వాట్సాప్ మరో కొత్త ఫీచర్!! గ్రూప్ చాట్‌లో 512 మందికి అనుమతి...

|

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను స్మార్ట్‌ఫోన్‌లను కలిగిఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగిస్తున్నారు. ఏదైనా ఒక సమాచారం అందరికి త్వరగా తెలియజేయడానికి ఉండే మొదటిదారి వాట్సాప్. అయితే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇదే సమాచారం మరింత వేగంగా అందరికి చేరుతుంది. వాట్సాప్ గ్రూప్ చాట్‌లో 512 మంది సభ్యులను జోడించుకోవడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌ను ప్రారంభించినట్లు నివేదించింది. ఈ ఫీచర్‌ను మొదటిసారి గత నెలలో మెటా సంస్థ ప్రకటించింది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లో 2GB స్టోరేజ్ వరకు పరిమితి గల ఫైల్‌లను షేర్ చేయడం మరియు మెసేజ్లకు ఎమోజి ప్రతిచర్యలతో సహా అనేక కొత్త ఫీచర్‌లను కూడా తీసుకువస్తోంది. డిలీట్ చేసిన మెసేజ్‌ల కోసం వాట్సాప్ కొత్తగా 'అన్‌డూ' ఆప్షన్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఈ నెల ప్రారంభంలో మెసేజ్ లను పంపిన తర్వాత వాటిని సవరించడానికి ఒక ఎంపికను జోడిస్తోంది. వీటితో పాటుగా వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొనిరావడానికి తన యొక్క ప్రయత్నాలను చేస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వాట్సాప్ గ్రూప్ చాట్‌లో గరిష్టంగా 512 మంది సభ్యుల చేరికకు అనుమతి

వాట్సాప్ గ్రూప్ చాట్‌లో గరిష్టంగా 512 మంది సభ్యుల చేరికకు అనుమతి

మెటా యాజమాన్యంలోని సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యొక్క ప్లాట్‌ఫారమ్ లోని వినియోగదారులను గ్రూప్ చాట్‌లో గరిష్టంగా 512 మంది సభ్యులను జోడించేలా కొత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. వాట్సాప్ యొక్క తాజా అప్‌డేట్ తో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని WABInfo ఇటీవలి నివేదిక సూచించింది. ఈ ఫీచర్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయితే కొంతమంది వినియోగదారులు తమ వాట్సాప్‌లో ఫీచర్‌ను చూడడానికి 24 గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను మే ప్రారంభంలో మెటా ప్రకటించింది.

UPI యూజర్లకు గుడ్ న్యూస్!! ఆన్‌లైన్ పేమెంట్లకు క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయవచ్చు...UPI యూజర్లకు గుడ్ న్యూస్!! ఆన్‌లైన్ పేమెంట్లకు క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయవచ్చు...

ఫైల్‌ల షేరింగ్
 

వాట్సాప్ యొక్క తాజా అప్‌డేట్ లో ఇంతకుముందు ఫైల్‌ల షేరింగ్ లో 100MB పరిమితి నుండి 2GB వరకు పరిమితిని కూడా వాట్సాప్ పెంచుతోంది. వ్యక్తుల నుండి మరియు గ్రూప్ చాట్‌లలో వారు స్వీకరించే నిర్దిష్ట మెసేజ్ల గురించి ప్రజలు తమ భావాలను మరియు భావోద్వేగాలను టెక్స్ట్‌లో ప్రతిస్పందనలను పంపాల్సిన అవసరం లేకుండా త్వరగా వ్యక్తీకరించడంలో సహాయపడటానికి Meta-యాజమాన్య యాప్ ఇటీవల ఎమోజి రియాక్షన్ లను కూడా పరిచయం చేసింది.

వాట్సాప్ 'అన్‌డూ' ఆప్షన్‌

డిలీట్ చేసిన మెసేజ్‌ల కోసం వాట్సాప్ కొత్తగా 'అన్‌డూ' ఆప్షన్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు సమాచారం. యూజర్లు అనుకోకుండా 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్'కి బదులుగా 'డిలీట్ ఫర్ మి' ఆప్షన్‌లను ఎంచుకున్నప్పుడు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉంది మరియు ఆండ్రాయిడ్‌లోని బీటా టెస్టర్‌లకు ఇంకా అందుబాటులో లేదు. మెసేజ్లను పంపిన తర్వాత వాటిని ఎడిట్ చేసే ఆప్షన్‌ను కూడా వాట్సాప్ జోడిస్తోంది. చాట్ నుండి పూర్తిగా తొలగించకుండా మరియు కొత్త మెసేజ్ ని వ్రాయకుండా వారి మెసేజ్లలో టైపింగ్ లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ ఫీచర్ వినియోగదారులకు సహాయపడుతుంది.

WABetaInfo

WABetaInfo యొక్క నివేదిక ప్రకారం మీరు మీ యొక్క పాత స్మార్ట్‌ఫోన్ నుండి కొత్త ఫోన్ లో మీ వాట్సాప్ అకౌంటుతో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "డబుల్ వెరిఫికేషన్ కోడ్" ఫీచర్ ధృవీకరణ కోడ్ యొక్క మరొక దశను చూపుతుంది. ఈ నివేదిక ప్రకారం వాట్సాప్ అకౌంటులోకి లాగిన్ చేయడానికి మొదటి ప్రయత్నం విజయవంతమయినప్పటికీ కూడా మిగిలిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరో ఆరు అంకెల కోడ్ అవసరం. ఎవరైనా వాట్సాప్ లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఫోన్ నంబర్ కి మరొక అదనపు మెసేజ్ పంపబడుతుంది. "ఇప్పటికే మరో ఫోన్‌లో వాట్సాప్ కోసం మీ యొక్క ఈ +********** నంబర్ ఉపయోగించబడుతోంది. మీ అకౌంట్ మీ నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవడంలో సహాయం చేయడానికి మీరు తప్పనిసరిగా మరొక ధృవీకరణ కోడ్‌ను నిర్ధారించాలి. అదనపు భద్రత కోసం మీరు కోడ్‌ను పంపడానికి ముందు టైమర్ పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. మీరు కోడ్‌ని స్వీకరించిన తరువాత దానిని ఇక్కడ నమోదు చేయండి." అనే మెసేజ్ తో కూడిన స్క్రీన్‌షాట్ ని WABetaInfo తన యొక్క లీక్ లో పోస్ట్ చేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
WhatsApp New Update! Users Can Now Add Upto 512 Members to a Group Chat

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X