వాట్సప్‌లోకి మరో రెండు ఆసక్తికర ఫీచర్లు
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్లకు మరో రెండు కొత్త ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తేనుంది.
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్లకు మరో రెండు కొత్త ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తేనుంది. కాన్‌సెక్యుటీవ్ వాయిస్ మెసేజ్, గ్రూప్ కాల్ కోసం షార్ట్‌కట్ ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి. కాన్‌సెక్యూటివ్ వాయిస్ మెసేజెస్ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ వాట్సప్‌కు వచ్చే వాయిస్ మెసేజ్‌లను ఒకదాని వెంట ఒకటి వరుసగా ప్లే చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ కాల్స్‌ను మరింత సౌకర్యవంతంగా చేసుకునేందుకు వాట్సప్‌లో గ్రూప్ కాల్ షార్ట్‌కట్ బటన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్‌లలో....
ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్‌లలో వాట్సాప్ యూజర్లకు ఇప్పటికే లభిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లందరికీ ఈ ఫీచర్లు లభ్యం కానున్నాయి.

వాట్సప్ బీటా వర్షన్లు...
ముందే కావాలనుకుంటే వాట్సప్ బీటా వర్షన్లు 2.18.362 లేదా 2.18.363 వాడుతున్న వారు ఈ ఫీచర్స్ ఉపయోగించుకోవచ్చు. బీటా టెస్టర్ల రివ్యూ తర్వాత త్వరలో మిగతా యూజర్లకూ ఈ అప్‌డేట్స్ అందుతాయి. ఆ తర్వాత ఈ రెండు ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.

వరుసగా వాయిస్ మెసేజ్
ఈ ఫీచర్ వాట్సప్ బీటా వర్షన్ 2.18.362లో ఉంది. దీని ద్వారా యూజర్లు వాయిస్ మెసేజ్‌లు ఒకదాని తర్వాత ఒకటి ఆటోమెటిక్‌గా ప్లే అవుతాయి. రెండు కన్నా ఎక్కువ వాయిస్ మెసేజ్‌లు వరుసగా ఉంటే మొదటి ఆడియోను ప్లే చేస్తే చాలు మిగతావి ఆటోమెటిక్‌గా ప్లే అవుతాయి. ఇప్పుడు ఒక్కో ఆడియో ఫైల్‌ను మ్యాన్యువల్‌గా ప్లే చేయాల్సి వస్తుంది.

గ్రూప్ కాల్ షార్ట్‌కట్
దీంతో పాటుగా గ్రూప్ కాలింగ్ ఫీచర్‌లోవాట్సప్ చిన్న మార్పు చేయబోతోంది. గ్రూప్ ఛాట్‌లో కనిపించే కాలింగ్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే ఆ గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ అందరికీ కాల్ వెళ్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి అందరికీ కాల్ కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంది.


Click it and Unblock the Notifications








