ఇకపై వాట్సప్‌లో ప్లే కానున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వీడియోలు..
అతి త్వరలోనే వాట్సప్ సరికొత్త ఫీచర్లతో జనం ముందుకు రానుంది. ముఖ్యంగా ఐఓఎస్ యూజర్లకు ఇప్పటికే కొత్త ఫీచర్ ను అప్ డేట్ ను అందించింది.
అతి త్వరలోనే వాట్సప్ సరికొత్త ఫీచర్లతో జనం ముందుకు రానుంది. ముఖ్యంగా ఐఓఎస్ యూజర్లకు ఇప్పటికే కొత్త ఫీచర్ ను అప్ డేట్ ను అందించింది. ఈ కొత్త అప్ డేట్ లో భాగంగా వాట్సప్ లో షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ వీడియోలను ప్లే చేసే వీలు దక్కింది. ఇప్పటికే వాట్సప్ ద్వారా యూట్యూబ్ వీడియోలు ప్లే చేసుకునే వీలుంది. గతంలో యూజర్లు ఈ వీడియోలను చూడాలంటే సంబంధిత యాప్ లను ఓపెన్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోని వీడియోలను వీడియో ప్లేబ్యాక్ ద్వారా ప్లే చేసుకునే సదుపాయం కల్పించేందుకు వాట్సప్ సిద్ధమయ్యింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే కొత్త అప్ డేట్ ద్వారా అన్ని స్మార్ట్ ఫోన్లను పలకరించనుంది.

అలాగే కొత్త అప్ డేట్ లోనే పీఐపీ(పిక్చర్ ఉన్ పిక్చర్ మోడ్) అనే కొత్త ఫీచర్ ను కూడా జత చేశారు. దీని ద్వారా యూజర్స్ వీడియో స్మాల్ విండోలో ప్లే చేసి చూస్తూనే నేవిగేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ స్మాల్ విండోలోని వీడియోను ప్లే, పాజ్ తో సహా క్లోజ్, ఎక్స్‌పాండ్ చేసుకునే వీలు కల్పించారు.
ఇటీవలే మార్క్ జుకర్‌బర్గ్ ఒక సదస్సులో అనౌన్స్ చేస్తూ.. త్వరలోనే గ్రూప్ కాలింగ్ యాప్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ లో ఒకేసారి నలుగురు వ్యక్తులతో గ్రూప్ వీడియో కాలింగ్ ద్వారా కాన్ఫెరెన్స్ సైతం నిర్వహించుకునే వీలుంది. వాట్సప్ స్టేటస్ తో సహా స్నాప్ చాట్ నుంచి ప్రేరణ పొందిన ఫీచర్ నాలుగున్నర కోట్ల మంది యాక్టివ్ యూజర్లకు చేరువయ్యింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ తో వాట్సప్ అదరగొట్టనుంది. దీంతో స్నాప్ చాట్ ఎన్ని కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టినా వాట్సప్ ఆదరణకు అడ్డుకట్ట వేయలేకపోతోంది.
మరోవైపు వాట్సప్ కంపెనీ సీఈవో జాన్ కోమ్ త్వరలోనే కంపెనీని వీడనున్నట్లు ప్రకటించారు. తాను తన ఫ్రెండ్ బ్రయాన్ కలిసి పదేళ్ల పాటు కొనసాగించిన ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications