Home
Apps

వాట్సాప్‌ నుంచి ఇలాంటి ఫీచర్‌ వస్తుందని ఎవరూ ఉహించి ఉండరు.. కానీ..!

Whatsapp : ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ గురించి వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo కీలక వివరాలను వెల్లడించింది. వాట్సాప్‌ ప్రస్తుతం ఎక్కువ మందికి ఉపయోగపడే ఫీచర్‌పైన పనిచేస్తోందని తెలిపింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ ను కూడా షేర్‌ చేసింది.

ఇలాంటి వారితోనూ వాట్సాప్‌ చాటింగ్‌ :
వాట్సాప్ నుంచి వాట్సాప్‌ కు మెసేజ్‌ చేసేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. అయితే వాట్సాప్‌ అకౌంట్‌ లేని వ్యక్తులకు కూడా వాట్సాప్‌ నుంచి మెసేజ్‌ చేసేందుకు ప్రస్తుతానికి అవకాశం లేదు. వాట్సాప్ ఫీచర్‌ ట్రాకర్‌ వెల్లడించిన వివరాల ఆధారంగా త్వరలో వాట్సాప్‌ అకౌంట్‌ లేని వ్యక్తులకు కూడా వాట్సాప్‌ నుంచి చాటింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

whatsapp now working on guest chat feature here are the interesting details

గెస్ట్‌ చాట్‌! :
ప్రస్తుతం ఈ ఫీచర్‌పైన వాట్సాప్‌ పనిచేస్తోందని ఫీచర్‌ ట్రాకర్‌ వెల్లడించింది. త్వరలో బీటా వెర్షన్‌ విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. గెస్ట్‌ చాట్‌గా పేర్కొంది. అయితే ఈ ఫీచర్‌లో భాగంగా వాట్సాప్‌ అకౌంట్‌ లేని వ్యక్తులకు లింక్‌ షేర్‌ చేసి, వారితో చాట్‌ చేయవచ్చు.

అకౌంట్‌ అవసరం లేదు.. యాప్‌ కూడా.. :
ఈ లింక్‌లో చాట్‌ చేసేందుకు వాట్సాప్‌ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు మరియు అకౌంట్‌ క్రియేట్‌ చేయాల్సిన అవసరం కూడా లేదని వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ వెల్లడించింది. సింపుల్‌గా బ్రౌజర్‌లో లింక్‌ ఓపెన్‌ చేసి చాట్ చేసుకోవచ్చు. ఈ విధానంలో కేవలం చాటింగ్ చేసుకొనేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది.

ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ :
గెస్ట్‌ ఛాట్‌ ఆప్షన్‌లో ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ నోట్స్‌ వంటివి పంపేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. ఫలితంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి కూడా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సపోర్టు ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉందని ఫీచర్‌ ట్రాకర్‌ తెలిపింది. అయితే ఎప్పటి లోగా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుందో మాత్రం వెల్లడించలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

వాట్సాప్‌ క్విక్‌ రీక్యాప్ :
ఇటీవల వచ్చిన వివరాల ఆధారంగా వాట్సాప్‌ క్విక్‌ రీక్యాప్ ఫీచర్‌ పైన పనిచేస్తోందని ఫీచర్‌ ట్రాకర్‌ తెలిపింది. ఈ ఫీచర్‌ ద్వారా ఒకేసారి Multiple Chats సారాంశాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. మెసేజ్‌ సమ్మరీస్‌ ఫీచర్‌ తరహాలోనే క్విక్‌ రీక్యాప్‌ ఫీచర్‌ మెటా ప్రైవేట్ ప్రాసెసింగ్‌ టెక్నాలజీని వినియోగించుకుంటుంది.

వాట్సాప్ క్విక్‌ రీక్యాప్‌ ఫీచర్‌.. ఆప్షనల్‌గా ఉంటుందని తెలుస్తోంది. అయితే అడ్వాన్స్‌డ్‌ చాట్ ప్రైవసీ యాక్టివేట్ చేసిన చాట్‌ల సారాంశాన్ని తెలుసుకొనేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడదని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫీచర్‌ గోప్యతకు ఎటువంటి భంగం కలిగించదని చెబుతోంది.

ఈ ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చాక.. కావాల్సిన చాట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతం 3 డాట్‌ మెనూ ఐకాన్‌ పైన క్లిక్‌ చేసి, అక్కడ కనిపించిన క్విక్‌ రీక్యాప్‌ ఆప్షన్‌ ను ఎంచుకోవాలి. అయితే గతంలో వచ్చిన వివరాల ఆధారంగా ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉంది. ఎ‌ప్పటికి విడుదల కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
whatsapp now working on guest chat feature here are the interesting details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X