Whatsapp కీలక ఫీచర్.. కొత్త ఫోన్ నంబర్లతో వెబ్ యూజర్లు నేరుగా చాట్ చేయవచ్చు!
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్.. తన యూజర్ల భద్రత, సౌకర్యం కోసం గత కొన్ని నెలలుగా కీలక అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. ఇటీవల పాస్‌కీస్, లాక్ చేసిన చాట్‌లను హైడ్ చేసుకోవడం సహా చాలా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.
తాజాగా వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo కీలక విషయాన్ని వెల్లడించింది. వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్ కోసం కొత్త ఫీచర్‌ను తీసుకురానుందని వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా కొత్త ఫోన్ నంబర్లతో వాట్సాప్ వెబ్ వెర్షన్ (Whatsapp Web) ద్వారా చాట్ చేసుకొనేందుకు వీలుంటుందని తెలుస్తోంది.

ఫీచర్ ట్రాకర్ నివేదిక ఆధారంగా వాట్సాప్ కొత్త స్క్రీన్‌ను పరిచయం చేయనుందని తెలుస్తోంది. దీని ద్వారా ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి, అక్కడ నుంచే వారితో చాట్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉందని సమాచారం.
ఈ ఫీచర్ మీకు వాట్సాప్ ఖాతాకు అందుబాటులో ఉందో లేదో తెలుసుకొనేందుకు... వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, new chat పైన క్లిక్ చేయండి. అక్కడ ఫోన్ నంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కొత్త ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా వారితో నేరుగా చాట్ చేయవచ్చు. ఫలితంగా వారిని కాంటాక్ట్ లిస్ట్‌లో యాడ్ చేయకుండానే వారితో సంభాషించవచ్చు.
* లాక్ చేసిన చాట్‌ను మరింత గోప్యంగా ఉంచుకొనే విధంగా వాట్సాప్ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. ఈ Locked Chat ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు సీక్రెట్ కోడ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వాట్సాప్‌లో చాట్‌లాక్ (Whatsapp Chat lock) ఫీచర్ ద్వారా లాక్ చేసిన చాట్‌ను అందరూ యాక్సెస్ చేయలేరు. కానీ ఆ జాబితాలోని వివరాలు తెలియకపోయినా.. అక్కడ కొన్ని చాట్‌లను లాక్ చేసినట్లు మాత్రం ఇతరులకు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే త్వరలో రానున్న ఈ ఫీచర్‌తో లాక్ చేసిన చాట్ అసలు చాట్ లిస్ట్‌లో కనిపించదని తెలుస్తోంది. వినియోగదారుడు పూర్తిగా ఈ చాట్‌ను ఎవరికీ కనిపించకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది.
సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే చాట్ లాక్‌లో ఉన్న కాంట్రాక్ట్‌లు కనిపిస్తాయి. ఫలితంగా వాట్సాప్ యూజర్‌కు వ్యక్తిగత సమాచారానికి మరింత మెరుగైన భద్రత లభిస్తుందని వాట్సాప్ భావిస్తున్నట్లు సమాచారం. అంటే చాట్ లాక్‌ను యాక్సెస్ చేసేందుకు మరో సీక్రెట్ కోడ్ అవసరం కానుంది. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
* దీంతోపాటు పాస్‌కీస్ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఫలితంగా ఓటీపీ, SMS వంటి అవసరం లేకుండా ఫింగర్ ఫ్రింట్, ఫేస్, పిన్ సాయంతో వాట్సాప్‌ను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫలితంగా నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో వాట్సాప్ తెరిచేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరియు పాస్‌కీస్ ద్వారా మరింత మెరుగైన భద్రత లభిస్తుంది.


Click it and Unblock the Notifications








