వాట్సాప్ గ్రూప్‌లు ఎక్కువగా వినియోగిస్తున్న వారి కోసం కీలక ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. పూర్తి వివరాలు..!
వాట్సాప్ తన వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా వాట్సాప్ యూజర్ల భద్రత కోసం ముఖ్యమైన ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తి మిమ్మల్ని ఇతర వాట్సాప్ గ్రూపులో యాడ్ చేసినప్పుడు ఈ ఫీచర్ కీలకంగా పనిచేస్తుంది. మిమ్మల్ని వాట్సాప్ (Whatsapp) గ్రూప్‌లో జాయిన్ చేసిన వ్యక్తి పేరును సూచించే Context Card ను ప్రదర్శిస్తుంది. ఆ గ్రూప్ ఎప్పుడు క్రియేట్ చేశారు మరియు ఎవరు క్రియేట్ చేశారు వంటి వివరాలు అందులో ఉండనున్నాయి.
ఈ వివరాల ఆధారంగా ఆ వాట్సాప్ గ్రూప్‌లో మీరు ఉండదలచుకున్నారా.. లేదా అని నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వివరాలను వాట్సాప్ వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు మరింత భద్రతను పొందే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ తరహా ఫీచర్ వాట్సాప్‌లో అందుబాటులో ఉంది.

మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని యూజర్లు మీకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసిన సమయంలో.. 'మీకు మెసేజ్ చేసిన వ్యక్తి మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేరు' అనే అర్థం వచ్చేలా ఓ సూచన కనిపిస్తుంది. అదే తరహాలో ఈ కొత్త ఫీచర్ కూడా పనిచేస్తుంది. అయితే మరికొంత అదనపు భద్రత, సమాచారాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ ఫీచర్ ప్రస్తుతం కొంత మందికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మెటా చెబుతోంది. స్పామ్ లేదా మోసపూరిత వ్యక్తుల నుంచి వాట్సాప్ వినియోగదారులకు భద్రత కల్పించేందుకే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ సమాచారం ఆధారంగా అవసరం లేని వాట్సాప్ గ్రూప్‌లకు యూజర్లు దూరంగా ఉండే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది.
వాట్సాప్ గ్రూప్‌లో ఎవరు చేర్చేందుకు అర్హులో తెలిపేలా.. మూడు సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్‌లో Everyone, My Contacts, My contacts except వంటి ఆప్షన్‌ల ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు. My Contacts అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న యూజర్లు మాత్రమే.. వాట్సాప్ గ్రూప్‌లోకి మిమ్మల్ని చేర్చేందుకు అవకాశం ఉంది.
వాట్సాప్ యూజర్ల కోసం ఇటీవల 'వీడియో నోట్ ఫీచర్' అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న వాయిస్ నోట్స్‌తోపాటు వీడియో నోట్స్‌ను కూడా పంపుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.14.14 లో ఈ ఫీచర్ ఉంది. ఈ వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








