Home
Apps

వాట్సాప్‌లో స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా... లాక్‌స్క్రీన్‌ పైనే బ్లాక్‌ చేయండి!

వాట్సాప్‌... ప్రపంచంలో అత్యధిక మంది వినియోగదారులు కలిగి ఉన్న యాప్‌లలో ఒకటిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్‌ యాక్టివ్‌ యూజర్లను కలిగి ఉంది. ఈ యాప్‌ వినియోగదారుల అవసరాలు, భద్రత కోసం అనేక కీలక ఫీచర్లను క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది. తాజాగా మెటా నేతృత్వంలోని వాట్సాప్ (Whatsapp) కీలక ఫీచర్‌ను లాంచ్ చేసింది.

ప్రస్తుతం వాట్సాప్‌ ఖాతాలను ఫోన్‌ నంబర్‌కు లింక్‌ చేయబడి ఉంటున్నాయి. ఫలితంగా ఫోన్ నంబర్‌ ద్వారా నేరుగా వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు పంపేందుకు వీలుంటుంది. మరియు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుంది. సైబర్ నేరగాళ్లు కూడా ఈ విధంగా మి‌మ్మల్ని నేరుగా సంప్రదించే వీలుంటుంది. ఈ పరిస్థితిపై వాట్సాప్‌ దృష్టిసారించింది. ఫలితంగా యూజర్ల భద్రత కోసం ఫీచర్‌ను లాంచ్‌ చేసింది.

Whatsapp new feature to allow user to block spam contacts from screen lock

ఈ ఫీచర్‌ ద్వారా తెలియని ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చినప్పుడు లాక్‌ స్క్రీన్‌పైనే వారి వివరాలను వెల్లడిస్తుంది. అలాంటి కాంటాక్ట్‌ల వద్ద నేరుగా బ్లాక్‌ బటన్‌ ఉంటుంది. లాక్‌స్క్రీన్‌ నుంచే నేరుగా అలాంటి కాంటాక్ట్‌లను బ్లాక్‌ చేయవచ్చు. మెసేజ్‌ ఒపెన్‌ చేయాల్సిన అవసరం కూడా లేదని వాట్సాప్‌ తెలిపింది.

వాట్సాప్‌ తాజా వివరాల ప్రకారం.. ఇటువంటి స్పామ్‌ మరియు తెలియని నంబర్ల నుంచి వచ్చిన మెసెజ్‌లను లాక్‌స్క్రీన్ నుంచే బ్లాక్‌ చేసే వీలుంటుంది. ఇందుకు మెటా నేతృత్వంలోని వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను (Whatsapp New Feature) విడుదల చేసింది. ఈ కాంటాక్ట్‌ల నుంచి మెసేజ్‌లు వచ్చినప్పుడు నోటిఫికేషన్ బార్‌ లేదా లాక్‌స్క్రీన్‌ నుంచే బ్లాక్‌ చేయవచ్చు.

Whatsapp new feature to allow user to block spam contacts from screen lock

అవసరం లేని మెసేజ్‌, స్పామ్ కాంటాక్ట్‌లను ఎలా బ్లాక్‌ చేయాలి..
స్టెప్‌ 1 : తొలుత వాట్సాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలి.
స్టెప్‌ 2 : లాక్‌స్క్రీన్‌పై బ్లాక్‌ చేసేందుకు నోటిఫికేషన్‌లను తనిఖీ చేసి అనుమతించండి.
స్టెప్‌ 3 : నోటిఫికేషన్‌ లాక్‌స్క్రీన్‌పైన చూపించిన వెంటనే రిప్లై బటన్‌ పక్కన ఉన్న బ్లాక్ బటన్‌ పైన క్లిక్‌ చేయండి.
స్టెప్‌ 4 : కాంటాక్ట్‌ను బ్లాక్‌ చేసిన తర్వాత, యూజర్లు ఆ కాంటాక్ట్‌ పైన రిపోర్టు చేయవచ్చు.

వాట్సాప్‌ చాట్‌లో బ్లాక్ చేయడం ఎలా?
స్టెప్‌ 1 : తొలుత వాట్సాప్‌ను తెరవండి.
స్టెప్‌ 2 : బ్లాక్‌ చేయాలని నిర్ణయించుకున్న వినియోగదారుడి చాట్‌ లేదా గ్రూప్‌ చాట్‌పైన క్లిక్‌ చేయండి.
స్టెప్‌ 3 : కుడివైపున పైనున్న మూడు చుక్కలపై క్లిక్‌ చేయండి.

స్టెప్‌ 4 : అనంతరం స్క్రీన్‌పైన డ్రాప్‌ డౌన్‌ మెను డిస్‌ప్లే అవుతుంది. మోర్‌ అనే ఆప్షన్‌పైన క్లిక్‌ చేయండి.
స్టెప్‌ 5 : అక్కడ కనిపించిన బ్లాక్ బటన్‌పైన క్లిక్‌ చేయండి.
స్టెప్‌ 6 : వాట్సాప్‌ మరో ఆఫ్షన్ అక్కడ డిస్‌ప్లే చేస్తుంది. బ్లాక్‌ చేయడాన్ని నిర్ధారించాలని కోరుతుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Whatsapp rolls out new feature to block spam or unknown contacts from screen lock
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X