Just In
- 30 min ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 24 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్‌డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- News
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వర్సెస్ కశ్మీర్ ఫైల్స్ ప్రదర్శన
- Movies
Waltair Veerayya 2 Weeks Collections: చిరంజీవి మరో సెంచరీ.. 14వ రోజు అన్ని కోట్లు.. లాభం చూస్తే షాకే
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు అవకాశం లేదు.. తేల్చి చెప్పిన మాజీ దిగ్గజం!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
వాట్సాప్ కొత్తగా పరీక్షిస్తున్న చాట్‌బాట్ గురించి మీరు తెలుసుకోవలసిన మరిన్ని వివరాలు
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రస్తుత రోజులలో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వాట్సాప్ గురించి చిన్న పిల్లలను అడిగిన చేబుతారు అలాగే దీని గురించి తెలియని వారు ఉండరు. వాట్సాప్ మరింత ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకోవడానికి తన యాప్‌కి తరచుగా కొత్త కొత్త ఫీచర్లను జోడిస్తుంది. కొన్నిసార్లు వాటిని ట్రాక్ చేయడం కొంచెం ఎక్కువ అవుతుంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరిస్తోంది. వాట్సాప్ ఇప్పుడు కొత్తగా చాట్‌బాట్‌ను పరీక్షిస్తున్నట్లు కొన్ని నివేదికలు నివేదించాయి. ఇది యాప్‌లో కొత్తగా ఏదైనా ఫీచర్ జోడించబడిన ప్రతిసారీ మీకు తెలియజేస్తుంది. దీని గురించి మరిన్ని ఆశక్తికరమైన వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ వాచ్‌డాగ్ WABetaInfo ప్రకారం వాట్సాప్ యాప్‌లో అధికారికంగా అందుబాటులోకి తీసుకొనివచ్చే చాట్‌బాట్ యొక్క అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. పబ్లికేషన్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం వాట్సాప్ యాప్‌లో కొత్త వెరిఫైడ్ చాట్‌బాట్ ఉంటుందని చూపిస్తుంది. ఈ చాట్‌బాట్ వారి సంభాషణ జాబితాలో ఉన్న వ్యక్తులలో మొదటి స్థానంలో ఉంటుంది. " ఈ చాట్‌బాట్ కొత్త కొత్త ఫీచర్‌ల గురించి తెలియజేయడం, చిట్కాలు మరియు ట్రిక్‌లను తెలపడం మరియు ప్రైవసీ మరియు భద్రతకు సంబందించిన అన్ని రకాల వివరాలను అందిస్తుంది."

వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లో బిజినెస్ అకౌంటులను మాత్రమే ధృవీకరిస్తుంది. కానీ వాటిలా కాకుండా మీరు ఈ చాట్‌బాట్‌కు ప్రత్యుత్తరం ఇవ్వలేరు. ఇది చదవడానికి-మాత్రమే అకౌంట్ ఓపెన్ లో ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ వన్-వే కమ్యూనికేషన్ ఉంటుంది. వాట్సాప్ యొక్క తాజా ఫీచర్లు మరియు ఇతర వివరాల గురించి వినియోగదారులకు తెలియజేయడం మరియు ఫీడ్‌బ్యాక్ లేదా ఫిర్యాదులను కోరకపోవడం చాట్‌బాట్ యొక్క ఉద్దేశ్యం. మీరు వాట్సాప్ ని సంప్రదించాలనుకుంటే కనుక కంపెనీ 2019లో ప్రారంభించిన టిప్‌లైన్‌తో సహా ఇతర మార్గాలు ఉన్నాయి.

స్క్రీన్‌షాట్ ప్రకారం చాట్‌లో పంపిన అన్ని మెసేజ్ లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. అయితే ప్రత్యుత్తరాలకు మద్దతు ఇవ్వనప్పటికీ మెసేజ్లు ఒకేసారి చాలా మంది వినియోగదారులకు ప్రసారం చేయబడడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఒకవేళ మీకు వాట్సాప్ చాట్‌బాట్ నుండి మెసేజ్ లను స్వీకరించకూడదు అని మీరు భావిస్తే కనుక అకౌంటును బ్లాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికీ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉంది. కాబట్టి బీటా ప్రోగ్రామ్‌లో ఉన్నటువంటి మరియు ఎంపిక చేసిన వినియోగదారులకు ఇది కనిపించవచ్చు. వాట్సాప్ దీన్ని స్థిరమైన ఛానెల్‌కు ఎప్పుడు విడుదల చేస్తుందనే దాని గురించి సరైన సమాధానం లేదు.

వాట్సాప్ కొత్తగా అందుబాటులోకి తీసుకొనివచ్చిన చాట్‌బాట్ అనేది దీని యొక్క ప్రత్యర్థి మెసేజింగ్ యాప్‌లు టెలిగ్రామ్ మరియు సిగ్నల్‌ల మాదిరిగానే ఉంటుంది. కొత్త మార్పులు మరియు ఫీచర్‌లను వినియోగదారులకు తెలియజేయడానికి టెలిగ్రామ్ మరియు సిగ్నల్ రెండూ కూడా తమ తమ ప్లాట్‌ఫారమ్‌లలో అధికారిక ఛానెల్‌ని ఉపయోగిస్తాయి.

వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ కోడ్ ఫీచర్
WABetaInfo యొక్క నివేదిక ప్రకారం మీరు మీ యొక్క పాత స్మార్ట్‌ఫోన్ నుండి కొత్త ఫోన్ లో మీ వాట్సాప్ అకౌంటుతో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "డబుల్ వెరిఫికేషన్ కోడ్" ఫీచర్ ధృవీకరణ కోడ్ యొక్క మరొక దశను చూపుతుంది. ఈ నివేదిక ప్రకారం వాట్సాప్ అకౌంటులోకి లాగిన్ చేయడానికి మొదటి ప్రయత్నం విజయవంతమయినప్పటికీ కూడా మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరో ఆరు అంకెల కోడ్ అవసరం. ఎవరైనా వాట్సాప్ లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఫోన్ నంబర్ కి మరొక అదనపు మెసేజ్ పంపబడుతుంది. "ఇప్పటికే మరో ఫోన్‌లో వాట్సాప్ కోసం మీ యొక్క ఈ +********** నంబర్ ఉపయోగించబడుతోంది. మీ అకౌంట్ మీ నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవడంలో సహాయం చేయడానికి మీరు తప్పనిసరిగా మరొక ధృవీకరణ కోడ్‌ను నిర్ధారించాలి. అదనపు భద్రత కోసం మీరు కోడ్‌ను పంపడానికి ముందు టైమర్ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. మీరు కోడ్‌ని స్వీకరించిన తరువాత దానిని ఇక్కడ నమోదు చేయండి." అనే మెసేజ్ తో కూడిన స్క్రీన్‌షాట్ ని WABetaInfo తన యొక్క లీక్ లో పోస్ట్ చేసింది.

వాట్సాప్ గ్రూప్ చాట్‌లో 512 మంది సభ్యుల చేరికకు అనుమతి
మెటా యాజమాన్యంలోని సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్ లోని వినియోగదారులను గ్రూప్ చాట్‌లో గరిష్టంగా 512 మంది సభ్యులను జోడించేలా కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. వాట్సాప్ యొక్క తాజా అప్‌డేట్ తో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని WABInfo ఇటీవలి నివేదిక సూచించింది. ఈ ఫీచర్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయితే కొంతమంది వినియోగదారులు తమ వాట్సాప్‌లో ఫీచర్‌ను చూడడానికి 24 గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను మే ప్రారంభంలో మెటా ప్రకటించింది. వాట్సాప్ యొక్క తాజా అప్‌డేట్ లో ఇంతకుముందు ఫైల్‌ల షేరింగ్ లో 100MB పరిమితి నుండి 2GB వరకు పరిమితిని కూడా వాట్సాప్ పెంచుతోంది. వ్యక్తుల నుండి మరియు గ్రూప్ చాట్‌లలో వారు స్వీకరించే నిర్దిష్ట మెసేజ్ల గురించి ప్రజలు తమ భావాలను మరియు భావోద్వేగాలను టెక్స్ట్‌లో ప్రతిస్పందనలను పంపాల్సిన అవసరం లేకుండా త్వరగా వ్యక్తీకరించడంలో సహాయపడటానికి Meta-యాజమాన్య యాప్ ఇటీవల ఎమోజి రియాక్షన్ లను కూడా పరిచయం చేసింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470