చైనా దిగ్గజం షియోమి మార్కెట్లో ఎంతగా దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే. మార్కెట్లో అధికశాతం ఫోన్లు ఆ కంపెనీవే..అయితే ఇప్పుడు షియోమి ఫోన్ యూజర్లను ఓ న్యూస్ కలవరపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ లో దూసుకపోతున్న యాప్ వాట్సప్ షియోమి ఫోన్లలో పనిచేయడం లేదనే కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు షియోమి యూజర్లు ఈ విషయం మీవ ఆ కంపెనీకి ఫిర్యాదులు చేస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాబట్టి మీ షియోమీ ఫోన్‌లో వాట్సాప్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఒక సారి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేయాలి. సమస్య ఏంటి అనేదానిపై ఓ లుక్కేయండి.
ఆపిల్ కొత్త ఆఫీసు వీడియోను చూశారా, కళ్లు బైర్లుగమ్మాల్సిందే మరి !
జనవరి 1వ తేదీన..
ఈ ఏడాది జనవరి 1వ తేదీన అర్థరాత్రి సమయంలో కొన్ని గంటల పాటు వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. తరువాత మళ్లీ యథావిధిగా వాట్సప్ పనిచేయడం ప్రారంభించింది.
సమస్య ఇప్పుడు పలు షియోమీ ఫోన్లకు..
ఆ సమస్య ఇప్పుడు పలు షియోమీ ఫోన్లకు వచ్చినట్లు తెలిసింది. షియోమీకి చెందిన పలు మోడల్ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్లు తమ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం లేదని ఫిర్యాదులు ఇస్తున్నట్లు సమాచారం.
చాలా మంది షియోమీ ఫోన్ యూజర్లకు..
చాలా మంది షియోమీ ఫోన్ యూజర్లకు This version of WhatsApp became obsolete 0n 13 Jan, 2018 అనే మెసేజ్ రాగా, సదరు యూజర్లు తమ వాట్సప్ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకుందామని చూస్తే గూగుల్ ప్లేలో అప్‌డేట్ ఏమీ రావడం లేదని చెబుతున్నారు.
వాట్సప్ యాప్‌ను పూర్తిగా తీసేసి..
మరో వైపు వాట్సప్ యాప్‌ను పూర్తిగా తీసేసి మళ్లీ కొత్తగా ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్నా వాట్సప్ పనిచేయడం లేదని, పైన చెప్పిన లాంటి మెసేజ్‌ను చూపిస్తుందని యూజర్లు అంటున్నారు.
కొద్ది మంది యూజర్లకు మాత్రమే..
అయితే ఈ సమస్య కేవలం షియోమీ ఫోన్లలో అది కూడా కొద్ది మంది యూజర్లకు మాత్రమే వస్తున్నందున దీన్ని తమ యాప్ సమస్యగా వాట్సప్ భావించడం లేదు. ఆ సమస్య ఆయా ఫోన్ల వల్లే వచ్చి ఉండి ఉంటుందని, కనుక ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని మరో వైపు వాట్సప్ చెబుతోంది.
మీ ఫోన్లలో ఈ సమస్య ఉంటే..
మీ ఫోన్లలో ఈ సమస్య ఉంటే మీరు వెంటనే మీ ఫోన్లో ఉన్న వాట్సప్ తీసివేసి మళ్లీ ఫ్రెష్ గా డౌన్లోడ్ చేసుకోవాలని షియోమి చెబుతోంది. ఇందుకోసం Settings > enable automatic date and time > automatic time zone > kill all apps > relaunch WhatsApp ఉపయోగించమని చెబుతోంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.