ఇక నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!

By Madhavi Lagishetty
|

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది యూజర్లు వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తుంది. అందులోభాగంగా ఈ యాప్ వాడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ యాప్ ఇప్పటికే అనేక ఫ్లాట్ ఫాంలపై పనిచేస్తుంది. కానీ త్వరలో కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. వాట్సాప్ సపోర్టును నిలిపివేయనుంది.

 
ఇక నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!

డిసెంబర్ 31,2017 నుంచి బ్లాక్ బెర్రీ OS, బ్లాక్ బెర్రీ 10 మరియు విండోస్ ఫోన్ 8.0 ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ ఇక నుంచి పనిచేయదు. వాట్సాప్ అధికారిక బ్లాగ్ పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. యూజర్లు ఇప్పటి నుంచి ఒక వారం రోజులు మాత్రమే ఈయాప్ ను ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది.

బ్లాక్ బెర్రీ OS, బ్లాక్ బెర్రీ 10 మరియు విండోస్ ఫోన్ 8.0 ఓఎస్ వాట్సాప్ ను ఏడాది జూన్ లోనే వాట్సాప్ సపోర్టు చేయదని ప్రకటించింది. కానీ తర్వాత మళ్లీ గడవును కొన్నినెలలు పొడిగించింది. అలాగే డిసెంబర్ 31,2018నుంచి నోకియా ఎస్ 40 ఓఎస్ ఉన్న ఫోన్లలో,2020ఫిబ్రవరి 1 వ తేదీ నాటికి ఆండ్రాయిడ్ వాడేవారు కొత్త ఫోన్లకు అప్ గ్రేడ్ అయితే వాట్సాప్ సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా పొందేందుకు వీలుంటుంది.

బ్లాక్ బెర్రీ మరియు విండోస్ ఫోన్ ఫ్లాట్ ఫాంలకు సపోర్టు ముగిసిన తర్వాత ఎలాంటి అదనపు పొడగింపు లేదు. బ్లాగ్ పోస్టులో చెప్పినట్లుగా ముగింపు తేదీలు అలాగే ఉంటాయి. విండోస్ ఫోన్7, ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2 మరియు IOS 6వంటి ఫ్లాట్ ఫాంల కోసం వాట్సాప్ అప్ డేట్ కూడా గతేడాది నుంచే నిలిపివేశారు.

తక్కువ ధరతో Samsung Galaxy J2 ( 2018 )వచ్చేస్తోంది !తక్కువ ధరతో Samsung Galaxy J2 ( 2018 )వచ్చేస్తోంది !

వాట్సాప్ ఈ ఏడాది ఎన్నో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. స్టాండ్ లోన్ బిజినెస్ యాప్, వెరిఫైడ్-నాన్ వెరిఫైడ్ ప్రొవఫైళ్లు, అడ్మినిస్ట్రేషన్ కోసం కొన్ని గ్రూప్స్, ఫోటో బిల్డింగ్, ఫోటో ఫిల్టర్లు, వీడియో స్ట్రీమింగ్ తోపాటు అనేక ఫీచర్లను యూజర్లకు అందించింది.

Best Mobiles in India

English summary
WhatsApp will stop working on the dated BlackBerry 10 and Windows Phone 8 operating systems from December 31, 2017. Those who use devices that run on these outdated platforms should consider upgrading their devices in order to continue enjoying the services of the messaging platform.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X