌ (Whatsapp Document Scan Feature) చేయవచ్చు. మరియు షేర్ చేయవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్‌ ను టెస్టింగ్ చేసిన సంస్థ.. తాజాగా విడుదల చేసింది. అయితే ప్రస్తుతానికి కేవలం iOS యూజర్లకు మాత్రమే వాట్సాప్‌ డాక్యుమెంట్‌ స్కాన్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే సమాచారం వెల్లడి కాలేదు.

ఐఫోన్‌ యూజర్లు వాట్సాప్‌ డాక్యుమెంట్‌ స్కాన్‌ ఫీచర్‌ ను ఎలా ఉపయోగించాలి..?
* ఐఫోన్‌ లో వాట్సాప్‌ ను ఓపెన్‌ చేయాలి. అనంతరం అక్కడున్న ప్లస్‌ ఐకాన్ పైన క్లిక్‌ చేయాలి.
* ఆ తర్వాత మీకు డాక్యుమెంట్‌ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్‌ చేయాలి.

* అక్కడ మీకు ఫైల్స్‌, ఫోటో లేదా వీడియో షేరింగ్‌ ఆప్షన్‌లతోపాటు స్కాన్‌ డాక్యుమెంట్‌ ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది.
* ఆ ఆప్షన్‌ ద్వారా డాక్యుమెంట్‌లను స్కాన్ చేయవచ్చు. స్కాన్ పూర్తయిన తర్వాత PDF ఫార్మాట్‌ లో సేవ్ చేయాలి. ఆటోమేటిక్‌ గా డాక్యుమెంట్‌ బోర్డర్‌ను పొజిషన్‌ చేసుకుంటుంది.

అయితే నేరుగా మీరు షేర్‌ చేయాల్సిన వ్యక్తి లేదా గ్రూప్‌లోనే డాక్యుమెంట్‌లను స్కాన్‌ చేయవచ్చు. మరియు సమయం కూడా ఆదా అవుతుంది. సాధారణంగా ఫోటో కంటే స్కాన్‌ చేసిన డాక్యుమెంట్‌ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ కేవలం iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఇటీవలే వాట్సాప్‌కు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. వాట్సాప్‌ పేమెంట్స్‌పై ఉన్న ఆంక్షలను తొలగించినట్లు పేర్కొంది. ఫలితంగా వాట్సాప్‌ను వినియోగిస్తున్న 50 కోట్ల మందికి పేమెంట్స్ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.

UPI పేమెంట్స్‌లో ప్రస్తుతం 85 శాతానికి పైగా పేమెంట్లు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థలోకి వాట్సాప్ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వనుంది. వాట్సాప్‌ పేమెంట్స్‌ను వినియోగించుకొనేందుకు తొలుత 4 కోట్ల యూజర్లు, అనంతరం 10 కోట్ల మంది యూజర్లకే అవకాశం ఉండేది. ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది.

Image Credit : WABetaInfo

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp new feature now allows users to scan documents from app here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X