వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వాయిస్ నోట్ ఎక్కువగా వినియోగిస్తున్నవారికి పనికొస్తుంది..!
మెటా నేతృత్వంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇటీవల స్టేటస్ అప్‌డేట్‌లో అనేక మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇటీవల స్టేటస్‌లో నిమిషం పాటు వీడియో పోస్టు చేసే విధంగా కొత్త అప్‌డేట్ పైన పనిచేస్తున్నట్లు తెలిపింది. అయితే తాజాగా వాయిస్ నోట్స్ పైన (Whatsapp Voice Notes) పనిచేస్తుందని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ వెల్లడించింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా వాట్సాప్ స్టేటస్‌లో ఎక్కువ నిడివి ఉన్న (Longer Voice Notes) వాయిస్ నోట్‌ను పోస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆండ్రాయిడ్, iOS యూజర్లు గరిష్ఠంగా 1 నిమిషం పాటు వాయిస్ నోట్‌ను స్టేటస్ అప్‌డేట్‌గా పోస్టు చేయవచ్చని తెలుస్తోంది.

అయితే ఇందుకు వాట్సాప్ యూజర్లు అప్‌డేట్ చేయబడిన వెర్షన్‌ను కలిగి ఉండాలి. ప్రస్తుతం ఈ అప్‌డేట్ కొంత మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్ కోసం ఆండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్ ద్వారా యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. iOS యూజర్లు యాప్ స్టోర్ ద్వారా కొత్త వెర్షన్‌కు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దీంతోపాటు ఇటీవలే వాట్సాప్ iOS యూజర్లు ఎక్కువ నిడివి (Longer Videos) ఉన్న వీడియోలను స్టేటస్‌లుగా పోస్టు చేయవచ్చు. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఆధారంగా ఈ టెస్టంగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ iOS 24.10.10.74 బీటా వెర్షన్‌లో ఉంది. దీని ద్వారా గరిష్ఠంగా ఒక నిమిషం పాటు వాట్సాప్ స్టేటస్‌ను అప్‌లోడ్ చేయవచ్చు.
ప్రస్తుతం iOS బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఆండ్రాయిడ్, iOS యూజర్లు ఎప్పటి నుంచి నిమిషం పాటు వీడియో స్టేటస్‌లు పెట్టేందుకు అవకాశం ఉంటుందో వెల్లడి కాలేదు. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్‌లోనూ టెస్టింగ్ చేశారు.
*వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా ప్రొఫైల్ ఫోటోలను రూపొందించవచ్చు. ఇందుకు సంబంధించిన ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సా్‌ప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ప్రకారం ఆండ్రాయిడ్ బీటా 2.24.11.17 వెర్షన్‌లో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ వెల్లడించలేదు. ఇటీవలే లింక్ చేసిన పరికరాల్లో Locked Chat ఫీచర్‌ను వినియోగించుకొనేందుకు అవకాశం కల్పించింది. ఇటీవల కేవలం ప్రైమరీ పరికరాల్లోనే ఈ అవకాశం ఉండేది. అంటే వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైస్‌లతో వినియోగించుకొనేందుకు వీలుంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








