వాట్సాప్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్‌లు.. మీకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి..!
వాట్సాప్ (Whatsapp) ప్రస్తుతం ప్రముఖ మెసేజింగ్ యాప్స్‌లో ఒకటిగా ఉంది. యూజర్ల కోసం అనేక ఫీచర్‌లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. యూజర్ల ప్రైవసీ కోసం వాట్సాప్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈ మెటా మెసేజింగ్ ప్లాట్‌ఫాం అనేక ఫీచర్‌లను లాంచ్ చేసింది.
వాట్సాప్‌లో ఎవరెవరు ఆన్‌లైన్ లో ఉన్నారో తెలిసేలా ఫీచర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. అయితే ప్రతి చాట్‌లోకి వెళ్లి చూస్తేనే ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో తెలుస్తుంది. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్ ఇండికేటర్ ఫీచర్ ద్వారా ఒక గ్రూప్‌లో ఉన్న యూజర్లలో ఎంతమంది ఆన్‌లైన్‌లో ఉన్నారో తెలుసుకోవచ్చు. గ్రూప్ పేరు కిందే ఈ వివరాలను గుర్తించవచ్చు.

ఇటీవలే ఐఫోన్ యూజర్‌లకు వాట్సాప్ నుంచే నేరుగా డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేయడం సహా షేర్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా వాట్సాప్‌లో స్కానింగ్ ఆప్షన్ ఉంటుంది.
iOS వాట్సాప్ యూజర్లకు తాజాగా మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వాట్సాప్‌ను తమ డిఫాల్ట్ మెసేజింగ్, కాలింగ్ యాప్‌గా చేసేందుకు అవకాశం ఉంది. వాట్సాప్ సెట్టింగ్స్ ద్వారా ఈ ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ iOS యూజర్‌లకు మెరుగైన వీడియో కాల్స్ అనుభూతిని అందించేందుకు వీలుగా కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా వీడియో కాల్స్ లో జూమ్ ఆప్షన్ ను వినియోగించుకోవచ్చు. మరియు మరో ఫీచర్ ద్వారా నాణ్యమైన వీడియో కాల్ అనుభవాన్ని పొందవచ్చు. ఇందుకోసం టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపింది.
వాట్సాప్ ఛానల్స్‌లోనూ కొత్త ఫీచర్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ చాట్స్ తరహాలోనే ఛానల్స్‌లోనూ అడ్మిన్‌లు వీడియోలను రికార్డు చేసి షేర్ చేయవచ్చు. అయితే ఈ వీడియో 60 సెకన్ల కంటే తక్కువ ఉండాలి.
వాయిస్ మెసేజ్ ట్రాన్సిక్రిప్షన్ : ఛానల్స్‌లోని వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ ఫార్మాట్‌లో మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ లేదా మీటింగ్స్ సమయంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
వాట్సాప్ ఛానల్‌కు ప్రత్యేకమైన QR కోడ్‌ను జత చేసుకోవచ్చు. దీని ద్వారా సులభంగా ఫాలోయర్స్‌ను పెంచుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరిన్ని ఫీచర్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
వాట్సా్ప్ స్టేటస్‌లో మ్యూజిక్ ను యాడ్ చేసుకొనే ఫీచర్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫోటో లేదా వీడియోకు మ్యూజిక్‌ను యాడ్ చేసేందుకు ప్రత్యేక మ్యూజిక్ ట్రాక్ అందుబాటులో ఉంది. ఫోటో కోసం గరిష్ఠంగగా 15 సెకన్ల వరకు ట్రాక్‌ను యాడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా ఇతరులకు ఫోటోలు, వీడియోలను షేర్ చేసినప్పుడు వాటికి అవతలి వ్యక్తులు సేవ్ చేయకుండా నియంత్రించేందుకు అవకాశం ఉండనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఏదైనా సందర్భంలో ఫోటోలు, వీడియోలను షేర్ చేసినప్పుడు, అవి దుర్వినియోగం అవుతాయనే ఆందోళన అవసరం ఉండదు. తొలుత ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
దీంతోపాటు వాట్సాప్ వాయిస్, వీడియో కాల్‌లో మరిన్ని ఆప్షన్‌లు రానున్నాయి. వాయిస్ కాల్‌లో జాయిన్ అయ్యేకంటే ముందే మైక్‌ను మ్యూట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా వీడియో కాల్‌లో జాయిన్ అయ్యే కంటే ముందే కెమెరాను ఆఫ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్లు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








