వాట్సాప్‌లో కొత్త ఫీచర్... చాట్ లిస్ట్‌లోనే UPI QR స్కానర్.. ఎలా ఉపయోగపడుతుంది అంటే..?
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (Whatsapp) తన వినియోగదారుల సౌకర్యం కోసం అనేక ఫీచర్లను లాంచ్ చేస్తోంది. తాజాగా చాట్ లిస్ట్ నుంచే యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు (Android Beta Testers) అందుబాటులో ఉందని తెలుస్తోంది త్వరలో అందరికీ అందుబాటులో రానుంది. వినియోదారులకు మెరుగైన సౌకర్యలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది.

వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ Wabetainfo నివేదిక అనుగుణంగా వాట్సాప్ చాట్ లిస్ట్‌లో నేరుగా UPI QR కోడ్ స్కానర్ (Whatsapp UPI QR Scanner) అందుబాటులో ఉంటుంది. ఫలితంగా యూజర్లు సులభంగా పేమెంట్లు చేయగలుగుతారు. ఈ ఫీచర్ కారణంగా సమయం సహా యూజర్లకు మెరుగైన అనుభూతి కలగనుంది. ముఖ్యంగా భారత్‌లో యూజర్లకు ఈ ఫీచర్ అనుకూలంగా ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉండగా.. త్వరలో వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ UPI ను అధికంగా వినియోగించే భారత్‌లో ఉపయోగపడనుంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ల ద్వారా యూపీఐ లావాదేవీల వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
** వాట్సాప్ ప్రొఫైల్‌లను స్క్రీన్‌షాట్ తీసే అవకాశం ఉండదు. వాట్సాప్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను వినియోగిస్తున్న వారికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఎవరైనా వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్‌షాట్ తీసేందుకు ప్రయత్నం చేస్తే.. వ్యక్తిగత సమాచారం కారణంగా స్క్రీన్‌షాట్ తీసేందుకు అనుమతి లేదనే పాప్‌అప్ వస్తోంది.
అనేక మంది వాట్సాప్ వినియోగదారులు ముఖ్యంగా మహిళలు తమ ఫొటోలను వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకొనేందుకు ఆసక్తి ఉన్నా.. వివిధ భద్రతా కారణాల రీత్యా వెనక్కి తగ్గుతున్నారు. ఆయా ఫోటోలను స్క్రీన్‌షాట్ తీసి చెడు మార్గాల్లో వినియోగిస్తారనే ఆందోళనతో వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలుగా (DP) తమ ఫొటోలను వినియోగించడం లేదు. తాజాగా విడుదలైన ఫీచర్‌తో ఆ ఆందోళనలకు చెక్ పెట్టినట్లు అయింది.
** వాట్సాప్ సంస్థ ప్రకారం ప్రతి చాట్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. చాటింగ్ సమయంలో ఇందుకు సంబంధించి ఎటువంటి సింబల్ లేదా లేబుల్ కనిపించదు. అయితే త్వరలో ఇందుకు సంబంధించి లేబుల్ చాట్ స్క్రీన్‌పైన కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది.
యూజర్ల చాట్, వీడియోలు సహా ఇతర కంటెంట్‌కు అధిక ప్రాధాన్యతతో కూడిన భద్రతను కల్పిస్తున్నట్లు చెబుతున్న వాట్సాప్ సంస్థ తన భద్రత గురించి వినియోగదారులకు తెలియజేసేందుకు ఈ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర యాప్‌ల ద్వారా వాట్సాప్‌లో చాట్ చేసేవారి డేటా కూడా ఎంతో భద్రంగా ఉంటుందని వాట్సాప్ చెబుతోంది.
** వాట్సాప్‌లో ఇటీవల కీలక ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా తేదీల వారీగా చాట్‌ను సెర్చ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటికే iOS, Mac డెస్క్‌టాప్, వాట్సాప్ వెబ్ ద్వారా అందుబాటులో ఉండగా ఇటీవలే ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








