ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్ మరింత సేఫ్

ఆడియో మెసేజెస్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

|

తమ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత డేటాకు మరింత సెక్యూరిటీని కల్పించేందుకు 'టు-సెప్ట్ వెరిఫికేషన్'(2-step verification) పేరుతో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం బేటా వర్షన్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Read More : రూ.10,000లో బెస్ట్ 3జీబి ర్యామ్ ఫోన్‌లు

వేరొకరు మీ వాట్సాప్ అకౌంట్‌లోకి

వేరొకరు మీ వాట్సాప్ అకౌంట్‌లోకి

2-step verification సెక్యూరిటీని ఎనేబుల్ చేసుకున్నట్లయితే యాప్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి మీకో passcode అందుతుంది. ఆ పాస్‌కోడ్‌ను ఎంటర్ చేస్తేనే అకౌంట్ ఓపెన్ అవటం జరుగుతుంది. ఈ సెక్యూరిటీని యాడ్ చేసుకోవటం వల్ల వేరొకరు మీ వాట్సాప్ అకౌంట్‌లోకి చొరబడే అవకాశం ఉండదు. 

స్టెప్ 1

స్టెప్ 1

మీరు వాట్సాప్ బేటా యూజర్‌గా నమోదైనట్లయితే టు-సెప్ట్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను, మీ వాట్సాప్‌కు సంబంధించి అకౌంట్ సెట్టింగ్స్‌లో చూడొచ్చు. ఈ ఆప్షన్‌లోకి వెళ్లి ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఇప్పుడో 6 అంకెలతో కూడిన ఓ passcode మీ వాట్సాప్ మొబైల్ నెంబర్‌కు అందుతుంది. ఈ పాస్‌కోడ్‌ను వెరిఫికేషన్ కాలమ్‌లో ఎంటర్ చేయండి. అదనపు సెక్యూరిటీ కోసం మీ మెయిల్ ఐడీని కూడా జోడించవచ్చు.

డిసేబుల్ చేసుకునే అవాకశం

డిసేబుల్ చేసుకునే అవాకశం

ఈ ఫీచర్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు డిసేబుల్ చేసుకునే అవాకశం ఉంటుంది. గూగుల్, ఫేస్‌బుక్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ కంపెనీలు టు-సెప్ట్ వెరిఫికేషన్ విధానాన్ని ఇప్పటికే ఆచరణలో ఉంచాయి.

ఆడియో మెసేజెస్..

ఆడియో మెసేజెస్..

టు-సెప్ట్ వెరిఫికేషన్ సదుపాయంతో పాటు ఆడియో మెసేజెస్ పేరుతో సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు చీటికి మాటికి వాట్సాప్ విండోలోకి స్విచ్ కాకుండా తమపని తాము చేసుకుంటూనే వాట్సాప్ మెసెజ్‌లను ఆడియో రూపంలో వినొచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Whatsapp now comes with 2-step verification to keep your account safe. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X