Home
Apps

వాట్సాప్‌లో జనవరిలో ఈ అదిరిపోయే ఫీచర్లు వచ్చేశాయ్.. ఇంకా రాబోయేవి చూస్తే ఫిదా అవుతారు!

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ (WhatsApp) ఈ సంవత్సరం అదిరిపోయే కొత్త ఫీచర్లతో మీ ముందుకు వచ్చేసింది. 2025, జనవరిలో రిలీజ్ అయిన ఈ ఫీచర్లు మీ వాట్సాప్ ఎక్స్‌పీరియన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. ఇంకా మీకు ఈ అప్‌డేట్స్ రాకపోతే వెంటనే మీ యాప్‌ని లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. ఈ కొత్త ఫీచర్లేంటో చూద్దాం. అంతేకాదు, త్వరలోనే రానున్న మరికొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

* వాట్సాప్‌లో AI స్టూడియో (ఆండ్రాయిడ్ & ఐఫోన్) : వాట్సాప్‌లో మీకు ఒక AI స్టూడియో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ రకరకాల AI క్యారెక్టర్లతో సరదాగా చాట్ చేయొచ్చు. మెటా AI చాట్ విండోలో ఈ ఫీచర్‌ని మీరు చూడొచ్చు. వివిధ సంస్కృతులు, యానిమే క్యారెక్టర్లు, పాప్ కల్చర్ సెలబ్రిటీలు.. ఇలా చాలా మంది AI క్యారెక్టర్లు ఇక్కడ మీతో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు.

WhatsApp New Features Released in January 2025

అంతేకాదు, ఒక కుక్క కూడా మీతో తన మనసులోని మాటల్ని పంచుకుంటుంది. AI క్యారెక్టర్ల సెర్చ్ ఆప్షన్ లో డాగ్ అని నొక్కి ఒక ఏఐ కుక్కతో కన్వర్జేషన్ ప్రారంభించవచ్చు. అది అచ్చం కుక్కలాగానే మాట్లాడటం విశేషం. దీంతో చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడే మీరు దీన్ని ట్రై చేయవచ్చు.

* డబుల్ ట్యాప్ టు రియాక్ట్ (ఆండ్రాయిడ్ & ఐఫోన్) : మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వడం ఇప్పుడు మరింత ఈజీ. వాట్సాప్‌లో మెసేజ్‌ని డబుల్ ట్యాప్ చేస్తే చాలు, వెంటనే ఎమోజీతో రియాక్ట్ అవ్వొచ్చు. టెక్స్ట్ మెసేజ్‌లు, మీడియా, వాయిస్ మెసేజ్‌లు.. ఇలా అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఇంతకుముందు రియాక్ట్ అవ్వాలంటే మెసేజ్‌ని ప్రెస్ చేసి హోల్డ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డబుల్ ట్యాప్‌తో పని అయిపోతుంది.

* ఫొటో స్టిక్కర్లు & స్టిక్కర్ ప్యాక్ లింక్స్ (ఆండ్రాయిడ్ & ఐఫోన్) : మీ ఫొటోలతో మీరే స్టిక్కర్లు చేసుకోవచ్చు. మీ ఫొటోలోని సబ్జెక్ట్‌ని వాట్సాప్ ఆటోమేటిక్‌గా కట్ చేస్తుంది. దాన్ని మీరు స్టిక్కర్‌లా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా స్టిక్కర్ ప్యాక్ లింక్స్‌ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ కూడా చేయొచ్చు. అందుకు స్టిక్కర్ సెక్షన్‌కి వెళ్లి స్టిక్కర్ ప్యాక్ పక్కనున్న మూడు చుక్కల్ని ట్యాప్ చేయాలి. "సెండ్" ఆప్షన్‌ని ఎంచుకోవాలి.

* బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఫర్ ఫొటోస్ (ఆండ్రాయిడ్ & ఐఫోన్) : ఇకపై మీరు ఫొటోలు పంపేముందు వాటికి రకరకాల ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా మార్చేయొచ్చు. ఈ ఫీచర్ ఎలా యూజ్ చేయాలంటే, చాట్‌లో కెమెరా ఐకాన్‌ని ట్యాప్ చేయాలి. ఫొటో తీయాలి. ఎఫెక్ట్స్, ఫిల్టర్లు లేదా బ్యాక్‌గ్రౌండ్ మార్పులు అప్లై చేయండి, అంతే.

* బిల్ట్-ఇన్ డయల్ ప్యాడ్ (ఐఫోన్ యూజర్లకి మాత్రమే) : ఐఫోన్ యూజర్లు ఇకపై నంబర్ సేవ్ చేయకుండానే డైరెక్ట్‌గా వాట్సాప్‌లోనే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలంటే కాల్స్ ట్యాబ్‌కి వెళ్లాలి. కుడివైపు పైనున్న '+' ఐకాన్‌ని ట్యాప్ చేయాలి. "కాల్ ఎ నంబర్" ఆప్షన్‌ని సెలెక్ట్ చేయాలి. నంబర్ ఎంటర్ చేసి కాల్ చేయాలి.

* మెసేజ్ ఫార్వార్డ్ చేసేముందు మెసేజ్ యాడ్ (ఆండ్రాయిడ్ మాత్రమే) : టెక్స్ట్, మీడియా లేదా లింక్స్ ఫార్వార్డ్ చేసేటప్పుడు మీ సొంత మెసేజ్‌ని కూడా యాడ్ చేసుకునే ఆప్షన్ వచ్చేసింది. ఫార్వార్డ్ చేస్తున్న కంటెంట్‌కి మీ కాంటెక్స్ట్ ఇవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల ఆ మెసేజ్ ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నామో ఈజీగా తెలపవచ్చు. టైమ్, శ్రమ సేవ్ అవుతుంది.

* త్వరలో రాబోయే వాట్సాప్ ఫీచర్లు (బీటా టెస్టింగ్)

- AI స్టూడియో ట్యాబ్ (ఆండ్రాయిడ్ మాత్రమే) : త్వరలో కమ్యూనిటీస్ ట్యాబ్ ప్లేస్‌లో కొత్త AI స్టూడియో ట్యాబ్ రావచ్చు. ఇక్కడ మీరు అన్ని AI క్యారెక్టర్లని చూడొచ్చు మెటా AIతో చాట్ చేయొచ్చు. సొంత AIని క్రియేట్ చేసి పబ్లిష్ కూడా చేయొచ్చు. హోమ్ స్క్రీన్ నుంచి ఫాస్ట్ యాక్సెస్ కోసం వాట్సాప్ AI విడ్జెట్‌ని కూడా టెస్ట్ చేస్తోంది.

- కలర్‌ఫుల్ ఐకాన్స్ ఫర్ చాట్స్ & గ్రూప్స్ (ఆండ్రాయిడ్ & ఐఫోన్) : ప్రస్తుతం ఎవరికీ ప్రొఫైల్ పిక్చర్ లేకపోతే వాట్సాప్ గ్రే కలర్ ఐకాన్‌ని చూపిస్తుంది. త్వరలో వాట్సాప్ వీటిని కలర్‌ఫుల్ ఐకాన్స్‌తో రీప్లేస్ చేయొచ్చు. ఆ ప్రొఫైల్‌ లేదా గ్రూప్ పేరులోని మొదటి అక్షరాలతో కలర్‌ఫుల్ ఐకాన్స్ కనిపిస్తాయి. ఎవరైనా ప్రొఫైల్ ఫోటో అప్‌లోడ్ చేస్తే ఈ కలర్స్ మాయం అయిపోతాయి.

- స్టేటస్ అప్‌డేట్స్‌లో మ్యూజిక్ షేర్ (ఆండ్రాయిడ్ & ఐఫోన్) : వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్‌లో మ్యూజిక్ షేర్ చేసే ఫీచర్‌ని కూడా టెస్ట్ చేస్తోంది. యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీ నుంచి సాంగ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు, సిమిలర్ సాంగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఆర్టిస్ట్ పేజీకి వెళ్లే ఆప్షన్ కూడా మీకు రావచ్చు. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. వారు కూడా ఈ కొత్త ఫీచర్లు ట్రై చేస్తారు.

More from GizBot

Best Mobiles in India

English summary
WhatsApp New Features Released in January 2025 & Upcoming Updates, Check Them Out
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X