Home
Apps

WhatsApp కొత్త అప్‌డేట్!! గ్రూప్ వాయిస్ కాల్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనడానికి మద్దతు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధిక మంది వినియోగదారులు మెసేజ్లను త్వరగా పంపడానికి మరియు అవి వారికి చేరినట్లు నిర్దారించుకోవడానికి ఉపయోగించే సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ ఎల్లప్పుడూ కూడా ముందువరుసలో ఉంది. ఈ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తూ వారిని ఆకట్టుకుంటున్నది. అందులో భాగంగానే గత వారం వాట్సాప్ అనేక రకాల కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఆ జాబితాలోని ప్రధాన ఫీచర్లలో ఒకటి వాయిస్ కాలింగ్ ఫీచర్ యొక్క విస్తరణ. వాట్సాప్ ఇప్పుడు వాయిస్ కాల్‌లో పాల్గొనే వారి సంఖ్యను 32 మందికి పెంచింది. ఇంతకు ముందు కేవలం 8 మందిని పాల్గొనడానికి అనుమతిని ఇచ్చేది కావున ఇది గణనీయమైన జంప్. కరోనా మహమ్మారి సమయంలో వాట్సాప్ గ్రూప్ వాయిస్ మరియు వీడియో కాలింగ్ పరిమితిని 8కి పెంచింది. కొత్త అప్ డేట్ లో భాగంగా 32 మంది మద్దతు వాయిస్ కాల్‌లలో మాత్రమే అని గమనించాలి.

WhatsApp New Update Now Allows Up to 32 Participants in a Group Voice Calls

వాట్సాప్ యొక్క కొత్త అప్ డేట్ రోల్ అవుట్ ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ iOS యూజర్లకు అందరికి కూడా అందుబాటులో ఉంది. వాట్సాప్ కొత్త పరిమితితో యాప్ FAQలను అప్‌డేట్ చేసింది. FAQ కొత్త విభాగంను క్లెయిమ్ చేసిన తరువాత గ్రూప్ కాలింగ్ లో గరిష్టంగా 32 మంది పాల్గొనడానికి మరియు ఒకరితో ఒకరు ఉచితంగా వాయిస్ కాల్ చేయడానికి అనుమతిస్తుంది. ఆపిల్ వినియోగదారులు కొత్త కాల్ పరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. యాప్ స్టోర్‌లోని లిస్టింగ్ కొత్త అప్‌డేట్ 32 మంది పార్టిసిపెంట్‌లకు మద్దతునిస్తుందని చూపిస్తుంది.

ఇది ఎలా పని చేస్తుంది?

WhatsApp New Update Now Allows Up to 32 Participants in a Group Voice Calls

మీరు ఉపయోగిస్తున్న వాట్సాప్ లో గ్రూప్ వాయిస్ కాల్‌ని స్వీకరించినప్పుడు వాట్సాప్ గ్రూప్ ఇన్‌కమింగ్ వాయిస్ కాల్ స్క్రీన్ ప్రస్తుతం కాల్‌లో ఉన్న పార్టిసిపెంట్‌లను చూపుతుంది. అంతేకాకుండా కాల్ చేసిన లేదా మిమ్మల్ని జోడించిన పార్టిసిపెంట్‌ను కూడా చూపుతుంది. ఇది వాయిస్ కాల్ హిస్టరీ 'కాల్స్' ట్యాబ్‌లో కనిపిస్తుంది. మీరు కాల్ లో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా పాల్గొనేవారిని వీక్షించడానికి కాల్ హిస్టరీను నొక్కవచ్చు. మిస్డ్ కాల్‌ల ద్వారా ఇంకా కాల్ కొనసాగుతున్నట్లయితే మీరు వాటిలో కూడా చేరవచ్చు.

వాట్సాప్ కొత్త అప్‌డేట్ లోని మరిన్ని ఫీచర్లు

రియాక్షన్‌

WhatsApp New Update Now Allows Up to 32 Participants in a Group Voice Calls

వాట్సాప్ కొత్త అప్‌డేట్ లో అందుకున్న ఈ ఫీచర్ పేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ రెండింటి నుండి ప్రేరణ పొందుతుంది. గతంలో చాలా మంది వినియోగదారులు టెక్స్ట్‌లు మరియు మీడియాలకు ఒక్కో రియాక్షన్‌ని పంపడం ద్వారా ప్రతిస్పందించేవారు. అయితే వినియోగదారులు ఇప్పుడు ఎమోజీలను ఉపయోగించి అదే మెసేజ్ లకు ప్రతిస్పందించగలరు. ప్రతిస్పందించడానికి కొత్త మెసేజ్లను పంపకుండానే టన్నుల కొద్ది ఎమోజీలతో వ్యక్తులు తమ అభిప్రాయాన్ని త్వరగా పంచుకోగలరు.

ఫైల్ షేరింగ్

2GB వరకు గల పెద్ద ఫైల్‌లను సపోర్ట్ చేస్తూ వాట్సాప్ ద్వారా మరొకరికి ఫైల్ ని షేరింగ్ చేయడానికి పరిమితిని పెంచుతోంది. ప్రజలు సులభంగా ప్రాజెక్ట్‌లో సహకరించేందుకు వీలుగా తాము ఇలా చేస్తున్నామని వాట్సాప్ పేర్కొంది. ఫైళ్ల ఫార్మాట్ గురించిన వివరాలు అధికారిక రోల్-అవుట్‌కు ముందే వెల్లడి చేయబడతాయి.

Best Mobiles in India

English summary
WhatsApp New Update Now Allows Up to 32 Participants in a Group Voice Calls
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X